Sunday, 14 September 2014

guar article 14.9.2014 , జిగురు గోరుచిక్కుడు పైన వ్యాసం



జిగురు గోరు చిక్కుడు 2012 నుండి పత్రికలు,టివి లు మొదలైన ప్రచార సాధానలలో  రావటం వల్ల చాలా మంది రైతులలో ఆసక్తి రేపింది. ఆసక్తి రేపి ఎంతో ఆశగా సాగుచేపట్టిన రైతులను  అంతే నిరాశపర్చిన  పంటగా చెప్పవచ్చు. కారణం 2012 లో క్వింటా గింజల రేటు ౩౦ వేల రూపాయల వరకు పెరిగి జిగురు ధర క్వింటాకు లక్ష రూపాయల దాకా పెరగడంతో దక్షణ భారత దేశంలోని అనేక మంది రైతులు ఈ పంట పై ఆసక్తి పెరిగి  కిలో విత్తనం 600 ల రూపాయల వరకు కొనుగోలు చేసి ఈ పంట సాగుచేయటం జరిగింది. Commodity ఫ్యూచర్ ట్రేడింగ్ లో ఈ పంటను చేర్చినందు వల్ల రైతుకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతో కామోడిటి లో ఈ పంటను కూడా చేర్చటం జరిగింది. అయితే కొంత మంది పెద్ద వ్యాపారుల మాయజాలంతో కృత్రిమంగా రేటు పెరిగి వ్యాపారస్తులకు కోట్లాదిరూపాయల లాభం చేకుర్చింది. అయితే రైతులకు మాత్రం చేదునే మిగిల్చింది.ఇటీవల కేంద్ర ప్రభుత్వం commodity  market  లో కృత్రిమంగా రేటు పెంచిన వారిపై  చర్య తీసుకుంటూ 100 కోట్ల రూపాయల దాకా పెనాల్టి విధించినట్టు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా ఈ పంట సాగును దక్షిణ భారత రైతులకు పరిచయం చేసింది ఈ చర్యలే, లేకుంటే వందల సంవత్సరాల నుండి రాజస్తాన్ లో పశువుల మేతగా సాగు చేస్తున్న ఈ పంట 40,50 సంవత్సరాల నుండి వాణిజ్యపరంగా సాగవుతున్నా, మనకు పరిచయం ఇటివలే జరిగింది.ఈ గింజలలో వున్న జిగురు పదార్దాన్ని పరిశోధించి  వాణిజ్యపరంగా గత 50 సంవత్సరాల నుండి రాజస్థాన్లో జోద్పూర్ పరిసర ప్రాంతాలలో మిల్లులు స్థాపించి జిగురును వేరుచేయటం మిగిలిన వ్యర్ధ పదార్ధాలను పశువులు,కోళ్ళ దాణాలలోను ఉపయోగిస్తూ ఈ పంటను  వాణిజ్య పంటగా గుర్తించి కొన్ని మేలైన వంగడాలను కూడా శాస్త్రవేత్తలు రూపోదించటం జరిగింది. ప్రస్తుతం ఈ పంటను రాజస్థాన్ తో పాటు హరియాణ , గుజరాత్ లలో కూడా పండిస్తున్నారు. రాను రాను సహజమైన ఈ జిగురు వినియోగం పెరగడంతో కిలో గింజల ధర 5,6 రూపాయల నుండి 40 నుండి 50  రూపాయల వరకు పెరగడం జరిగింది. ఈ జిగురు వినియోగం అనేక రకాల పరిశ్రమలలోను , ఆహార పదార్థాలలో, ఔషద పరిశ్రమలలో ఉపయోగిస్తున్నప్పటికీ , ఇటీవల కొన్ని సంవత్సరాల నుండి పెట్రోలు ,సహజ వాయువుల వెలికితీతలో కూడా ఉపయోగిస్తునందున జిగురు అవసరం పెరగడంతో పాటు ధర కూడా పెరగడం దీని సాగు పెరిగింది.
 దీని సాగు వర్షాధారిత తేలికపాటి బీడు భూములతో మొదలై సారవంతమైన భూములలో ఎరువులు,పురుగు మందుల వినియోగంతో ఉత్పతిని పెంచాల్సిన  అవసరం కూడా ఏర్పడింది.దీంతో జిగురు తీసే మిల్లులు కూడా రాజస్తాన్ తో పాటు హరియాణ,గుజరాత్ లలో కూడా మిల్లులు స్థాపించి వేలకోట్ల రూపాయల విలువైన జిగురును ఎగుమతి చేసి వ్యవసాయ రంగంలోనే అత్యధిక ఎగుమతి ఉత్పత్తి గా మారిన ఈ పంట పై కేంద్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టి వ్యవసాయ ఉత్పత్తులలో  commodity  లో చేర్చటం జరిగింది.ఈ పంట మన దక్షిణాదిన 2005 వ సంవత్సరంలోనే కడప,అనంతపూర్ జిల్లాలో ప్రవేశ పెట్టినప్పటికీ కొనుగోలుదారులు లేకపోవడం సరైన మార్కెట్ రేటు రైతుకు తెలియక పోవడం కూడా ఈ పంట పై ఆసక్తి తగ్గింది.ఏది ఏమైనప్పటికీ 2012 లో వచ్చిన కిలో 300 లా రూపాయల ధర మళ్ళి రైతులలో సాగు పై ఆసక్తి  రేపింది.అయితే సాగు విధానంలో గాని , సాగు చేపట్టవలసిన సమయంపై గాని సరైన అవగాహన లేక రాజస్థాన్ లోని  సాగు పద్ధతులనే  ఇక్కడ కూడా అనుసరించటం వల్ల ఎక్కువ మంది రైతులు ఈ పంటను సాగుచేసి నష్టపోవటం జరిగింది. గత ఒకటిన్నర సంవత్సరం నుండి రాజస్థాన్ నుంచి Dr  D . Kumar  మొదలైన శాస్త్రవేత్తలను పిలిపించటం వారి ద్వారా అనేక విషయాలను రైతుల అవగాహనకు తేవడం ముఖ్యంగా అనంతపూర్ , కడప, రాయచూరు  జిల్లాలో దీనిపై ఎక్కువ ప్రచారం జరిగింది, ఈ వ్యాస రచయత కూడా గుజరాత్ రాజస్తాన్ , హరియాణా  పర్యటించి  అక్కడి రైతులు శాస్త్రవేత్తల ద్వారా అనేక విషయాలను తెలుసుకుని రైతులకు సాంకేతిక పరిగ్య్ఞానాన్ని అందించటమే కాకుండా ఈ పంట ను gum గా మార్చే పరిశ్రమ స్థాపించ నట్లయితే ఈ పంట మనుగడ దక్షిణ భారత దేశం లో మళ్ళి ప్రశ్నార్ధకంగా మారె ప్రమాదాని గుర్తించి కర్ణాటక రాష్ట్రం లో రాయచూరు లో విశ్వ శాంతి ఆగ్రో ఇండస్ట్రీస్  అనే  పరిశ్రమ  స్థాపించడం  జరిగింది, కనుక రైతులు ఈ వాస్తవ పరిస్తితులను అర్ధం చేసుకుని మళ్ళి ఈ పంటను సాగు చేస్తున్నారు   
ప్రపంచంలో పండే పంటలో 80 శాతం మన దేశంలోనే పండించడం  ప్రపంచంలో వినియోగించే గమ్ము 20 శాతం మాత్రమే మన దేశంలో వినియోగిస్తూ  80 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేసి విదేశి మారక ద్రవ్యాన్ని ఎక్కువగా ఆర్జించటం జరుగుతోంది . ఈ పంటపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా శ్రద్ధ చూపినట్లైతే వర్షాధారిత భూముల రైతులకు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా ఈ పంటను పండించవచ్చు అంతే కాకుండా ఈ పంట పండించిన భూములలో భూసారాన్ని గణనీయంగా పెరగడం గమనించ వచ్చు , అంతే కాక అడవి పందులు కోతులు మొదలైన అటవీ జంతువుల నుండి కూడా ఈ పైరుకు ప్రమాదం నష్టం లేదని తెలుస్తుంది, గుంటూరు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల రైతులు ఎకరానికి 8నుండి 12 క్వింటాళ్ళ వరకు పండిస్తున్నారు. కర్నూలు,కడప,జిల్లాలో 2 నుండి 6 క్వింటాళ్ళ వరకు పందిస్తునారు.అటు తెలంగాణ రాష్ట్రం లో  కూడా 3 నుండి 8 క్వింటాళ్ళు  రైతులు  పండిస్తున్నారు.
సాగు విషయానికి వస్తే చవుడు లేని  , నీరు నిలువని ఎటువంటి నేలల్లో నైనా  ఈ పంట పండుతుది.అధిక తేమను అధిక చల్లదనాన్ని  తట్టుకోలేదు ఈ పంటలో ఇంతవరకు హైబ్రిడ్  రకాలు ఏమి రాలేదు , ఇందులో ముఖ్యంగా రెండూ రకాలు , 1, నిలువుగా ఏక కాండం తో పెరిగేది , 2 , కొమ్మలతో పెరిగేదిగా  చెప్పవచ్చు ,విత్తనం ఎకరానికి  మొదటి రకం  పది kg లు , రెండోవ రకం  ఆరు kg లు  వరకు సరిపోతుంది ..ఈ పంట 90 నుండి 110  రోజుల వరకు  రకాలను బట్టి కోతకు వస్తుంది , కనుక కోతకు ముందే  50 రోజులు వర్షం పడకుండా  మీ మీ ప్రాంతాలలో  ఆఖరి  వర్షాలను  గమనించి  విత్తుకోవచ్చు  ముఖ్యంగా  ఆగష్టు  , february  నెలలు  ఈ పంటను విత్తడానికి  అనువైనవి గా గమనిస్తున్నాం  ఎక్కువ మంది రైతులు  సాళ్ళ  పద్దతి లో   విత్తుతున్నారు  , సాళ్ళ మధ్య దూరాన్ని  12 అంగుళాల దూరం ఉండేటట్టుగా  విత్తుతున్నారు , ఈ పంటకు ఎరువులు  ఎక్కువగా  అవసరం లేదని     చెపుతున్నప్పటికీ  అధిక దిగుబడి  సాధించాలంటే వారి వారి భూసారాన్ని  అనుసరించి  సింగల్ సూపర్ ఫాస్ఫేట్ 100 kg లు, urea  25 kg లు, పోటాష్ 25 kg లు ఒకేసారి విత్తనం తోపాటు  విత్తినట్ట్ల్అయెతే  మంచిది, విత్తిన వెంటనే  మరుసటి రోజు  కలుపు నివారణకు పెండి methalin ఎకరానికి ఒక లీటర్ రెండు  వందల లీటర్ల  నీటిలో కలిపి స్ప్రే చేస్తే కలుపును అరికట్టవచ్చు ,
విత్తిన  25 నుండి ౩౦ రోజుల లోపల కాపు ప్రారంభం అవుతుంది కనుక అప్పటికి కాండం  8 నుండి 9 అంగుళాల ఎత్తు పెరిగి  అక్కడినుండి  కాపు  మొదలైతే  combined  harvestor తో  కొయ్యడానికి అనువుగా ఉంటుంది , అందువల్ల వేసే ఎరువులు  విత్తనంతో పాటు వేస్తె  మంచిది , విత్తిన 15 వ రోజు ఒక సారి  , 25 వ రోజు  ఒకసారి ౩౦ % జింక్ sulphate (ల్యాబ్ గ్రేడ్ ) లీటర్ నీటికి  2 గ్రాముల చొప్పున ౩౦ గ్రాముల urea  కలిపిన ద్రావణాన్ని పైరు పై పిచికారి చేసినందువల్ల దిగుబడి పెరగడానికి అవకాశం ఉంది , ఈ పంట వర్శాధరితమే   అయేనప్పటికి  వేసవిలో వరి, మొక్కజొన్న , పత్తి  పంట కోసిన తరువాత దుక్కి దున్ని భూమి మెత్తగా దున్నుకుని  feburavary  మొదటి వారం లో  విత్తి నల్ల రేగడి నెల లో నీరు కట్టకుండా , రెండో సారి నీరు కట్టకుండా ఎకరానికి 5 క్వింటాళ్ళు  పండించటం జరిగింది , 4 % శాతం యౌరియా ద్రావణాన్ని వారానికి ఒక్కసారి పైరు పై చల్లి నల్ల నెలలో నీరు  కట్టకుండానే , ఎర్ర భూములలో రెండూ మూడు తడులు ఇచ్చి పండించటం జరిగింది . నల్ల రేగడి  నెలలో  నీరు కట్టినప్పుడు పైరు చనిపోవడం జరిగింది , చలి కాలం లో ఈ పైరు  పై బూడిద తెగులు  ఎక్కువగా కనపడింది , అయెతే ప్రారంభ దశలోనే  గమనించి  రెండూ  మూడు సారులు నివారణ చర్యలు  తీసుకున్నట్లతే  తేలికగానే నివారించవచ్చు , తక్కువ్బ నీటి వనరులు కలిగిన భుములలోను  ప్రత్తి  మొక్కజొన్న పంట తీసిన చోట, సమయం ఉన్నచోట ..ఈ పంట సాగును చేపట్టినట్లయితే   ఎకరం వరి పంటకు ఉపయోగించే నీరు షుమారు  5 నుండి 6 ఎకరాలను ఈ జిగురు  గోరు చిక్కుడు  సాగు చేయవచ్చు. వేసవిలో వరి పంట సాగు చేసే రైతులు ముఖ్యంగా బోరు నీరు, పరిమిత నీటి వనరులున్న రైతులు ఈ పంటను సాగు చేసినందువల్ల మంచి ఆదాయం పొదగలరు.ఏది ఏమైనా గోరుచిక్కుడు ఉత్పత్తుల ఎగుమతి పైన  భారత ప్రభుత్వం ఆంక్షలు విదిచటం కాని స్వదేశి వినియోగదారులు విదేశాల నుండి దిగుమతి చేసుకొని ధరలను తగ్గించటం కానీ , మిగతా పంటల లాగా అవకాశం లేదు. కనుక రైతు సోదరులంతా మీమీ ప్రాంతాల అనుకూలతను బట్టి చిగురు గోరుచిక్కుడ సాగు చేపట్టండి. మార్కెట్ ను గురించి భయపడవలసిన పని లేదు. 2013 ఆగష్టు నుండి  దక్షిణ భారతంలోనే ప్రప్రధమంగా గోరుచిక్కుడు మిల్లును స్థాపించడమే కాక ,ఇప్పటివరకు  షుమారు 900 ల మంది రైతులు ఆంధ్ర , కర్ణాటక,తెలంగాణ,రాష్ట్రాల నుండి సరుకు తీసుకొచ్చారు.అలాగే 200ల మంది 50 కేజీ ల నుండి 10క్వింటాళ్ళ దాకా రైతులు ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపారు. వారందరికీ బ్యాంక్ ద్వారా పేమెంట్ పంపటం జరిగింది. ప్రతి రోజు మా వెబ్ సెట్ లో kvkrao.blogspot.in ద్వారా ఏరోజుకారోజు మార్కెట్ ధర తెలియజేస్తున్నాం.ధర తక్కువ ఉన్నప్పుడు మన పంటను అమ్మే అవసరం లేదు , శనగ పంట విదేశాల నుండి దిగుమతి కావడం, ఎగుమతిని ప్రభుత్వం నిషేదించడం  వల్ల ధర పెరగడంలేదు. కనుక శనగ వేసే రైతులు 50 శాతం అయినా  రైతులు శనగకు బదులుగా ఈ పంటను సాగు కు చేపట్ట వలసినదిగా కోరుతున్నాము.   

No comments:

Post a Comment