Wednesday, 14 May 2014

బాసుమతి పంటలో అత్యదిక దిగుబడి సాదించిన రైతు .....




పూసా సుగంద -5 దేశంలోనే రికార్డు పంట పండించిన  రైతు  ఆంద్ర ప్రదేశ్ మెహబూబ్ నగర్ జిల్లా , వనపర్తి తాలూకా , పెద్ద మందడి మండలం , వెల్తురు గ్రామ రైతు శ్రీ జగదీశ్వర రెడ్డి గారు Ph : 09948485818,  ఈ వేసవి పంటలో  దేశంలోనే  అధిక ఉత్పత్తి  సాదించిన రైతు , వీరు మూడేకరాలలో  సాగు చేసిన పూసా సుగంద -5  115 క్వింటాళ్ళు దిగుబడి సాదించి , ఈ రకం సృష్టించిన సాస్త్రవేత్తలనే  ఆశ్చర్యపరిచారు , ఈ రకం ఇంకా బాసుమతి గా గుర్తింప బడనప్పటికి 8 మిల్లి మీటర్లు  గింజ పొడవు కలిగి బాస్మతి లో కలిపి అమ్మడానికి  మంచి గిరాకి ఉన్న  వెరైటీ , కనుక రైతు సోదరులు ఎ విధమైన సంకోచానికి తావివ్వకుండా ముతక రాకాలు పండించే ప్రాంతాలలో  దీన్ని  పండిస్తే మంచి లాభాలు పొందగలరు , బాసుమతి ప్రసక్తి రాగానే చాలా మంది రైతులు ముందుగానే రేట్ నిర్ణయించమని అడుగుతారు , విదేశీ మారక ద్రవ్యాన్ని అనుసరించి మరియు దేశం లో ఉత్పత్తి పై ఆధార పడి  ఈ పంట ధర నిర్ణయింప బడుతుంది ,2012  లో క్వింటాల్ ధర 1500 నుండి 2000 వరకు మాత్రం రేట్ ఉండగా చాలా మంది రైతులు దీన్ని పండించ నందున  2013 లో దీని ధర ౩౦౦౦ నుండి 4000  రూపాయలు క్వింటాల్ పలికింది , అయెతే డాలరు రూపాయి మారకం విలువ పై కూడా దీని ధర ఆధార పడి ఉంటుంది , ఎదే ఏమైనప్పటికీ మన దేశం లో  దీని వినియోగం రోజు రోజు పెరుగుతున్నందున దీని ఉత్పత్తి ఉత్తర భరతం లో జరిగి దక్షిణ భరతం వరకు అయ్యే  ట్రాన్స్పోర్ట్  కర్చు చాలా ఆవ్తుంది కనుక దక్షిణ భారత దేశం లో కూడా మనం పండిస్తే స్థానిక అవసరాలను తీర్చడమే కాకుండా విదేశాలకు కూడా export చేసుకోవచ్చు , చాలా మంది వ్యసాయ శాస్త్రవేత్తలు అధికారులకు బాసుమతి ఇక్కడ పండదని ఒకవేళ పండించినా దీనికి GI  ఉందని తెలియని ప్రచారం జరుగుతుంది , దీనికి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం GI ఇవ్వలేదు , చాలా రాష్ట్రాలు వెతిరేకిస్తున్నై , ఇప్పటికే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర  రాజస్తాన్ కేరళ కర్ణాటక రాష్ట్రాలలో దీన్ని చాలా మంది రైతులు సాగు చేస్తున్నారు , తెలంగాణా లోని కరీంనగర్ జిల్లలో కొందరు రైతులు తెలంగాణా బాసుమతి గ్రోవేర్స్ అసోసియేషన్ regester చేయించారు , ఈ వేసవి లో షుమారు అయిదు వేల ఎకరాలలో ఈ పంట సాగు చెయ్యడం జరిగింది , అంతే కాకుండా పంజాబ్ హరియాణా  రాష్ట్రాలనుండి వేసవలో  వారికి పండదు కనుక విత్తనం కొరకు  కోడ్ నెంబర్ ద్వారా బాసుమతి అన్ని రకాలు నిజామాబాద్  ఆదిలాబాద్ , వారంగల్  లాంటి జిల్లాలోనే కాకుండా రాయలసీమ కర్నూలు నంద్యాల చుట్టుపక్కల చాలా మంది రైతుల ద్వారా  ఎన్నో సంవత్సరాలనుండి పండించడం జరుగుతోంది . కనుక సందేహాలకు తావివ్వకుండా ఇక్కడ రైతులు కూడా పండిస్తున్నారు , గత పడి సంవత్సరాల నుండి కర్ణాటక మరియు  తెలంగాణా లో ని కొన్ని  ప్రాంతాలలో మా మిల్లు ద్వారా విత్తనాలు ఇచ్చి పండించడం జరుగుతుంది , అయెతే నెల్లూరు జిల్లలో కొంతమంది ముందుగానే ఎక్కువ రేట్ ఆశ చూపి రైతుల ద్వారా పండించి రేట్ తక్కువ అయినందున ఆ పంటను వారు కొనలేక వదిలేసిన సంఘటనలు కొన్ని జరిగాయి అయితే శాశ్వతంగా బాసుమతి కొరకే మా మిల్లు స్థాపించడం జరిగింది , ఉత్శావంతులైన రైతులు కనీసం ఒక లారి లోడ్ కు సరిపడా పండిస్తే మేం కొనుగోలు చెయ్యగలం

No comments:

Post a Comment