తెలంగాణా ప్రాంతం లో
ప్రప్రథమంగా బాసుమతి పంటను పండిచి ఆ పంట ను పంజాబ్ లోని అమ్రిత్సర్ కు ఎగుమతి చేసి
, యావద్ దక్షిణ భారత దేశం రైతులకు ఆదర్శప్రాయం అయిన ఉత్తర తెలంగాణా రైతు సోదరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు
పదిహేను
సంవత్సరాలనుండి బస్మతిని దక్షిణ భారతంలో ప్రవేశ పెట్టడానికి మేం
చేస్తున్న కృషికి సాఫల్యం చేసిన ఉత్తర తెలంగాణా లోని వరంగల్ , కరీంనగర్,
నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలోని అనేక
మంది రైతు సోదరులు షుమారు అయిదు వేల ఎకరాలలో బస్మతిని పండించి బాసుమతి కి
పుట్టినిల్లు అంటున్న పంజాబ్ కే ఎగుమతి చేసిన రైతు సోదరుల సాహసం మిగిలిన దక్షిణ భారత రైతులందరికీ ఆదర్శం కావాలని భవిష్యత్ లో వరి పంటకు మాతృభూమి అయిన దక్షిణాదిన కూడా
విరివిగా ఈ పంటను పండించి వినియోగదారులకు సరసమైన ధరకు బాసుమతి బియాన్ని అందించటమే కాకుండా 1010 లాంటి ముతక రకాలకన్నా మూడు రెట్లు ఎక్కువ ఎగుమతి ఆదాయాన్ని తెచ్చే బస్మతిని ని పండించి ప్రపంచ బాసుమతి చిత్రపటం లో
తెలంగాణా – మరియు ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాలను కూడా చేరుద్దాం .
జై కిసాన్
No comments:
Post a Comment