ఆత్మీయ రైతు సోదరులకు మరియు రైతు బిడ్డలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
Wednesday, 31 December 2014
Friday, 26 December 2014
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు : విశ్లేషణ
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు : విశ్లేషణ
ఒక వ్యక్తీ బియ్యం ఉపయోగించేది రోజుకి 100 గ్రాములు , ౩౦౦ గ్రాముల నీరుతో వండిన అన్నం 400 గ్రాములు సగటు వినియోగం , నగరాలలో ఈ రోజు ఒక ఇడ్లి కరీదు 10 రూపాయల పైమాటే , కిలో 40 రూపాయిలు అయినా 100 గ్రాముల ధర నాలుగు రూపాయిలు మాత్రమే , భారత్ దేశం లో అరవై శాతం మంది ఇంకా వ్యవసాయం మీదే ఆధార పడి ఉన్నారు వీరిలో చాలా వరకు వారికి కావాల్సిన ధాన్యపు గింజలను నిలువ చేసుకునే అలవాటు ఉన్నవారే , ఇందులో అలా వీలు కాని వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో 1 నుండి 2 రూపాయలకే బియ్యాన్ని అందిస్తున్నారు , ఓ పది శాతం శ్రీమంతులు ఎంత ధర అయినా పెట్టి బాసుమతి , బాసుమతి లాంటి రకాలను కొనుక్కోగలుగుతున్నారు , మిగిలిన 30 శాతం మధ్యతరగతి వారు , వీరంతా శారీరిక శ్రమ చెయ్యని వారే , వీరిలో కొంత మంది మధుమేహం లాంటి సమస్యలతో బియ్యాన్ని తక్కువే వినియోగిస్తున్నారు , అయెతే బియ్యం ధర కొద్దిగా పెరిగినా , లేదా ఆహార పదార్థాల ధర పెరిగినా ప్రతిపక్ష పెద్దలు మీడియా వారు దీన్ని గోరంతలు కొండంతలు చేసి ప్రచారం చేస్తూ ఆహార పదార్తల ఉత్పత్తి దారులైన రైతులను నిరుత్సహపరుస్తున్నారు , అరవై శాతం మంది వ్యవసాయం మీద ఆధార పడినప్పుడు , వారి ఆదాయం పెరగకపోతే దేశం లో తాయారు అవుతున్న పారిశ్రామిక ఉత్పత్తులు , మిగిలిన నిత్యావసరాలు వినియోగం క్షిణిస్తుంది , ప్రజలు విద్యావంతులు కావాలన్నా , ఆరోగ్యవంతులు గా జీవించాలి అన్నా ఆర్ధికంగా పరిపుష్టి చెందితే తప్ప ప్రభుత్వాలు ఎన్ని ప్రణాలికలు వేసినా ఎన్ని సుబ్సిడిలు ఇచ్చినా , ఎన్ని ప్రచారాలు చేసినా , ఇవన్ని కేవలం ఆర్భాటాలు గా మాత్రమే మిగిలిపోతున్నాయి , ఆర్ధికంగా బలపడిన వ్యక్తీ కుటుంభ నియంత్రణ , పిల్లల విద్య , పరిశుబ్రత వారంతటికి వారే అనుసరిస్తూ వృద్ది చెందుతున్నారు , ఆర్ధికంగా ఎదగలేని వ్యక్తులు ప్రభుత్వాలు ఎన్ని ప్రణాలికలు రూపొందించినా , ఉదాహరణకు నిర్బంద విద్య , కుటుంభ నియంత్రణ , పరిసర పరిశుబ్రత ( టాయిలెట్స్ , తాగడానికి నీళ్ళే లేని చోట్ల టాయిలెట్ ఎలా ఉపయోగించగలరు ? )
కనుక గ్రామీణ ఆర్ధిక పరిపుష్టికి రైతుల ఉత్పత్తులకు సరైన ధర ఇవ్వగలిగినప్పుడు గ్రామీణ ప్రజల ఆర్ధిక పరిస్తితి మెరుగవుతుంది , కనుక ప్రభుత్వం చిన్న రైతు పెద్ద రైతు అనే వ్యత్యాసం చూపించకుండా వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పత్తి కర్చు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ముమ్మరం చెయ్యాలి.
అలాగే రైతులలో నూతన విధానాల పై అవగాహన పెంచే లా , వ్యవసాయ శాస్త్రవేత్తలకు అధికారులకు నిరంతర లక్ష్యాలను నిర్దేశించి భాద్యులను చెయ్యాలి , ఉత్పత్తి కర్చులను తగ్గించిన రైతులను గుర్తించి (పార్టీలకు అతీతంగా ) వారిని ప్రోత్సహించి వారి ద్వారా కూడా మిగిలిన రైతులను చైతన్యవంతులను చేసే దిశగా ప్రభుత్వం చరియలు చెప్పటాల్సిన అవసరం ఎంతైనా ఉంది .
Thursday, 25 December 2014
Iran may resume basmati Imports from February బాసుమతి పండించిన రైతులకు శుభవార్త
బాసుమతి పండించిన రైతులకు శుభవార్త
ఈ సంవత్సరం ఉత్తర భారత దేశం లో బాసుమతి సాగు మరియు దిగుబడి బాగా పెరిగినందువల్ల మరియు ఇరాన్ దిగుమతుల పై తాత్కాలిక నిషేధం విధించినందువల్ల తాత్కాలికంగా రేట్ తగ్గినప్పటికీ ఫెబ్రవరి నుండి ఇరాన్ తమ దిగుమతి నిషేదాన్ని రద్దు చేసుకుంటున్నoదు వల్ల రేట్ పెరిగే అవకాశం ఉంది , ఇరాన్ వినియోగించే దానిలో సగానికి పైగా దిగుమతుల మీద ఆధార పడుతుంది , ప్రతి సంవత్సరం దాదాపు 10 % వినియోగం పెరుగుతోంది , మన దేశంలో కూడా వినియోగం నానాటికి పెరుగుతోంది , గత సంవత్సరం అవసరానికి తగినంత ఉత్పత్తి లేనందువల్ల క్వింటాల్ ధాన్యం ధర 1121 రకం 4000 దాటింది , అందువల్లే పంజాబ్ రైతులు చాలా మంది బాసుమతి వైపు మళ్ళారు , ఈ సంవత్సరం ధర తగ్గటం వల్ల వారు కొంత నిరాశ పడ్డారు ,
బియ్యం వినియోగించని రాష్ట్రాలలో ప్రభుత్వం మొత్తం ధాన్యాన్ని కొని లెవీ రూపం లో సేకరిస్తుంది 17 % తెమ తో కొని వెంటనే డబ్బు మొత్తం చెల్లించే ఏర్పాటు ఉంది , కనుక ఆ రాష్ట్రాలలో మన లాగా బస్మతిఎతర రకాలకు మార్కెట్ సమస్య లేదు అయెతే బియాన్ని ఆహారంగా వినియోగించే రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణను తగ్గించింది తద్ద్వారా రాబోయే రోజుల్లో ముతక రకాలు పండించే ప్రాంతం లో రైతులకు అమ్ముకోవడం కష్టం అవుతుంది , గత మూడు నాలుగు సంవత్సరాలనుండి ముతక బియ్యం export ధర కిలో 20 నుండి 21 దగ్గరే ఉండి పోయింది ఉత్పత్తి ధర పెరిగినప్పటికీ అంతర్జాతీయంగా ధర తక్కువ ఉన్న రకాలు పండిస్తే రైతులకు మేలు జరగదన్న విషయాన్నీ మేం చాలా సార్లు చెప్తూ వచ్చాము , ఇటీవల APEDA అధ్యక్షలు హైదరాబాద్ లో ఈ విషయం పై చర్చించి ఎగుమతి అవుతున్న బియ్యం టన్ను 400 డాలర్లు ఒక పక్క , మరో పక్క టన్ను 12 నుండి 15 వందల డాలర్లు ( అనగా బాసుమతి ) ఈ వ్యత్యాసాన్ని తగ్గించే విధంగా శాస్త్రవేత్తలు 800 నుండి 1000 డాలర్లు టన్నుకు పలికే నూతన వంగడాలను ప్రవేశపెట్టాలి అని పరోక్షంగా బాసుమతి లాంటి బారు రకాలను ఉద్దేశించి చెప్పారు , కనుక రైతు సోదరులు తమకు లాభసాటిగా ఉండే రకాలను గురించి ఆలోచించాలి
Monday, 22 December 2014
42 days old jowar crop of sri paidipally dasharada rao garu
![]() |
| శ్రీ పైడిపల్లి దశాదరావు గారు, మిత్రమా పంచుకో నీ అనుభవాన్ని సాటి రైతు మిత్రులతో ... |
Saturday, 20 December 2014
మొక్కల సాంద్రత దిగుబడి
రైతు
సోదరులకు ..
చాలా మంది
జిగురు గోరుచిక్కుడు ఎప్పుడు
వేస్తె బాగుంటుంది అని అడుగుతున్నారు , ఇంతకుముందు చాలా సార్లు రాసాను , నవంబర్ నెల రైతు నేస్తం వ్యవసాయ
మాస పత్రికలో నా వ్యాసాన్ని
ప్రచురించారు , మరిన్ని వివరాలకొరకు ఆ
ఆర్టికల్ చదవగలరు
ఈ పంటను
జనవరి నేలాఖరిలోగా వెయ్యగలరు ,
చాలా మంది రైతులు దిగుబడి ఎంత వస్తుంది అని అడుగుతున్నారు, దీనికి ప్రతి మొక్క కనీసం
10 గుత్తులు కాస్తే గుత్తికి
ఏడు కాయలు , కాయికి
7 గింజలు (10 x 7 =70 x 7 =490
గింజలు ) ప్రతి ముప్ఫై
గింజలు ఒక గ్రాము , ఈ విధంగా ఒక మొక్క
షుమారు 16 గ్రాములు
గింజలను పండించ గలిగితే ఎకరానికి
ఒక లక్ష మొక్కలు ఉండే విధంగా
విత్తుకోగలిగితే ఎకరానికి 16 క్వింటాళ్ళ దిగుబడి సాదించవచ్చు , దీని బట్టి మనం
తెలుసుకునే ముఖ్య విషయం ఏంటి అంటే
, పొలం లో విత్తే టప్పుడు మొక్కల సాంద్రత సరిపడా ఉండేటట్టు చూసుకుంటే
రైతుకు మంచి దిగుబడి
సాదించడానికి అవకాశం ఉంటుంది
Sunday, 14 December 2014
letter
రాయచూరు
15.12.14
ప్రియాతిప్రియమైన మిత్రులు
తెలుగు విద్యార్ధి గారికి మీ మిత్రుడు
కొల్లూరి వెంకట కృష్ణా రావు వ్రాయు లేఖార్ధములు, ఇక్కడ మేమంతా క్షేమం గానే
ఉన్నాం , మీ క్షేమ సమాచారం తెలుపగోరతాము
.
మీ
పిత్రుసమానులైన కొల్లూరి కోటేశ్వరరావు గారు , స్వర్గస్తులైన వెంటనే
మీకు ఉత్తరం రాయాలి అనుకున్నాను , జరా మరణములు సహజములే
, మీలాంటి సాహితి పుత్రులను కలిగిన
కోటేశ్వరరావు గారు అమరులే , ఈ
విషయాన్నీ మీకు వ్రాసే అంతటి పెద్దవాడిని
కాకపోయినా ఏదో నాకు తెలిసిన విధంగా వ్రాస్తున్నాను , కార్డు కొరకు చాలా
రోజులనుండి ప్రయత్నిస్తే, ఉత్తరాలు
రాసే రోజులు ఎప్పుడో పోయాయి , కార్డ్లు
కవర్లు లేవు మెయిలు పంపండి తాతగారు అంటూ
నా మనమరాలు చిన్న సలహా ఇచ్చింది.
అయ్యా పిల్లకాకి
దానికేం తెలుసు ఉత్తరాల మహిమ , మా చిన్నప్పుడు చెట్టు పై కాకి అరిస్తే చుట్టా లైనా రావాలి , ఉత్త రాలైనా
రావాలి అని ఎదురు చూసే వాళ్ళం ,
ఉత్తరం వస్తే ఆనందం , చుట్టాలొస్తే
పరమానందంగా ఉండేది , ఆ విషయాలు వారికి
చెప్పినా అర్ధం కావు , అంతే కాదు
ఫలానా రోజు వస్తున్నాం అని ఉత్తరం
వ్రాసి దూరప్రాంత నగరాలనుండి వస్తున్న చుట్టాలకొరకు ఎదురు చూస్తూ
వారు వచ్చే నాటికి ఏమేమి వంటకాలు
చెయ్యాలి అని ఆలోచించే వాళ్ళం , జున్ను పాల కొరకు
ఎవరి ఆవు ఈతకు వచ్చిందో తెలుసుకునే వాళ్ళం , ఉలవలు
ఎవరెవరు ఎడ్లకు పెడుతున్నారో
తెలుసుకునే వాళ్ళం , ఎందుకంటే
పట్నం నుండి వచ్చే చుట్టాలకు ఉలవచారు
రుచి చూపించాలి కదా , ఇలాంటి ప్రయత్నాలు
చేస్తూ ఎంతో సంబరంగా ఆ రాబోయే చుట్టాల రాక కొరకు ఎదురు చూస్తూ
ఉండేవాళ్ళం , అంతే కాదండోయి , ప్రక్క
ఊళ్ళో ఉన్న మా బంధువులకు ఈ విషయం తెలియజేస్తే వచ్చిన భందువుల్ని వారింటికి కూడా తీసుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకునే వారు , అదే భందువుల సంఖ్య ఎక్కువ ఉంటె , వచ్చినవారు తక్కువ రోజులు
ఉండేటట్టు అయెతే , పూటకు ఒకరి చొప్పున
వార్ని విందుకు ఆహ్వానించే వారు ,
అయ్యా ... తెలుగు విద్యార్ధి గారు, పూర్వం
మీలాంటి సారస్వత పుత్రులను చదివి ,
మా అభిప్రాయాలను వ్రాస్తే వచ్చే సంచిక లో మా పేరు వస్తుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ ,
రాక పొతే నిరాశ చెందక , మళ్ళి మళ్ళి వ్రాస్తూ సంవత్సరాల తరబడి ఉత్తరాలు రాసేవాళ్ళం , వారి
దయతో మా పేరు ప్రచురిoచ బడితే జన్మ ధన్యమైనట్టుగా భావించి
ఆ పత్రిక ను అపురూపంగా చూస్తూ
అడిగినవారికి , అడగని వారికి చూపిస్తూ
పరమానంద పడి పోయేవాళ్ళం , ఆ రోజులు
పోయాయి , ఇప్పుడంతా ఇంటర్నెట్ ,
ఫేస్బుక్ , ఈ మెయిల్స్ , క్షణాలలో
ప్రపంచమంతా తెలిపే సాధనాలు
వచ్చేశాయి తాత గారు అంటూ
నా మనవరాలు అంటుంటే నా మనసు అంగీకరించక , అదేంటమ్మ పత్రికలలో చాలా ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా అని అంటే ,
అవన్నీ బహుమతుల ఆశచూపి పత్రికల వారు
రాయించుకునే ఉత్తరాలు తాతగారు అంటూ , ఒక
పత్రిక లో రెండు బొమ్మలు వేసి తేడాలు కనిపెట్టి రాస్తే 500 బహుమతి, సరిగ్గా వ్రాసిన ఉత్తరాలలో డ్రా తీసి ముగ్గురికి సమానంగా బహుమతిని పంపుతాము అంటూ
ఆశ చూపి రాయించుకునే ఉత్తరాలే
తాతగారు అంటూ నా మనవరాలు
ఉత్తరాన్ని చిన్న చూపు చుస్తే చూడవచ్చు కాని నేను మాత్రం మీకు
ఉత్తరాలు రాస్తూనే ఉంటాను , మీరు కూడా విసుగు చెందక తప్పక చదవగలరు అని ఆశిస్తున్నాను , నాన్నగారి
ఆత్మకు శాంతి చేకూర్చాలి అని ఆ భగవంతుడిని
ప్రార్ధిస్తున్నాను , మన మిత్రులు అందరిని అడిగినట్టు
చెప్పగలరు , ఈ ఉత్తరం అందిన వెంటనే
మీ అందరి యోగక్షేమాలతో ఉత్తరం
రాయగలరు , మీ ఉత్తరం కొరకు వేయి
కళ్ళతో ఎదురు చూస్తుంటాను , నేను
పెద్దగా చదువుకొని సంగతి మీకు తెలుసు
, ఈ ఉత్తరంలో ఏమైనా తప్పులు
ఉంటె మన్నించగలరు .
ఇట్లు
భవదీయుడు
కొల్లూరి వెంకట కృష్ణా రావు , రాయచూరు , కర్ణాటక
Thursday, 11 December 2014
తగ్గిన ధాన్యం ధరలు
12.12.2014
రైతు
సోదరులారా
ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తుల
ధరలు తాత్కాలికంగా తగ్గుదలలో ఉన్నాయి , కారణాలు ధాన్యం
ధర తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం లెవీ
విధానంలో తీసుకున్న మార్పులు , ప్రభుత్వం
వద్దే దాదాపు 3.5
కోట్ల టన్నులు బియ్యం
నిలువ ఉండడం , పేదలకు ఇచ్చే రూపాయి
రెండు రూపాయిలు కి ఇచ్చే బియ్యం తిరిగి మార్కెట్లోకే రావడం , ఇలాంటి కారణాల వల్ల
ముతక బియ్యం ధరలు తగ్గే అవకాశాలు
ఉన్నాయి , అయెతే సన్న బియ్యం అనగా
సోనా మసూరి , సాంబ మసూరి BPT , జై
శ్రీ రాం , బాస్మతి లాంటి
బియ్యానికి కూడా ధరలు తగ్గించి
కొనుక్కోవడానికి వ్యాపార
వర్గాలు చేస్తున్న ప్రయత్నమే
కాని మరొకటి కాదు , కనుక
మంచి డిమాండ్ ఉన్న పై రకాలను తక్కువ ధరలకు అమ్మవద్దు ,
ఇప్పటికే ఈ వారంలో జై
శ్రీ రాం రకం ధాన్యం ధర తగ్గి
మళ్ళి పెరుగుతుంది , ఆ రకం ధాన్యం ముందుగా మార్కెట్లోకి రావడం వల్ల రైతు
సోదరులు అందరు ఎక్కువ శాతం అమ్మేసుకున్నారు , అయెతే ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి , సకాలం వర్షాలు
లేకపోవడం తరువాత తుఫాన్లు , అధిక వర్షాలు తెగుళ్ళు
మొదలైన సమస్యలతో గత సంవత్సరం దాదాపు
10.5 కోట్ల టన్నులు బియ్యం
ఉత్పత్తి జరగగా ఈ సంవత్సరం 9
కోట్ల టన్నులే ఉండవచ్చు
అని ముందస్తు అంచనాలు
చెప్తున్నాయి , కూలీల కొరత ఎరువుల ధరల పెరుగుదల సకాలం లో పెట్టుబడులు అందక అధిక వడ్డిలకు
రైతులు అప్పులు చేసి , తగ్గిన ధాన్యం ధరల వల్ల
తీవ్ర నష్టాలకు గురై నిరాశతో
ఉన్నారు . అయెతే ప్రస్తుత తరుణంలో రైతు ఉత్పత్తి కర్చులను
తగ్గించే దిశగా ఆలోచించాలి , స్వల్ప కాలిక
రకాలు తక్కువ ఎరువులతో , తక్కువ కర్చుతో
ఎక్కువ దిగుబడినిస్తున్న నూతన విధానాలు అనగా
విత్తనాన్ని నేరుగా విత్తడం ,
దమ్ము చేసిన చేలో వెదజల్లటం అవసరమైన
మేరకే ఎరువులను వాడటం , అవసరానికన్నా
ఎక్కువ ఎరువులను వాడి ఎక్కువ దిగుబడులను తియ్యొచ్చు అనే అపోహలనుండి బైటకు రావాలి , వరి సాగు లో ఎకరానికి
కర్చు పది నుండి
15 వేలు పెడుతున్న రైతులు ఒక వైపు , 25 నుండి 30 వేలు కర్చు పెడుతున్న
రైతులు ఒక వైపు కనిపిస్తున్నారు , అయెతే దిగుబడి మాత్రం
35 నుండి 40 బస్తాలు
సరాసరి దిగుబడి మాత్రమే వస్తుంది , అధిక ఉత్పత్తుల ప్రయత్నం వల్ల అత్యదిక కర్చులు పెట్టి రైతు నష్టపోవడం జరుగుతుంది కనుక రైతు సోదరులంతా తప్పనిసరి పోలాలలో మాత్రమే వరిని పండించే ప్రయత్నం చెయ్యండి , నానాటికి దేశంలో మధుమేహ
రోగులు పెరుగుతున్న ఈ తరుణంలో
బియ్యం తలసరి వినియోగం
తగ్గుతూ వస్తుంది , ఇది ప్రపంచ
వ్యాప్తంగా వస్తున్న మార్పు కనుక రైతు సోదరులందరూ దిన్ని గమనించి ధాన్యం
ఉత్పత్తి కర్చును చేతనైనంత వరకు తగ్గించాలి , అలాగే ప్రతి రైతు
తప్పని సరిగా మన మన మాతృభాషలలో
వస్తున్న వ్యవసాయ మాస పత్రికలను తప్పనిసరిగా
కొని చదువుతూ అవగాహనను
పెంచుకోవచ్చు
58 cows die due to food poisoning at Sindhanur Goshala
అధిక దిగుబడులు సాధించాలి అనే ప్రయత్నం లో అత్యదిక ఎరువుల వినియోగం ఫలితంగా వచ్చిన తెగుళ్ల నియంత్రణ కు వాడిన క్రిమిసంహారక మందుల అవశేషాలు కలిగిన వరి గడ్డిని తిని మనం కామధేను గా పూజించే గోమాతల మరణం చాలా భాధాకరం , ఇటువంటి విషపూరిత ఆహరం తీసుకుంటున్న మనం కూడా ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం ...ఆలోచించండి రైతన్నలారా
NATIONAL » KARNATAKA
RAICHUR, December 8, 2014
Updated: December 8, 2014 19:00 IST
58 cows die due to food poisoning at Sindhanur Goshala

Fifty-eight cows have died and 162 more were in critical condition after apparently consuming poisonous fodder at a Goshala in Sindhanur, about 95 kms from Raichur, on Monday morning. The Goshala is being run by Bhagavan Mahaveer Charitable Trust.
According to the details provided by the Goshala management, the workers had served fodder to the cattle twice at 8 p.m. and 9 p.m. on Sunday before going to bed. The tragedy was discovered when they woke up at 5.30 a.m. on Monday as usual.
“The workers immediately alerted the Goshala management and we in turn summoned veterinary physicians right away,” Lalchand Jain, secretary of the Trust said.
By the time veterinary staff rushed to the spot and swung into action, 58 cows were already dead. They began treating other cows that were in critical condition and succeeded in saving them.
Poisoning
Veterinary staff concluded that the food poisoning could be the cause for cattle death. “Though the exact cause for death could be ascertained only after we get a detailed post-mortem report. Yet, we couldprima facie conclude that it is a case of food poisoning,” Eerappa, a veterinary physician attached to Javalagera veterinary centre, said.
It is learnt that recently harvested bundles of paddy straw, that were contaminated with pesticides sprayed before the harvest, was served to the cattle.
“Most of the dead cows have been buried en mass to prevent environment pollution and spread of infection. A couple of them are retained for post-mortem,” Deputy Superintendent of Police M.V. Suryavamshi, who visited the spot told The Hindu.
Huge crowd
As the news of cows’ death spread in Sindhanur and surrounding villages, hundreds of people rushed to the spot. Some people angrily expressed their dissatisfaction over the way the Goshala was being run. They alleged that the cows in the Goshala were not taken care of with sufficient and quality fodder.
Sindhanur tahashildar, M. Gangappa Kallur, Agriculture Price Commission member, Hanumanagowda Belagurki, Circle Inspector of Police (Sindhanur circle) Ramesh Rotti, Sindhanur Rural Police Sub-Inspector, Balanagowda were among the officials who visited the spot.
Monday, 1 December 2014
Fall in paddy prices and basmati 1509 farmers , Iran temporary export ban
వరి పండించే రైతు సోదరులారా ఆలోచించాలి :
ప్రభుత్వం వద్ద దాదాపు 3.5 కోట్ల టన్నుల బియ్యం నిల్వ ఉండటం , లెవీ సేకరణ విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వరికి గిట్టుబాటు ధర సమస్యగా మారింది , కనుక ఉత్పత్తి కర్చును తగ్గించే విధానాలపై దృష్టి సారించడం సాధ్యమైనంత వరకు వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మారటం , భూగర్భ జలాలతో వరిని పండించక పోవడమే మేలు , ప్రత్యామ్నాయంగా జిగురు గోరుచిక్కుడు , పప్పు గింజలు , తెల్ల నువ్వులు లాంటి పంటలు పండించడం లాభదాయకం కాగలదు .
ప్రభుత్వ పధకాల ద్వారా , అతి తక్కువ ధరకు ఇస్తున్న బియ్యం తిరిగి మార్కెట్ లోకే రావడం , నానాటికి తగ్గుతున్న బియ్యం వినియోగం , అంతర్జాతీయంగా కూడా బియ్యం ఉత్పత్తి పెరగటం లాంటి కారణాల వల్ల బాసుమతి యేతర బియ్యానికి పెద్దగా ధర వచ్చే అవకాశాలు కనపడటం లేదు , ఎగుమతికి బాగా అవకాశం ఉన్న , మంచి ధర రాగలిగిన గింజ పొడవు రకాలైన పూసా 1509 , 1121 లాంటి రకాల సాగు వల్ల ఉత్పత్తి కర్చుకన్నా రెట్టింపు ధర పొందగలిగే పై రకాలను సాగు చేసినందువల్ల రైతులు లాభ పడగలరు .
అతి పెద్ద బాస్మతి బియ్యం దిగుమతి చేసుకునే దేశం ఇరాన్ , తాత్కాలిక దిగుమతి నిషేధం వల్ల ధరలు కొంత తగ్గినప్పటికీ ఫెబ్రవరి నుండి బాసుమతి ధరలు పెరిగే అవకాశం ఉన్నది , కనుక బాసుమతి పండించిన రైతులు నిరాశ చెందనవసరం లేదు
ఉత్పత్తి కర్చు తగ్గించే విధానం :
దాళ్వా లో దమ్ము చేసి నేరు గా మొలక కట్టిన విత్తనాన్ని చల్లటం , బాస్పరపు ఎరువు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇవ్వడం.
దాళ్వా లో తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ వాడటం .
urea పోటాష్ లను సగం మోతాదు ,మొలకెత్తిన 15 వరోజు మిగిలిన సగాన్ని 30 వరోజు urea పోటాష్ అంతే మోతాదు vermi compost లో కలిపి 24 గంటలు తరవాత చల్లాలి , కలుపు నివారణకు కలుపు మందులనే వాడండి .
ఈ విధంగా చేస్తే ఉత్పత్తి ఖర్చు సాధ్యమైనంత వరకు తగ్గించ వచ్చు
విత్తన శుద్ధిని మరవవద్దు
ప్రభుత్వం వద్ద దాదాపు 3.5 కోట్ల టన్నుల బియ్యం నిల్వ ఉండటం , లెవీ సేకరణ విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వరికి గిట్టుబాటు ధర సమస్యగా మారింది , కనుక ఉత్పత్తి కర్చును తగ్గించే విధానాలపై దృష్టి సారించడం సాధ్యమైనంత వరకు వరికి ప్రత్యామ్నాయ పంటల వైపు మారటం , భూగర్భ జలాలతో వరిని పండించక పోవడమే మేలు , ప్రత్యామ్నాయంగా జిగురు గోరుచిక్కుడు , పప్పు గింజలు , తెల్ల నువ్వులు లాంటి పంటలు పండించడం లాభదాయకం కాగలదు .
ప్రభుత్వ పధకాల ద్వారా , అతి తక్కువ ధరకు ఇస్తున్న బియ్యం తిరిగి మార్కెట్ లోకే రావడం , నానాటికి తగ్గుతున్న బియ్యం వినియోగం , అంతర్జాతీయంగా కూడా బియ్యం ఉత్పత్తి పెరగటం లాంటి కారణాల వల్ల బాసుమతి యేతర బియ్యానికి పెద్దగా ధర వచ్చే అవకాశాలు కనపడటం లేదు , ఎగుమతికి బాగా అవకాశం ఉన్న , మంచి ధర రాగలిగిన గింజ పొడవు రకాలైన పూసా 1509 , 1121 లాంటి రకాల సాగు వల్ల ఉత్పత్తి కర్చుకన్నా రెట్టింపు ధర పొందగలిగే పై రకాలను సాగు చేసినందువల్ల రైతులు లాభ పడగలరు .
అతి పెద్ద బాస్మతి బియ్యం దిగుమతి చేసుకునే దేశం ఇరాన్ , తాత్కాలిక దిగుమతి నిషేధం వల్ల ధరలు కొంత తగ్గినప్పటికీ ఫెబ్రవరి నుండి బాసుమతి ధరలు పెరిగే అవకాశం ఉన్నది , కనుక బాసుమతి పండించిన రైతులు నిరాశ చెందనవసరం లేదు
ఉత్పత్తి కర్చు తగ్గించే విధానం :
దాళ్వా లో దమ్ము చేసి నేరు గా మొలక కట్టిన విత్తనాన్ని చల్లటం , బాస్పరపు ఎరువు సింగల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఇవ్వడం.
దాళ్వా లో తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ వాడటం .
urea పోటాష్ లను సగం మోతాదు ,మొలకెత్తిన 15 వరోజు మిగిలిన సగాన్ని 30 వరోజు urea పోటాష్ అంతే మోతాదు vermi compost లో కలిపి 24 గంటలు తరవాత చల్లాలి , కలుపు నివారణకు కలుపు మందులనే వాడండి .
ఈ విధంగా చేస్తే ఉత్పత్తి ఖర్చు సాధ్యమైనంత వరకు తగ్గించ వచ్చు
విత్తన శుద్ధిని మరవవద్దు
Subscribe to:
Comments (Atom)


