Thursday, 25 December 2014

Iran may resume basmati Imports from February బాసుమతి పండించిన రైతులకు శుభవార్త

బాసుమతి  పండించిన  రైతులకు  శుభవార్త 
ఈ సంవత్సరం  ఉత్తర భారత దేశం లో  బాసుమతి  సాగు మరియు దిగుబడి  బాగా పెరిగినందువల్ల  మరియు  ఇరాన్  దిగుమతుల పై  తాత్కాలిక  నిషేధం  విధించినందువల్ల  తాత్కాలికంగా  రేట్ తగ్గినప్పటికీ  ఫెబ్రవరి  నుండి  ఇరాన్  తమ దిగుమతి  నిషేదాన్ని  రద్దు చేసుకుంటున్నoదు వల్ల  రేట్  పెరిగే అవకాశం  ఉంది , ఇరాన్   వినియోగించే దానిలో  సగానికి  పైగా  దిగుమతుల మీద  ఆధార పడుతుంది , ప్రతి సంవత్సరం  దాదాపు 10 % వినియోగం  పెరుగుతోంది  , మన దేశంలో కూడా వినియోగం  నానాటికి  పెరుగుతోంది , గత సంవత్సరం  అవసరానికి  తగినంత   ఉత్పత్తి       లేనందువల్ల   క్వింటాల్  ధాన్యం ధర  1121  రకం  4000  దాటింది , అందువల్లే పంజాబ్  రైతులు   చాలా మంది  బాసుమతి  వైపు  మళ్ళారు , ఈ సంవత్సరం  ధర తగ్గటం  వల్ల  వారు కొంత నిరాశ పడ్డారు  , 
బియ్యం  వినియోగించని  రాష్ట్రాలలో  ప్రభుత్వం  మొత్తం ధాన్యాన్ని కొని  లెవీ రూపం లో సేకరిస్తుంది  17 % తెమ తో కొని  వెంటనే  డబ్బు  మొత్తం  చెల్లించే  ఏర్పాటు  ఉంది , కనుక  ఆ రాష్ట్రాలలో మన లాగా  బస్మతిఎతర  రకాలకు   మార్కెట్ సమస్య లేదు   అయెతే  బియాన్ని  ఆహారంగా వినియోగించే  రాష్ట్రాలలో   కేంద్ర  ప్రభుత్వం  ధాన్యం సేకరణను  తగ్గించింది  తద్ద్వారా  రాబోయే రోజుల్లో  ముతక రకాలు  పండించే  ప్రాంతం లో  రైతులకు  అమ్ముకోవడం కష్టం అవుతుంది , గత మూడు నాలుగు  సంవత్సరాలనుండి  ముతక బియ్యం export ధర  కిలో 20 నుండి 21  దగ్గరే  ఉండి  పోయింది   ఉత్పత్తి  ధర   పెరిగినప్పటికీ  అంతర్జాతీయంగా  ధర తక్కువ  ఉన్న రకాలు పండిస్తే   రైతులకు    మేలు జరగదన్న  విషయాన్నీ  మేం చాలా సార్లు  చెప్తూ వచ్చాము , ఇటీవల   APEDA  అధ్యక్షలు  హైదరాబాద్  లో  ఈ విషయం పై  చర్చించి   ఎగుమతి అవుతున్న బియ్యం  టన్ను  400  డాలర్లు  ఒక పక్క , మరో పక్క  టన్ను 12 నుండి  15 వందల డాలర్లు  ( అనగా  బాసుమతి )  ఈ వ్యత్యాసాన్ని   తగ్గించే   విధంగా   శాస్త్రవేత్తలు  800  నుండి  1000  డాలర్లు  టన్నుకు  పలికే   నూతన  వంగడాలను  ప్రవేశపెట్టాలి  అని   పరోక్షంగా   బాసుమతి  లాంటి  బారు రకాలను  ఉద్దేశించి  చెప్పారు , కనుక రైతు సోదరులు  తమకు లాభసాటిగా  ఉండే   రకాలను గురించి  ఆలోచించాలి       

No comments:

Post a Comment