మే 20 , 2014 నా జీవితం లో మరువలేని రోజు కారణం , ఒక
మహోన్నత మానవతా మూర్తి ప్రసంగాన్ని వినటం
,
అయన ఎవరో కాదు మన ప్రధాని
అభ్యర్ది నరేంద్ర భాయి మోడీ , భావి భారతీయులు చరిత్ర చదివి
నమ్మశక్యం కాని విషయంగా
సందేహించినా సందేహించవచ్చు కాని ఈ
ఉపన్యాసం మన అదృష్టంగా భావిద్దాం , పార్లిమెంట్ సెంట్రల్ హాల్ లో ఆయన భావోద్వేగ పూరిత ప్రసంగాన్ని విని చూచిన నాకు ఒక మహోన్నత మానవతావాదిని
ఆశావాదిని పురోగామిని , ఒక
మహనీయుడిని దర్శించిన అనుభూతికి అక్షర రూపం
చాలా మంది ఆయనకు ఎన్నో
లోపాలు ఆపాదించి ఆయన్ను కించపరిచినా అవన్నీ ఆశిస్సులు గా భావించి అయన మాత్రం ఎవర్ని
కించపరచకుండా భారత మాత బిడ్డగా , భారతీయ జనతా పార్టీ బిడ్డ గా ,
మానవతా వాదిగా , భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని
భారతీయ సంస్కృతిని వివరించిన తీరు
, అద్భుతం , స్వాతంత్ర పోరాట నాయకులను
స్మరిస్తూ స్వాతంత్ర పోరాటం లో పాల్గొనే అవకాశం లేకపోయినా జైలు
జీవితాన్ని , ఆంగ్లేయుల లాటి దెబ్బలు కాని ఆనాటి పోరాట యోధుల త్యాగాలను తను అనుభవించక పోయినా వారి త్యాగాల ఫలితంగా వచ్చిన
స్వాతంత్రియాన్ని , భారత
దేశాన్ని మహోన్నత స్తితికి తీసుకు వెళ్ళడానికి నేటి మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ , పార్లిమెంట్ ఔన్యత్త్యాన్ని వివరిస్తూ ఉంటె ఒళ్ళు గగుర్పడుస్తుంది ,
క్రిందటి నెలలో పార్లిమెంట్ లో జరిగిన ఘటనలను
తలుచుకుంటే ఎంతో సిగ్గు బాధ కల్గుతుంది
ఒక సందర్భం లో అయన 125 కోట్ల మంది ఒక అడుగు ముందుకు వేస్తె ఈ దేశం 125 కోట్ల అడుగులు ముందుకు నడుస్తుంది అనటం ఆయనలోని ఆశావాది, కార్యవాది, అయిన నాయకుడిని
దర్శించవచ్చు , ఇటువంటి నిస్వార్ధ సమర్దవంత నాయకుడిని దేశానికి ప్రసాదించిన మోడీ గారి తల్లి తండ్రులకు భారత జాతి రుణపడి ఉంటుంది,
అయన లో లేని లోపాలను వేదికి కాలయాపన చెయ్యక, మంచి పనులతో దేశ ప్రజల మన్ననలు పొంది రాజకీయంగా
ఎదగటానికి ప్రయత్నించాలే కానీ కుల, మత, ప్రాంతీయ, విభేదాలను సృష్టించి గాని, డబ్బు మద్యం పదవుల లాంటి ప్రలోభాలతో అధికారం
పొందవచ్చు అనుకోవటం అవివేకం అనేది ఈ ఎన్నికలు
రుజువు చేస్తున్నాయి
ప్రభుత్వం ప్రజలకు సేవ
చేయ్యటానికే కాని రాజకీయ నాయకులు ప్రభుత్వ
ఉద్యోగులు ప్రజా సేవకులం అనే అంకిత భావం
తో నిస్స్వార్ధ సేవ చేస్తే ఈ దేశ ప్రజలు
ఆదరిస్తారనడానికి ఈ ఎన్నికలే నిదర్శనం ,
అలాగే చరిత్ర లో వారి స్థానం శాశ్వతం అంతే గాని మన స్వంత సంపదను వృద్ధి చేసుకునే
యావలో ఉన్న రాజకీయ నాయకులు ప్రభుత్వ
ఉద్యోగులకు ఈ ఎన్నికలు ఒక నిశబ్ద విప్లవంగా ఒక హెచ్చరిక గా గుర్తించగలరు
జై
హింద్
No comments:
Post a Comment