ఆత్మీయ రైతు సోదరులకు మరియు రైతు బిడ్డలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Wednesday, 31 December 2014
Friday, 26 December 2014
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు : విశ్లేషణ
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు : విశ్లేషణ
ఒక వ్యక్తీ బియ్యం ఉపయోగించేది రోజుకి 100 గ్రాములు , ౩౦౦ గ్రాముల నీరుతో వండిన అన్నం 400 గ్రాములు సగటు వినియోగం , నగరాలలో ఈ రోజు ఒక ఇడ్లి కరీదు 10 రూపాయల పైమాటే , కిలో 40 రూపాయిలు అయినా 100 గ్రాముల ధర నాలుగు రూపాయిలు మాత్రమే , భారత్ దేశం లో అరవై శాతం మంది ఇంకా వ్యవసాయం మీదే ఆధార పడి ఉన్నారు వీరిలో చాలా వరకు వారికి కావాల్సిన ధాన్యపు గింజలను నిలువ చేసుకునే అలవాటు ఉన్నవారే , ఇందులో అలా వీలు కాని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో 1 నుండి 2 రూపాయలకే బియ్యాన్ని అందిస్తున్నారు , ఓ పది శాతం శ్రీమంతులు ఎంత ధర అయినా పెట్టి బాసుమతి , బాసుమతి లాంటి రకాలను కొనుక్కోగలుగుతున్నారు , మిగిలిన 30 శాతం మధ్యతరగతి వారు , వీరంతా శారీరిక శ్రమ చెయ్యని వారే , వీరిలో కొంత మంది మధుమేహం లాంటి సమస్యలతో బియ్యాన్ని తక్కువే వినియోగిస్తున్నారు , అయెతే బియ్యం ధర కొద్దిగా పెరిగినా , లేదా ఆహార పదార్థాల ధర పెరిగినా ప్రతిపక్ష పెద్దలు మీడియా వారు దీన్ని గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేస్తూ ఆహార పదార్తల ఉత్పత్తి దారులైన రైతులను నిరుత్సహపరుస్తున్నారు , అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధార పడినప్పుడు , వారి ఆదాయం పెరగకపోతే దేశం లో తాయారు అవుతున్న పారిశ్రామిక ఉత్పత్తులు , మిగిలిన నిత్యావసరాలు వినియోగం క్షిణిస్తుంది , ప్రజలు విద్యావంతులు కావాలన్నా , ఆరోగ్యవంతులు గా జీవించాలి అన్నా ఆర్ధికంగా పరిపుష్టి చెందితే తప్ప ప్రభుత్వాలు ఎన్ని ప్రణాలికలు వేసినా ఎన్ని సుబ్సిడిలు ఇచ్చినా , ఎన్ని ప్రచారాలు చేసినా , ఇవన్ని కేవలం ఆర్భాటాలు గా మాత్రమే మిగిలిపోతున్నాయి , ఆర్ధికంగా బలపడిన వ్యక్తీ కుటుంభ నియంత్రణ , పిల్లల విద్య , పరిశుబ్రత వారంతటికి వారే అనుసరిస్తూ వృద్ది చెందుతున్నారు , ఆర్ధికంగా ఎదగలేని వ్యక్తులు ప్రభుత్వాలు ఎన్ని ప్రణాలికలు రూపొందించినా , ఉదాహరణకు నిర్బంద విద్య , కుటుంభ నియంత్రణ , పరిసర పరిశుబ్రత ( టాయిలెట్స్ , తాగడానికి నీళ్ళే లేని చోట్ల టాయిలెట్ ఎలా ఉపయోగించగలరు ? )
కనుక గ్రామీణ ఆర్ధిక పరిపుష్టికి రైతుల ఉత్పత్తులకు సరైన ధర ఇవ్వగలిగినప్పుడు గ్రామీణ ప్రజల ఆర్ధిక పరిస్తితి మెరుగవుతుంది , కనుక ప్రభుత్వం చిన్న రైతు పెద్ద రైతు అనే వ్యత్యాసం చూపించకుండా వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తి కర్చు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ముమ్మరం చెయ్యాలి.
అలాగే రైతులలో నూతన విధానాల పై అవగాహన పెంచే లా , వ్యవసాయ శాస్త్రవేత్తలకు అధికారులకు నిరంతర లక్ష్యాలను నిర్దేశించి భాద్యులను చెయ్యాలి , ఉత్పత్తి కర్చులను తగ్గించిన రైతులను గుర్తించి (పార్టీలకు అతీతంగా ) వారిని ప్రోత్సహించి వారి ద్వారా కూడా మిగిలిన రైతులను చైతన్యవంతులను చేసే దిశగా ప్రభుత్వం చరియలు చెప్పటాల్సిన అవసరం ఎంతైనా ఉంది .
Thursday, 25 December 2014
Iran may resume basmati Imports from February బాసుమతి పండించిన రైతులకు శుభవార్త
బాసుమతి పండించిన రైతులకు శుభవార్త
ఈ సంవత్సరం ఉత్తర భారత దేశం లో బాసుమతి సాగు మరియు దిగుబడి బాగా పెరిగినందువల్ల మరియు ఇరాన్ దిగుమతుల పై తాత్కాలిక నిషేధం విధించినందువల్ల తాత్కాలికంగా రేట్ తగ్గినప్పటికీ ఫెబ్రవరి నుండి ఇరాన్ తమ దిగుమతి నిషేదాన్ని రద్దు చేసుకుంటున్నoదు వల్ల రేట్ పెరిగే అవకాశం ఉంది , ఇరాన్ వినియోగించే దానిలో సగానికి పైగా దిగుమతుల మీద ఆధార పడుతుంది , ప్రతి సంవత్సరం దాదాపు 10 % వినియోగం పెరుగుతోంది , మన దేశంలో కూడా వినియోగం నానాటికి పెరుగుతోంది , గత సంవత్సరం అవసరానికి తగినంత ఉత్పత్తి లేనందువల్ల క్వింటాల్ ధాన్యం ధర 1121 రకం 4000 దాటింది , అందువల్లే పంజాబ్ రైతులు చాలా మంది బాసుమతి వైపు మళ్ళారు , ఈ సంవత్సరం ధర తగ్గటం వల్ల వారు కొంత నిరాశ పడ్డారు ,
బియ్యం వినియోగించని రాష్ట్రాలలో ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొని లెవీ రూపం లో సేకరిస్తుంది 17 % తెమ తో కొని వెంటనే డబ్బు మొత్తం చెల్లించే ఏర్పాటు ఉంది , కనుక ఆ రాష్ట్రాలలో మన లాగా బస్మతిఎతర రకాలకు మార్కెట్ సమస్య లేదు అయెతే బియాన్ని ఆహారంగా వినియోగించే రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణను తగ్గించింది తద్ద్వారా రాబోయే రోజుల్లో ముతక రకాలు పండించే ప్రాంతం లో రైతులకు అమ్ముకోవడం కష్టం అవుతుంది , గత మూడు నాలుగు సంవత్సరాలనుండి ముతక బియ్యం export ధర కిలో 20 నుండి 21 దగ్గరే ఉండి పోయింది ఉత్పత్తి ధర పెరిగినప్పటికీ అంతర్జాతీయంగా ధర తక్కువ ఉన్న రకాలు పండిస్తే రైతులకు మేలు జరగదన్న విషయాన్నీ మేం చాలా సార్లు చెప్తూ వచ్చాము , ఇటీవల APEDA అధ్యక్షలు హైదరాబాద్ లో ఈ విషయం పై చర్చించి ఎగుమతి అవుతున్న బియ్యం టన్ను 400 డాలర్లు ఒక పక్క , మరో పక్క టన్ను 12 నుండి 15 వందల డాలర్లు ( అనగా బాసుమతి ) ఈ వ్యత్యాసాన్ని తగ్గించే విధంగా శాస్త్రవేత్తలు 800 నుండి 1000 డాలర్లు టన్నుకు పలికే నూతన వంగడాలను ప్రవేశపెట్టాలి అని పరోక్షంగా బాసుమతి లాంటి బారు రకాలను ఉద్దేశించి చెప్పారు , కనుక రైతు సోదరులు తమకు లాభసాటిగా ఉండే రకాలను గురించి ఆలోచించాలి
Monday, 22 December 2014
42 days old jowar crop of sri paidipally dasharada rao garu
![]() |
| శ్రీ పైడిపల్లి దశాదరావు గారు, మిత్రమా పంచుకో నీ అనుభవాన్ని సాటి రైతు మిత్రులతో ... |
Saturday, 20 December 2014
మొక్కల సాంద్రత దిగుబడి
రైతు
సోదరులకు ..
చాలా మంది
జిగురు గోరుచిక్కుడు ఎప్పుడు
వేస్తె బాగుంటుంది అని అడుగుతున్నారు , ఇంతకుముందు చాలా సార్లు రాసాను , నవంబర్ నెల రైతు నేస్తం వ్యవసాయ
మాస పత్రికలో నా వ్యాసాన్ని
ప్రచురించారు , మరిన్ని వివరాలకొరకు ఆ
ఆర్టికల్ చదవగలరు
ఈ పంటను
జనవరి నేలాఖరిలోగా వెయ్యగలరు ,
చాలా మంది రైతులు దిగుబడి ఎంత వస్తుంది అని అడుగుతున్నారు, దీనికి ప్రతి మొక్క కనీసం
10 గుత్తులు కాస్తే గుత్తికి
ఏడు కాయలు , కాయికి
7 గింజలు (10 x 7 =70 x 7 =490
గింజలు ) ప్రతి ముప్ఫై
గింజలు ఒక గ్రాము , ఈ విధంగా ఒక మొక్క
షుమారు 16 గ్రాములు
గింజలను పండించ గలిగితే ఎకరానికి
ఒక లక్ష మొక్కలు ఉండే విధంగా
విత్తుకోగలిగితే ఎకరానికి 16 క్వింటాళ్ళ దిగుబడి సాదించవచ్చు , దీని బట్టి మనం
తెలుసుకునే ముఖ్య విషయం ఏంటి అంటే
, పొలం లో విత్తే టప్పుడు మొక్కల సాంద్రత సరిపడా ఉండేటట్టు చూసుకుంటే
రైతుకు మంచి దిగుబడి
సాదించడానికి అవకాశం ఉంటుంది
Sunday, 14 December 2014
letter
రాయచూరు
15.12.14
ప్రియాతిప్రియమైన మిత్రులు
తెలుగు విద్యార్ధి గారికి మీ మిత్రుడు
కొల్లూరి వెంకట కృష్ణా రావు వ్రాయు లేఖార్ధములు, ఇక్కడ మేమంతా క్షేమం గానే
ఉన్నాం , మీ క్షేమ సమాచారం తెలుపగోరతాము
.
మీ
పిత్రుసమానులైన కొల్లూరి కోటేశ్వరరావు గారు , స్వర్గస్తులైన వెంటనే
మీకు ఉత్తరం రాయాలి అనుకున్నాను , జరా మరణములు సహజములే
, మీలాంటి సాహితి పుత్రులను కలిగిన
కోటేశ్వరరావు గారు అమరులే , ఈ
విషయాన్నీ మీకు వ్రాసే అంతటి పెద్దవాడిని
కాకపోయినా ఏదో నాకు తెలిసిన విధంగా వ్రాస్తున్నాను , కార్డు కొరకు చాలా
రోజులనుండి ప్రయత్నిస్తే, ఉత్తరాలు
రాసే రోజులు ఎప్పుడో పోయాయి , కార్డ్లు
కవర్లు లేవు మెయిలు పంపండి తాతగారు అంటూ
నా మనమరాలు చిన్న సలహా ఇచ్చింది.
అయ్యా పిల్లకాకి
దానికేం తెలుసు ఉత్తరాల మహిమ , మా చిన్నప్పుడు చెట్టు పై కాకి అరిస్తే చుట్టా లైనా రావాలి , ఉత్త రాలైనా
రావాలి అని ఎదురు చూసే వాళ్ళం ,
ఉత్తరం వస్తే ఆనందం , చుట్టాలొస్తే
పరమానందంగా ఉండేది , ఆ విషయాలు వారికి
చెప్పినా అర్ధం కావు , అంతే కాదు
ఫలానా రోజు వస్తున్నాం అని ఉత్తరం
వ్రాసి దూరప్రాంత నగరాలనుండి వస్తున్న చుట్టాలకొరకు ఎదురు చూస్తూ
వారు వచ్చే నాటికి ఏమేమి వంటకాలు
చెయ్యాలి అని ఆలోచించే వాళ్ళం , జున్ను పాల కొరకు
ఎవరి ఆవు ఈతకు వచ్చిందో తెలుసుకునే వాళ్ళం , ఉలవలు
ఎవరెవరు ఎడ్లకు పెడుతున్నారో
తెలుసుకునే వాళ్ళం , ఎందుకంటే
పట్నం నుండి వచ్చే చుట్టాలకు ఉలవచారు
రుచి చూపించాలి కదా , ఇలాంటి ప్రయత్నాలు
చేస్తూ ఎంతో సంబరంగా ఆ రాబోయే చుట్టాల రాక కొరకు ఎదురు చూస్తూ
ఉండేవాళ్ళం , అంతే కాదండోయి , ప్రక్క
ఊళ్ళో ఉన్న మా బంధువులకు ఈ విషయం తెలియజేస్తే వచ్చిన భందువుల్ని వారింటికి కూడా తీసుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకునే వారు , అదే భందువుల సంఖ్య ఎక్కువ ఉంటె , వచ్చినవారు తక్కువ రోజులు
ఉండేటట్టు అయెతే , పూటకు ఒకరి చొప్పున
వార్ని విందుకు ఆహ్వానించే వారు ,
అయ్యా ... తెలుగు విద్యార్ధి గారు, పూర్వం
మీలాంటి సారస్వత పుత్రులను చదివి ,
మా అభిప్రాయాలను వ్రాస్తే వచ్చే సంచిక లో మా పేరు వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ ,
రాక పొతే నిరాశ చెందక , మళ్ళి మళ్ళి వ్రాస్తూ సంవత్సరాల తరబడి ఉత్తరాలు రాసేవాళ్ళం , వారి
దయతో మా పేరు ప్రచురిoచ బడితే జన్మ ధన్యమైనట్టుగా భావించి
ఆ పత్రిక ను అపురూపంగా చూస్తూ
అడిగినవారికి , అడగని వారికి చూపిస్తూ
పరమానంద పడి పోయేవాళ్ళం , ఆ రోజులు
పోయాయి , ఇప్పుడంతా ఇంటర్నెట్ ,
ఫేస్బుక్ , ఈ మెయిల్స్ , క్షణాలలో
ప్రపంచమంతా తెలిపే సాధనాలు
వచ్చేశాయి తాత గారు అంటూ
నా మనవరాలు అంటుంటే నా మనసు అంగీకరించక , అదేంటమ్మ పత్రికలలో చాలా ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా అని అంటే ,
అవన్నీ బహుమతుల ఆశచూపి పత్రికల వారు
రాయించుకునే ఉత్తరాలు తాతగారు అంటూ , ఒక
పత్రిక లో రెండు బొమ్మలు వేసి తేడాలు కనిపెట్టి రాస్తే 500 బహుమతి, సరిగ్గా వ్రాసిన ఉత్తరాలలో డ్రా తీసి ముగ్గురికి సమానంగా బహుమతిని పంపుతాము అంటూ
ఆశ చూపి రాయించుకునే ఉత్తరాలే
తాతగారు అంటూ నా మనవరాలు
ఉత్తరాన్ని చిన్న చూపు చుస్తే చూడవచ్చు కాని నేను మాత్రం మీకు
ఉత్తరాలు రాస్తూనే ఉంటాను , మీరు కూడా విసుగు చెందక తప్పక చదవగలరు అని ఆశిస్తున్నాను , నాన్నగారి
ఆత్మకు శాంతి చేకూర్చాలి అని ఆ భగవంతుడిని
ప్రార్ధిస్తున్నాను , మన మిత్రులు అందరిని అడిగినట్టు
చెప్పగలరు , ఈ ఉత్తరం అందిన వెంటనే
మీ అందరి యోగక్షేమాలతో ఉత్తరం
రాయగలరు , మీ ఉత్తరం కొరకు వేయి
కళ్ళతో ఎదురు చూస్తుంటాను , నేను
పెద్దగా చదువుకొని సంగతి మీకు తెలుసు
, ఈ ఉత్తరంలో ఏమైనా తప్పులు
ఉంటె మన్నించగలరు .
ఇట్లు
భవదీయుడు
కొల్లూరి వెంకట కృష్ణా రావు , రాయచూరు , కర్ణాటక
Thursday, 11 December 2014
తగ్గిన ధాన్యం ధరలు
12.12.2014
రైతు
సోదరులారా
ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల
ధరలు తాత్కాలికంగా తగ్గుదలలో ఉన్నాయి , కారణాలు ధాన్యం
ధర తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం లెవీ
విధానంలో తీసుకున్న మార్పులు , ప్రభుత్వం
వద్దే దాదాపు 3.5
కోట్ల టన్నులు బియ్యం
నిలువ ఉండడం , పేదలకు ఇచ్చే రూపాయి
రెండు రూపాయిలు కి ఇచ్చే బియ్యం తిరిగి మార్కెట్లోకే రావడం , ఇలాంటి కారణాల వల్ల
ముతక బియ్యం ధరలు తగ్గే అవకాశాలు
ఉన్నాయి , అయెతే సన్న బియ్యం అనగా
సోనా మసూరి , సాంబ మసూరి BPT , జై
శ్రీ రాం , బాస్మతి లాంటి
బియ్యానికి కూడా ధరలు తగ్గించి
కొనుక్కోవడానికి వ్యాపార
వర్గాలు చేస్తున్న ప్రయత్నమే
కాని మరొకటి కాదు , కనుక
మంచి డిమాండ్ ఉన్న పై రకాలను తక్కువ ధరలకు అమ్మవద్దు ,
ఇప్పటికే ఈ వారంలో జై
శ్రీ రాం రకం ధాన్యం ధర తగ్గి
మళ్ళి పెరుగుతుంది , ఆ రకం ధాన్యం ముందుగా మార్కెట్లోకి రావడం వల్ల రైతు
సోదరులు అందరు ఎక్కువ శాతం అమ్మేసుకున్నారు , అయెతే ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి , సకాలం వర్షాలు
లేకపోవడం తరువాత తుఫాన్లు , అధిక వర్షాలు తెగుళ్ళు
మొదలైన సమస్యలతో గత సంవత్సరం దాదాపు
10.5 కోట్ల టన్నులు బియ్యం
ఉత్పత్తి జరగగా ఈ సంవత్సరం 9
కోట్ల టన్నులే ఉండవచ్చు
అని ముందస్తు అంచనాలు
చెప్తున్నాయి , కూలీల కొరత ఎరువుల ధరల పెరుగుదల సకాలం లో పెట్టుబడులు అందక అధిక వడ్డిలకు
రైతులు అప్పులు చేసి , తగ్గిన ధాన్యం ధరల వల్ల
తీవ్ర నష్టాలకు గురై నిరాశతో
ఉన్నారు . అయెతే ప్రస్తుత తరుణంలో రైతు ఉత్పత్తి కర్చులను
తగ్గించే దిశగా ఆలోచించాలి , స్వల్ప కాలిక
రకాలు తక్కువ ఎరువులతో , తక్కువ కర్చుతో
ఎక్కువ దిగుబడినిస్తున్న నూతన విధానాలు అనగా
విత్తనాన్ని నేరుగా విత్తడం ,
దమ్ము చేసిన చేలో వెదజల్లటం అవసరమైన
మేరకే ఎరువులను వాడటం , అవసరానికన్నా
ఎక్కువ ఎరువులను వాడి ఎక్కువ దిగుబడులను తియ్యొచ్చు అనే అపోహలనుండి బైటకు రావాలి , వరి సాగు లో ఎకరానికి
కర్చు పది నుండి
15 వేలు పెడుతున్న రైతులు ఒక వైపు , 25 నుండి 30 వేలు కర్చు పెడుతున్న
రైతులు ఒక వైపు కనిపిస్తున్నారు , అయెతే దిగుబడి మాత్రం
35 నుండి 40 బస్తాలు
సరాసరి దిగుబడి మాత్రమే వస్తుంది , అధిక ఉత్పత్తుల ప్రయత్నం వల్ల అత్యదిక కర్చులు పెట్టి రైతు నష్టపోవడం జరుగుతుంది కనుక రైతు సోదరులంతా తప్పనిసరి పోలాలలో మాత్రమే వరిని పండించే ప్రయత్నం చెయ్యండి , నానాటికి దేశంలో మధుమేహ
రోగులు పెరుగుతున్న ఈ తరుణంలో
బియ్యం తలసరి వినియోగం
తగ్గుతూ వస్తుంది , ఇది ప్రపంచ
వ్యాప్తంగా వస్తున్న మార్పు కనుక రైతు సోదరులందరూ దిన్ని గమనించి ధాన్యం
ఉత్పత్తి కర్చును చేతనైనంత వరకు తగ్గించాలి , అలాగే ప్రతి రైతు
తప్పని సరిగా మన మన మాతృభాషలలో
వస్తున్న వ్యవసాయ మాస పత్రికలను తప్పనిసరిగా
కొని చదువుతూ అవగాహనను
పెంచుకోవచ్చు
58 cows die due to food poisoning at Sindhanur Goshala
అధిక దిగుబడులు సాధించాలి అనే ప్రయత్నం లో అత్యదిక ఎరువుల వినియోగం ఫలితంగా వచ్చిన తెగుళ్ల నియంత్రణ కు వాడిన క్రిమిసంహారక మందుల అవశేషాలు కలిగిన వరి గడ్డిని తిని మనం కామధేను గా పూజించే గోమాతల మరణం చాలా భాధాకరం , ఇటువంటి విషపూరిత ఆహరం తీసుకుంటున్న మనం కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం ...ఆలోచించండి రైతన్నలారా
NATIONAL » KARNATAKA
RAICHUR, December 8, 2014
Updated: December 8, 2014 19:00 IST
58 cows die due to food poisoning at Sindhanur Goshala

Fifty-eight cows have died and 162 more were in critical condition after apparently consuming poisonous fodder at a Goshala in Sindhanur, about 95 kms from Raichur, on Monday morning. The Goshala is being run by Bhagavan Mahaveer Charitable Trust.
According to the details provided by the Goshala management, the workers had served fodder to the cattle twice at 8 p.m. and 9 p.m. on Sunday before going to bed. The tragedy was discovered when they woke up at 5.30 a.m. on Monday as usual.
“The workers immediately alerted the Goshala management and we in turn summoned veterinary physicians right away,” Lalchand Jain, secretary of the Trust said.
By the time veterinary staff rushed to the spot and swung into action, 58 cows were already dead. They began treating other cows that were in critical condition and succeeded in saving them.
Poisoning
Veterinary staff concluded that the food poisoning could be the cause for cattle death. “Though the exact cause for death could be ascertained only after we get a detailed post-mortem report. Yet, we couldprima facie conclude that it is a case of food poisoning,” Eerappa, a veterinary physician attached to Javalagera veterinary centre, said.
It is learnt that recently harvested bundles of paddy straw, that were contaminated with pesticides sprayed before the harvest, was served to the cattle.
“Most of the dead cows have been buried en mass to prevent environment pollution and spread of infection. A couple of them are retained for post-mortem,” Deputy Superintendent of Police M.V. Suryavamshi, who visited the spot told The Hindu.
Huge crowd
As the news of cows’ death spread in Sindhanur and surrounding villages, hundreds of people rushed to the spot. Some people angrily expressed their dissatisfaction over the way the Goshala was being run. They alleged that the cows in the Goshala were not taken care of with sufficient and quality fodder.
Sindhanur tahashildar, M. Gangappa Kallur, Agriculture Price Commission member, Hanumanagowda Belagurki, Circle Inspector of Police (Sindhanur circle) Ramesh Rotti, Sindhanur Rural Police Sub-Inspector, Balanagowda were among the officials who visited the spot.
Monday, 1 December 2014
Fall in paddy prices and basmati 1509 farmers , Iran temporary export ban
వరి పండించే రైతు సోదరులారా ఆలోచించాలి :
ప్రభుత్వం వద్ద దాదాపు 3.5 కోట్ల టన్నుల బియ్యం నిల్వ ఉండటం , లెవీ సేకరణ విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వరికి గిట్టుబాటు ధర సమస్యగా మారింది , కనుక ఉత్పత్తి కర్చును తగ్గించే విధానాలపై దృష్టి సారించడం సాధ్యమైనంత వరకు వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మారటం , భూగర్భ జలాలతో వరిని పండించక పోవడమే మేలు , ప్రత్యామ్నాయంగా జిగురు గోరుచిక్కుడు , పప్పు గింజలు , తెల్ల నువ్వులు లాంటి పంటలు పండించడం లాభదాయకం కాగలదు .
ప్రభుత్వ పధకాల ద్వారా , అతి తక్కువ ధరకు ఇస్తున్న బియ్యం తిరిగి మార్కెట్ లోకే రావడం , నానాటికి తగ్గుతున్న బియ్యం వినియోగం , అంతర్జాతీయంగా కూడా బియ్యం ఉత్పత్తి పెరగటం లాంటి కారణాల వల్ల బాసుమతి యేతర బియ్యానికి పెద్దగా ధర వచ్చే అవకాశాలు కనపడటం లేదు , ఎగుమతికి బాగా అవకాశం ఉన్న , మంచి ధర రాగలిగిన గింజ పొడవు రకాలైన పూసా 1509 , 1121 లాంటి రకాల సాగు వల్ల ఉత్పత్తి కర్చుకన్నా రెట్టింపు ధర పొందగలిగే పై రకాలను సాగు చేసినందువల్ల రైతులు లాభ పడగలరు .
అతి పెద్ద బాస్మతి బియ్యం దిగుమతి చేసుకునే దేశం ఇరాన్ , తాత్కాలిక దిగుమతి నిషేధం వల్ల ధరలు కొంత తగ్గినప్పటికీ ఫెబ్రవరి నుండి బాసుమతి ధరలు పెరిగే అవకాశం ఉన్నది , కనుక బాసుమతి పండించిన రైతులు నిరాశ చెందనవసరం లేదు
ఉత్పత్తి కర్చు తగ్గించే విధానం :
దాళ్వా లో దమ్ము చేసి నేరు గా మొలక కట్టిన విత్తనాన్ని చల్లటం , బాస్పరపు ఎరువు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇవ్వడం.
దాళ్వా లో తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ వాడటం .
urea పోటాష్ లను సగం మోతాదు ,మొలకెత్తిన 15 వరోజు మిగిలిన సగాన్ని 30 వరోజు urea పోటాష్ అంతే మోతాదు vermi compost లో కలిపి 24 గంటలు తరవాత చల్లాలి , కలుపు నివారణకు కలుపు మందులనే వాడండి .
ఈ విధంగా చేస్తే ఉత్పత్తి ఖర్చు సాధ్యమైనంత వరకు తగ్గించ వచ్చు
విత్తన శుద్ధిని మరవవద్దు
ప్రభుత్వం వద్ద దాదాపు 3.5 కోట్ల టన్నుల బియ్యం నిల్వ ఉండటం , లెవీ సేకరణ విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వరికి గిట్టుబాటు ధర సమస్యగా మారింది , కనుక ఉత్పత్తి కర్చును తగ్గించే విధానాలపై దృష్టి సారించడం సాధ్యమైనంత వరకు వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మారటం , భూగర్భ జలాలతో వరిని పండించక పోవడమే మేలు , ప్రత్యామ్నాయంగా జిగురు గోరుచిక్కుడు , పప్పు గింజలు , తెల్ల నువ్వులు లాంటి పంటలు పండించడం లాభదాయకం కాగలదు .
ప్రభుత్వ పధకాల ద్వారా , అతి తక్కువ ధరకు ఇస్తున్న బియ్యం తిరిగి మార్కెట్ లోకే రావడం , నానాటికి తగ్గుతున్న బియ్యం వినియోగం , అంతర్జాతీయంగా కూడా బియ్యం ఉత్పత్తి పెరగటం లాంటి కారణాల వల్ల బాసుమతి యేతర బియ్యానికి పెద్దగా ధర వచ్చే అవకాశాలు కనపడటం లేదు , ఎగుమతికి బాగా అవకాశం ఉన్న , మంచి ధర రాగలిగిన గింజ పొడవు రకాలైన పూసా 1509 , 1121 లాంటి రకాల సాగు వల్ల ఉత్పత్తి కర్చుకన్నా రెట్టింపు ధర పొందగలిగే పై రకాలను సాగు చేసినందువల్ల రైతులు లాభ పడగలరు .
అతి పెద్ద బాస్మతి బియ్యం దిగుమతి చేసుకునే దేశం ఇరాన్ , తాత్కాలిక దిగుమతి నిషేధం వల్ల ధరలు కొంత తగ్గినప్పటికీ ఫెబ్రవరి నుండి బాసుమతి ధరలు పెరిగే అవకాశం ఉన్నది , కనుక బాసుమతి పండించిన రైతులు నిరాశ చెందనవసరం లేదు
ఉత్పత్తి కర్చు తగ్గించే విధానం :
దాళ్వా లో దమ్ము చేసి నేరు గా మొలక కట్టిన విత్తనాన్ని చల్లటం , బాస్పరపు ఎరువు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇవ్వడం.
దాళ్వా లో తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ వాడటం .
urea పోటాష్ లను సగం మోతాదు ,మొలకెత్తిన 15 వరోజు మిగిలిన సగాన్ని 30 వరోజు urea పోటాష్ అంతే మోతాదు vermi compost లో కలిపి 24 గంటలు తరవాత చల్లాలి , కలుపు నివారణకు కలుపు మందులనే వాడండి .
ఈ విధంగా చేస్తే ఉత్పత్తి ఖర్చు సాధ్యమైనంత వరకు తగ్గించ వచ్చు
విత్తన శుద్ధిని మరవవద్దు
Saturday, 22 November 2014
వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం , కారణాలు :
వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం , కారణాలు :
బూమికి సీలింగ్ ఉంది , కాని డబ్బుకు సీలింగ్ లేదు
, చరాస్తులకు సీలింగ్ లేదు , బంగారానికి అంతకంటే సీలింగ్ లేదు , శ్రిమంతులంతా వారి సంపదలో
నాలుగోవ వంతు బంగారం నిలవగా మారుస్తున్నట్టు తెలుస్తుంది , అందుకోసం కోట్లాది రూపాయల బంగారం
దిగుమతి తో విదేశీ మారక ద్రవ్య కొరత
తో విలవిల లాడుతున్న కేంద్ర ప్రభుత్వం , విదేశీ మదుపు దారుల
కోరికలుకు అనుగుణంగా భారత దేశంలో ఆహార పదార్థాల
ద్రవోల్బణo పెరకకుండా కొన్ని కఠిన
చర్యలు తీసుకోవాల్సి వస్తుంది , కనుక
విదేశీ వస్తువుల వినియోగం ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేశం స్వావలంబన సాధిస్తుంది , ఈనాడు రైతుల చేతుల్లో ఉన్నది
ఉత్పత్తి కర్చును ఎంతమేరకు సాధ్యమైతే అంత మేరకు తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి ,
ఎరువులు పురుగు మందులు దిగుమతులను తగ్గించుకునే లా సాంప్రదాయ పద్దతులలో సేంద్రియ
వ్వసాయం వైపు మళ్ళి ఉత్పత్తి కర్చును బాగా తగ్గించినప్పుడే రైతు
అప్పులపాలు కాకుండా ఉంటాడు , వ్యవసాయాన్ని వదిలి ఈ దేశంలో ఉన్న 80 కోట్ల
మంది వ్యవసాయ దారులకు ప్రత్యామ్న్యాయం చూసుకోవడం
ఆచరణ సాధ్యం కాని విషయం, ప్రతి వృత్తిలోను
కష్టాలు నష్టాలు అనివార్యం ,
అయేనప్పటికి వారంతా ధైర్యంగా
ముందుకు సాగుతున్నారే కాని ఆత్మహత్యలు చేసుకోవడంలేదు కనుక రైతు సోదరులారా
సాటి రైతు సోదరులకు ధైర్యాన్ని చెప్పడం ,
మీకు తెలిసిన విధంగా వారిని ఓదార్చడం
చెయ్యాలి. మన రైతులు ఉత్పత్తి చేసిన స్వదేశీ
ఉత్పత్తులనే ఉదాహరణకు కొబ్బరి నీరు
, మజ్జిగ , నిమ్మరసం , పళ్ళ రసాలు వాడుతూ
సాటి రైతులకు సహకరిద్దాం ,
స్వదేశీ ఉత్పత్తుల వినియోగం తోనే మన
సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది , వ్యవసాయ ఉత్పత్తులకు అధిక రేట్ ఆశించి నిరాశ పడవద్దు
, మన మన ఉత్పత్తులను నేరుగా
వినియోగ దారుడికి అందించే
మార్గాన్ని ఆచరిద్దాం
Monday, 17 November 2014
ASWACH BHARAT
ఇదేదో జాతర అనుకుంటున్నారా !! అయెతే మీరు తప్పు లో కాలేసినట్టే , ఇది రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు 15.11 .2014 న లక్షలాది రూపాయలు కర్చుపెట్టి జరిపిన కృషి మేళా లోని ఈ అస్వచ్చతా దృశ్యం సాక్షాత్తు గౌరవనీయులైన మన దేశ ప్రధాని గారి అభ్యర్దన కు కూడా స్పందించని విశ్వవిద్యాలయ యంత్రాంగమే ఇంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే , సాధారణ పౌరులు ఏవిధంగా ప్రవర్తిస్తారు , నిజానికి ఈ సంఘటన సిగ్గుచేటు , ఇకముందైనా దేశం లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూసుకోగలిగితే భారత దేశం ప్రపంచానికి స్వచ్చ భారత్ సందేశం సాకారం అవుతుంది. జై హింద్
Wednesday, 5 November 2014
Tuesday, 4 November 2014
రైతు సోదరులకు
Sunday, 26 October 2014
Iran bans rice and sugar import citing market regulation
Prior to this An Agriculture Jihad Ministry deputy Abbas Keshavarz told IRNA on Saturday that last year the country has imported both the grains in an quantity more than sufficient for domestic needs so to bring the market regulation, the country has decided to stop the rice import of rice and sugar.
Iran’s annual rice consumption is around at 3 million ton of which it itself produces 2 million tons and remaining 1 million tons it imports. For the last 1.5 year, the country has imported over 2.5 million tons of rice which sent the domestically produced rice to store in the warehouses and hence caused stagnation in the rice market,So to overcome this stagnation, the government took the decision not to import rice. The government is purchasing the domestically produced rice which has stabilize the market. The rice cultivation season starts from the month of Mordad (July/August) and continues up to the end of month Dey (December/January) and an import tariff of 40% is observed during this period by the Iranian government
source:
http://www.riceoutlook.com/iran-bans-rice-sugar-import-citing-market-regulation/
Thursday, 9 October 2014
Sunday, 5 October 2014
Thursday, 25 September 2014
వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలతో సేంద్రియ ఎరువులు, by sri K V Krishna rao
వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలతో సేంద్రియ
ఎరువులు
వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలతో సేంద్రియ ఎరువులు ముఖ్యం గా వరిమోళ్ళు , వరిగడ్డి , గోధుమ
, వేరుశనగ పొట్టు , కూరగాయల తోటల్లో వచ్చే వ్యర్థ పదార్థాలు ఎదైనగాని
మొత్తం అన్నీ కలిపి వ్యవసాయ పంటల వ్యర్ధాలు భారత్లో దాదాపు 4 కోట్ల టన్నుల వ్యర్ధాలను
సేంద్రియ పదార్ధంగా మార్చుకో గల్గితే దాదాపు
30 లక్షల టన్నుల N.P.K గా భూమికి అందించే అవకాశాలున్నాయి. రైతులు దీనిపై ద్రిష్టిసారించాల్సిన
అవసరం
ఎంతైనా ఉంది. పత్తి కంప , కంది కంప, జోన్నసోప్ప , మొదలైనవి పూర్వం వంట చెరకుగా
ఉపయోగించినప్పటికీ ఇటీవల కాలంలో పట్టణాలే కాకుండా గ్రామాలో సైతం వంట గ్యాస్
ఉపయోగిస్తూనందు వల్ల ఎక్కువ శాతం
పోలాలోనే వీటన్నిటిని అగ్నికి ఆహుతి చేయటం జరుగుతోంది. అయితే యిటీవల పరిశోధనలో తేలింది ఏమిటంటే అవశేషాలను భూమిలో కలిపి వేసినందు వల్ల భారత దేశం మొత్తం మీద
4 కోట్ల టన్నుల
పంటల అవశేషాల నుండి 25 లక్షల టన్నుల నత్రజని , 4 లక్షల
టన్నుల భాస్వరం , షుమారు 4 లక్షల
టన్నుల పోటాష్ కు
సమానమైన సేంద్రియ పోషకాలు లభ్యమౌతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు . ముఖ్య పోషక
పదార్దాలే కాకుండా సూక్ష్మ పోషక పదార్దాల లభ్యత కూడా మెరుగవుతుందని
శాత్రవేత్తల పరిశోధనలో తేలింది
. మీ మీ భూములలో లభ్యమైయే పంటల వ్యర్ధాలను
తేలికగా భూమిలో కలపటానికి ఇటీవల ప్రవేశ పెట్టిన
రోటోవేటర్ బాగా ఉపయోగపడుతున్న సంగతి మనందరికి తెలిసిందే కొన్ని ప్రాంతాల్లో
నత్రజనిని స్తీరీకరించే మినుము , పెసర , అలసంద , జిగురు గోరుచిక్కుడు
మొదలైన పైరుల సాగు
మరియు అవశేశాల వల్ల కూడా
ఎంతో విలువైన సేంద్రియ పదార్ధాన్ని మనం భూమిలో
చేర్చినందు వల్ల గత 30, 40 సంవత్సరాల
నుండి అధిక రసాయన ఎరువులు వాడినందు
వల్ల భూములన్నీ నిస్సారమై ప్రతి సంవత్సరం రసాయన ఎరువుల మోదాదు ను పెంచితే తప్ప దిగుబడి
రాని పరిస్తితి ఏర్పడింది. అధిక ఎరువుల వినియోగం
వల్ల పంటలపై చీడపీడలు
అధికంగా అసించడంతో క్రిమి సంహారక మందుల వినియోగం పెరిగినందువల్ల కోట్లాది రూపాయల విదేశి
మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడమే కాక పర్యవరణానికి , వినియోగదారుల ఆరోగ్యానికి , ఎంతో హానికారకం
అయింది, మన దేశ వ్యవసాయ ఉత్పత్తులలో కూడా క్రిమిసంహారక అవశేషాల వల్ల ఎగుమతులకు అవరోధం కలుగుతోంది . ఒకనాడు పశువుల పెంపకం చేపట్టి వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలను పశువుల కు మేతగా మేపి
వాటి ద్వారా వచ్చే పశువుల
ఎరువును పొలాల్లో వినియోగించి అతి తక్కువ
ఖర్చు తో సేంద్రియ
పంటలు ఉత్పత్తి చేసి వినియోగదారుల ఆరోగ్యానికీ
పర్యవర్యవరణ కాలుష్యం లేకుండా రైతన్నలు చూడగలిగారు . అయితే అది నిన్నటి మాట ప్రస్తుత పరిస్తితులలో , వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం గ్రామీణ ప్రాంతాల నుండి రైతులు పట్టణాలకు వలస పోవడం వల్ల
గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రైతు
పశువుల పాలన అసాధ్యమైనందున మరియు పశువులలో అధిక పాల ఉత్పత్తినిచ్చే సంతతి పెరిగినందు వల్ల నూ వ్యవసాయంలో యంత్ర పరికరాల
వాడకం పెరిగినందు వల్ల కుడా పశువుల సంఖ్య తగ్గుతూ
వస్తుంది . అది కుడా
వ్యవసాయ ఉత్పతుల అవశేషాల వినియోగం తగ్గడానికి కారణం . యిందు వల్ల ప్రతి రైతు మీ
మీ భుములలోని పంటల అవశేషాలను అగ్ని కి
ఆహుతిచేయ్యకుం డా ( ప్లాస్టిక్ , గాజు పెంకు
, తప్ప )
పంటల అవశేషాలను భూమిలో కలిపి దాన్ని సేంద్రియ పదార్ధంగా మార్చటానికి ప్రయత్నించాలి . చౌక గా దొరికే రాక్
ఫాస్ఫేట్ గాని , సింగిల్
సూపర్ పాస్పేట్ కాని చల్లినందువల్ల
పంటల అవశేషాలు త్వరగా
చివికి సేంద్రియ పదార్థంగా మారి భూములను సారవంతం గా మార్చు తాయి . మన భూముల సారవంతంగా
మారితే తప్ప వ్యవసాయం లాభసాటి గా మరే అవకాసం లేదు . అయితే
ఈనాడు చాలా మంది సాగుదారులు కౌలు రైతులే కావటం , మరుసటి సంవత్సరం ఆ చేను వారికే కౌలు కు
లభిస్తుందో , లేదో తెలియక పోవడం వల్ల
తాత్కాలికంగా రసాయన ఎరువులు
వినియోగించటం వల్ల వారూ నష్ట పోతున్నారు . ఈ విషయాన్ని గమనించి భూస్వాములు కూడా భుసారవంతాన్ని పెంచటానికి సేంద్రియ ఎరువుల
వినియోగించే కౌలు రైతులకు
రాయితీ కల్పించినందు వల్ల సత్పలితాలను
పొందవచ్చు . ఇటీవల పంటల అవశేషాలతో కొన్ని యంత్రాల సాహయంతో తెల్ల బొగ్గు అనబడే
brikets ను తయారుచేసి
వంట చెరకు గా పరిశ్రమలలో
వియోగిస్తున్న విషయం కూడా మనకు
తెలిసిందే . అయినప్పటికి నిరంతరం పెరుగుతున్న జనభా , తరుగుతున్న , సాగు భూమిని దృష్టి లో పెట్టుకున్నప్పుడు భూమి లో సేంద్రియ పదార్ధాన్ని 2 నుంచి 3 శాతానికి పెంచితే
తప్ప రాబోయే రోజులాలో పెరుగుతున్న జనాభా కు ఆహార పదార్ధాలను అందించ
లేమనే విషయాన్ని గమనించి అందుబాటు లో ఉన్న పంటల అవశేషాలను సేంద్రియ పదార్ధంగా మార్చేందుకు రైతులకు తగిన సలహాలు సూచనలు చేస్తూ అందుకు కావలసిన పరికరాలకు పెద్ద రైతు , చిన్న
రైతు అనే తారతమ్యం లేకుండా సబ్సిడీ రేటు పై యంత్ర పరికరాలను ప్రభుత్వం అందించినప్పుడే భూములు సారవంతమై
ప్రజల ఆరోగ్యం , పర్యావరణ కాలుష్యం లేకుండా కాపాడుటమే కాక పరోక్షంగా విదేశి మారక ద్రవ్యాన్ని కూడా
పొదుపు చెయ్యగలం .
Friday, 19 September 2014
రైతులకు చేదు వార్త
KVK రావు : 19.9 .14 , రాయచూరు , సమయం 6.13 pm
రైతులకు చేదు వార్త :
ఈశాన్య భారత దేశం లో రోడ్లు మరియు రైల్వే లైన్లు ఇటీవల కురిసిన భారి వర్షాలకు బాగా దెబ్బ తిన్నందున అక్కడి ప్రజలకు ఇబ్బంది పడకూడదు అని ఇవాళ్ళ కేంద్ర ప్రభుత్వం పక్క దేశమైన మయన్మార్ నుండి లక్ష టన్నుల బియ్యం దిగుమతి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంది , దీనివల్ల రూబోయే రోజుల్లో ధాన్యం ధర పైన ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి , అసలే భారి వర్షాల వల్ల పంట నష్టం జరిగి రైతాంగం పీకల లోతు కష్టాలలో ఉంటె ..ఈ నిర్ణయం వల్ల మాత్రం రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ...1990 తరవాత భారత దేశం దిగుమతి చేసుకోవడం ఇదే మొదటి సారి , గత సంవత్సరం రికార్డు స్థాయి లో కోటి టన్నులు దాక ఎగుమతి చేసిన ప్రభుత్వం ఈ దిగుమతి చర్య వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ఉంది కనుక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలకు మన బియ్యన్నే తరలిస్తే రైతులకు మేలు చేసినవారు అవుతారు .ఈ విషయాన్నీ ప్రధాని మంత్రి గారి దృష్టి కి తీసుకు వెళ్ళడం జరిగింది , జై హింద్
http://profit.ndtv.com/news/economy/article-india-importing-over-100-000-tonnes-on-temporary-supply-squeeze-668166
రైతులకు చేదు వార్త :
ఈశాన్య భారత దేశం లో రోడ్లు మరియు రైల్వే లైన్లు ఇటీవల కురిసిన భారి వర్షాలకు బాగా దెబ్బ తిన్నందున అక్కడి ప్రజలకు ఇబ్బంది పడకూడదు అని ఇవాళ్ళ కేంద్ర ప్రభుత్వం పక్క దేశమైన మయన్మార్ నుండి లక్ష టన్నుల బియ్యం దిగుమతి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకుంది , దీనివల్ల రూబోయే రోజుల్లో ధాన్యం ధర పైన ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి , అసలే భారి వర్షాల వల్ల పంట నష్టం జరిగి రైతాంగం పీకల లోతు కష్టాలలో ఉంటె ..ఈ నిర్ణయం వల్ల మాత్రం రైతులకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ...1990 తరవాత భారత దేశం దిగుమతి చేసుకోవడం ఇదే మొదటి సారి , గత సంవత్సరం రికార్డు స్థాయి లో కోటి టన్నులు దాక ఎగుమతి చేసిన ప్రభుత్వం ఈ దిగుమతి చర్య వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే ఉంది కనుక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలకు మన బియ్యన్నే తరలిస్తే రైతులకు మేలు చేసినవారు అవుతారు .ఈ విషయాన్నీ ప్రధాని మంత్రి గారి దృష్టి కి తీసుకు వెళ్ళడం జరిగింది , జై హింద్
http://profit.ndtv.com/news/economy/article-india-importing-over-100-000-tonnes-on-temporary-supply-squeeze-668166
Sunday, 14 September 2014
guar article 14.9.2014 , జిగురు గోరుచిక్కుడు పైన వ్యాసం
జిగురు గోరు చిక్కుడు 2012 నుండి పత్రికలు,టివి
లు మొదలైన ప్రచార సాధానలలో రావటం వల్ల
చాలా మంది రైతులలో ఆసక్తి రేపింది. ఆసక్తి రేపి ఎంతో ఆశగా
సాగుచేపట్టిన రైతులను అంతే
నిరాశపర్చిన పంటగా చెప్పవచ్చు. కారణం 2012
లో క్వింటా గింజల రేటు ౩౦ వేల రూపాయల వరకు పెరిగి జిగురు ధర క్వింటాకు లక్ష రూపాయల
దాకా పెరగడంతో దక్షణ భారత దేశంలోని అనేక మంది రైతులు ఈ పంట పై ఆసక్తి పెరిగి కిలో విత్తనం 600 ల రూపాయల వరకు కొనుగోలు చేసి
ఈ పంట సాగుచేయటం జరిగింది. Commodity ఫ్యూచర్ ట్రేడింగ్ లో ఈ పంటను చేర్చినందు
వల్ల రైతుకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో కామోడిటి లో ఈ పంటను కూడా చేర్చటం
జరిగింది. అయితే కొంత మంది పెద్ద వ్యాపారుల మాయజాలంతో కృత్రిమంగా రేటు పెరిగి
వ్యాపారస్తులకు కోట్లాదిరూపాయల లాభం చేకుర్చింది. అయితే రైతులకు మాత్రం చేదునే
మిగిల్చింది.ఇటీవల కేంద్ర ప్రభుత్వం commodity
market లో కృత్రిమంగా రేటు పెంచిన
వారిపై చర్య తీసుకుంటూ 100 కోట్ల రూపాయల
దాకా పెనాల్టి విధించినట్టు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా ఈ పంట సాగును దక్షిణ భారత
రైతులకు పరిచయం చేసింది ఈ చర్యలే, లేకుంటే వందల సంవత్సరాల నుండి రాజస్తాన్ లో
పశువుల మేతగా సాగు చేస్తున్న ఈ పంట 40,50 సంవత్సరాల నుండి వాణిజ్యపరంగా
సాగవుతున్నా, మనకు పరిచయం ఇటివలే జరిగింది.ఈ గింజలలో వున్న జిగురు పదార్దాన్ని
పరిశోధించి వాణిజ్యపరంగా గత 50 సంవత్సరాల
నుండి రాజస్థాన్లో జోద్పూర్ పరిసర ప్రాంతాలలో మిల్లులు స్థాపించి జిగురును
వేరుచేయటం మిగిలిన వ్యర్ధ పదార్ధాలను పశువులు,కోళ్ళ దాణాలలోను ఉపయోగిస్తూ ఈ
పంటను వాణిజ్య పంటగా గుర్తించి కొన్ని
మేలైన వంగడాలను కూడా శాస్త్రవేత్తలు రూపోదించటం జరిగింది. ప్రస్తుతం ఈ పంటను
రాజస్థాన్ తో పాటు హరియాణ , గుజరాత్ లలో కూడా పండిస్తున్నారు. రాను రాను సహజమైన ఈ
జిగురు వినియోగం పెరగడంతో కిలో గింజల ధర 5,6 రూపాయల నుండి 40 నుండి 50 రూపాయల వరకు పెరగడం జరిగింది. ఈ జిగురు వినియోగం
అనేక రకాల పరిశ్రమలలోను , ఆహార పదార్థాలలో, ఔషద పరిశ్రమలలో ఉపయోగిస్తున్నప్పటికీ ,
ఇటీవల కొన్ని సంవత్సరాల నుండి పెట్రోలు ,సహజ వాయువుల వెలికితీతలో కూడా
ఉపయోగిస్తునందున జిగురు అవసరం పెరగడంతో పాటు ధర కూడా పెరగడం దీని సాగు పెరిగింది.
దీని
సాగు వర్షాధారిత తేలికపాటి బీడు భూములతో మొదలై సారవంతమైన భూములలో ఎరువులు,పురుగు మందుల
వినియోగంతో ఉత్పతిని పెంచాల్సిన అవసరం
కూడా ఏర్పడింది.దీంతో జిగురు తీసే మిల్లులు కూడా రాజస్తాన్ తో పాటు హరియాణ,గుజరాత్
లలో కూడా మిల్లులు స్థాపించి వేలకోట్ల రూపాయల విలువైన జిగురును ఎగుమతి చేసి వ్యవసాయ
రంగంలోనే అత్యధిక ఎగుమతి ఉత్పత్తి గా మారిన ఈ పంట పై కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ
పెట్టి వ్యవసాయ ఉత్పత్తులలో commodity లో చేర్చటం జరిగింది.ఈ పంట మన దక్షిణాదిన 2005 వ
సంవత్సరంలోనే కడప,అనంతపూర్ జిల్లాలో ప్రవేశ పెట్టినప్పటికీ కొనుగోలుదారులు లేకపోవడం
సరైన మార్కెట్ రేటు రైతుకు తెలియక పోవడం కూడా ఈ పంట పై ఆసక్తి తగ్గింది.ఏది
ఏమైనప్పటికీ 2012 లో వచ్చిన కిలో 300 లా రూపాయల ధర మళ్ళి రైతులలో సాగు పై ఆసక్తి రేపింది.అయితే సాగు విధానంలో గాని , సాగు
చేపట్టవలసిన సమయంపై గాని సరైన అవగాహన లేక రాజస్థాన్ లోని సాగు పద్ధతులనే ఇక్కడ కూడా అనుసరించటం వల్ల ఎక్కువ మంది రైతులు
ఈ పంటను సాగుచేసి నష్టపోవటం జరిగింది. గత ఒకటిన్నర సంవత్సరం నుండి రాజస్థాన్ నుంచి
Dr D . Kumar మొదలైన శాస్త్రవేత్తలను పిలిపించటం వారి ద్వారా
అనేక విషయాలను రైతుల అవగాహనకు తేవడం ముఖ్యంగా అనంతపూర్ , కడప, రాయచూరు జిల్లాలో దీనిపై ఎక్కువ ప్రచారం జరిగింది, ఈ
వ్యాస రచయత కూడా గుజరాత్ రాజస్తాన్ , హరియాణా పర్యటించి అక్కడి రైతులు శాస్త్రవేత్తల ద్వారా అనేక
విషయాలను తెలుసుకుని రైతులకు సాంకేతిక పరిగ్య్ఞానాన్ని అందించటమే కాకుండా ఈ పంట ను
gum గా మార్చే పరిశ్రమ స్థాపించ నట్లయితే ఈ పంట మనుగడ దక్షిణ భారత దేశం లో మళ్ళి
ప్రశ్నార్ధకంగా మారె ప్రమాదాని గుర్తించి కర్ణాటక రాష్ట్రం లో రాయచూరు లో విశ్వ
శాంతి ఆగ్రో ఇండస్ట్రీస్ అనే పరిశ్రమ
స్థాపించడం జరిగింది, కనుక రైతులు
ఈ వాస్తవ పరిస్తితులను అర్ధం చేసుకుని మళ్ళి ఈ పంటను సాగు చేస్తున్నారు
ప్రపంచంలో పండే పంటలో 80 శాతం మన దేశంలోనే
పండించడం ప్రపంచంలో వినియోగించే గమ్ము 20
శాతం మాత్రమే మన దేశంలో వినియోగిస్తూ 80
శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేసి విదేశి మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఆర్జించటం
జరుగుతోంది . ఈ పంటపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా శ్రద్ధ చూపినట్లైతే
వర్షాధారిత భూముల రైతులకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా ఈ పంటను పండించవచ్చు అంతే
కాకుండా ఈ పంట పండించిన భూములలో భూసారాన్ని గణనీయంగా పెరగడం గమనించ వచ్చు , అంతే
కాక అడవి పందులు కోతులు మొదలైన అటవీ జంతువుల నుండి కూడా ఈ పైరుకు ప్రమాదం నష్టం లేదని
తెలుస్తుంది, గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల రైతులు ఎకరానికి 8నుండి 12
క్వింటాళ్ళ వరకు పండిస్తున్నారు. కర్నూలు,కడప,జిల్లాలో 2 నుండి 6 క్వింటాళ్ళ వరకు
పందిస్తునారు.అటు తెలంగాణ రాష్ట్రం లో కూడా 3 నుండి 8 క్వింటాళ్ళు రైతులు పండిస్తున్నారు.
సాగు విషయానికి వస్తే చవుడు లేని , నీరు నిలువని ఎటువంటి నేలల్లో నైనా ఈ పంట పండుతుది.అధిక తేమను అధిక
చల్లదనాన్ని తట్టుకోలేదు ఈ పంటలో ఇంతవరకు
హైబ్రిడ్ రకాలు ఏమి రాలేదు , ఇందులో
ముఖ్యంగా రెండూ రకాలు , 1, నిలువుగా ఏక కాండం తో పెరిగేది , 2 , కొమ్మలతో
పెరిగేదిగా చెప్పవచ్చు ,విత్తనం
ఎకరానికి మొదటి రకం పది kg లు , రెండోవ రకం ఆరు kg లు
వరకు సరిపోతుంది ..ఈ పంట 90 నుండి 110
రోజుల వరకు రకాలను బట్టి కోతకు
వస్తుంది , కనుక కోతకు ముందే 50 రోజులు
వర్షం పడకుండా మీ మీ ప్రాంతాలలో ఆఖరి వర్షాలను
గమనించి విత్తుకోవచ్చు ముఖ్యంగా
ఆగష్టు , february నెలలు
ఈ పంటను విత్తడానికి అనువైనవి గా
గమనిస్తున్నాం ఎక్కువ మంది రైతులు సాళ్ళ
పద్దతి లో విత్తుతున్నారు , సాళ్ళ మధ్య దూరాన్ని 12 అంగుళాల దూరం ఉండేటట్టుగా విత్తుతున్నారు , ఈ పంటకు ఎరువులు ఎక్కువగా
అవసరం లేదని చెపుతున్నప్పటికీ అధిక దిగుబడి
సాధించాలంటే వారి వారి భూసారాన్ని
అనుసరించి సింగల్ సూపర్ ఫాస్ఫేట్
100 kg లు, urea 25 kg లు, పోటాష్ 25 kg
లు ఒకేసారి విత్తనం తోపాటు
విత్తినట్ట్ల్అయెతే మంచిది, విత్తిన
వెంటనే మరుసటి రోజు కలుపు నివారణకు పెండి methalin ఎకరానికి ఒక
లీటర్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి స్ప్రే చేస్తే కలుపును
అరికట్టవచ్చు ,
విత్తిన 25 నుండి ౩౦ రోజుల లోపల కాపు ప్రారంభం అవుతుంది
కనుక అప్పటికి కాండం 8 నుండి 9 అంగుళాల
ఎత్తు పెరిగి అక్కడినుండి కాపు
మొదలైతే combined harvestor తో కొయ్యడానికి అనువుగా ఉంటుంది , అందువల్ల వేసే
ఎరువులు విత్తనంతో పాటు వేస్తె మంచిది , విత్తిన 15 వ రోజు ఒక సారి , 25 వ రోజు
ఒకసారి ౩౦ % జింక్ sulphate (ల్యాబ్ గ్రేడ్ ) లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున ౩౦ గ్రాముల urea కలిపిన ద్రావణాన్ని పైరు పై పిచికారి
చేసినందువల్ల దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది , ఈ పంట వర్శాధరితమే అయేనప్పటికి
వేసవిలో వరి, మొక్కజొన్న , పత్తి పంట కోసిన తరువాత దుక్కి దున్ని భూమి మెత్తగా
దున్నుకుని feburavary మొదటి వారం లో
విత్తి నల్ల రేగడి నెల లో నీరు కట్టకుండా , రెండో సారి నీరు కట్టకుండా
ఎకరానికి 5 క్వింటాళ్ళు పండించటం జరిగింది
, 4 % శాతం యౌరియా ద్రావణాన్ని వారానికి ఒక్కసారి పైరు పై చల్లి నల్ల నెలలో
నీరు కట్టకుండానే , ఎర్ర భూములలో రెండూ
మూడు తడులు ఇచ్చి పండించటం జరిగింది . నల్ల రేగడి
నెలలో నీరు కట్టినప్పుడు పైరు
చనిపోవడం జరిగింది , చలి కాలం లో ఈ పైరు
పై బూడిద తెగులు ఎక్కువగా కనపడింది
, అయెతే ప్రారంభ దశలోనే గమనించి రెండూ
మూడు సారులు నివారణ చర్యలు తీసుకున్నట్లతే
తేలికగానే నివారించవచ్చు , తక్కువ్బ నీటి వనరులు కలిగిన భుములలోను ప్రత్తి
మొక్కజొన్న పంట తీసిన చోట, సమయం ఉన్నచోట ..ఈ పంట సాగును చేపట్టినట్లయితే ఎకరం వరి పంటకు ఉపయోగించే నీరు షుమారు 5 నుండి 6 ఎకరాలను ఈ జిగురు గోరు చిక్కుడు
సాగు చేయవచ్చు. వేసవిలో వరి పంట సాగు చేసే రైతులు ముఖ్యంగా బోరు నీరు,
పరిమిత నీటి వనరులున్న రైతులు ఈ పంటను సాగు చేసినందువల్ల మంచి ఆదాయం పొదగలరు.ఏది
ఏమైనా గోరుచిక్కుడు ఉత్పత్తుల ఎగుమతి పైన భారత
ప్రభుత్వం ఆంక్షలు విదిచటం కాని స్వదేశి వినియోగదారులు విదేశాల నుండి దిగుమతి
చేసుకొని ధరలను తగ్గించటం కానీ , మిగతా పంటల లాగా అవకాశం లేదు. కనుక రైతు సోదరులంతా
మీమీ ప్రాంతాల అనుకూలతను బట్టి చిగురు గోరుచిక్కుడ సాగు చేపట్టండి. మార్కెట్ ను
గురించి భయపడవలసిన పని లేదు. 2013 ఆగష్టు నుండి దక్షిణ భారతంలోనే ప్రప్రధమంగా గోరుచిక్కుడు
మిల్లును స్థాపించడమే కాక ,ఇప్పటివరకు షుమారు 900 ల మంది రైతులు ఆంధ్ర ,
కర్ణాటక,తెలంగాణ,రాష్ట్రాల నుండి సరుకు తీసుకొచ్చారు.అలాగే 200ల మంది 50 కేజీ ల
నుండి 10క్వింటాళ్ళ దాకా రైతులు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపారు. వారందరికీ బ్యాంక్
ద్వారా పేమెంట్ పంపటం జరిగింది. ప్రతి రోజు మా వెబ్ సెట్ లో kvkrao.blogspot.in
ద్వారా
ఏరోజుకారోజు మార్కెట్ ధర తెలియజేస్తున్నాం.ధర తక్కువ ఉన్నప్పుడు మన పంటను అమ్మే
అవసరం లేదు , శనగ పంట విదేశాల నుండి దిగుమతి కావడం, ఎగుమతిని ప్రభుత్వం నిషేదించడం
వల్ల ధర పెరగడంలేదు. కనుక శనగ వేసే రైతులు
50 శాతం అయినా రైతులు శనగకు బదులుగా ఈ
పంటను సాగు కు చేపట్ట వలసినదిగా కోరుతున్నాము.
Subscribe to:
Comments (Atom)















