Saturday, 31 January 2015

రైతు సోదరులకు

రైతు  సోదరులారా ...
ఆహార ధాన్యాల  నిలువలు  దేశంలోనూ  విదేశాలలోనూ  ఇబ్బడి  ముబ్బడి గా  నిలువలు ఉండటమే కాక , ఈ సంవత్సరం  అన్ని దేశాలలో పంటలు కూడా బాగా పండటం ఒక  కారణమైతే,  ప్రపంచవ్యాప్తంగా   ఆహార వినియోగం  పై  పెరిగిన  అవగాహన  వల్ల , ఆహార ధాన్యాలతో పాటు పళ్ళు  కూరగాయలు   మాంసం  గ్రుడ్లు  పాలు  మొదలైన అత్యంత  పోషక  విలువలు   కలిగిన  ఆహరం వినియోగం  పెరగడం వల్ల  ఆయా పదార్తలా  విలువలు  పెరిగి  ఆహార ధాన్యాల  వినియోగం తగ్గుతూ  వాటి ధరలు   మందకొడిగా  ఉంది , ఉదాహరణకు  గత సంవత్సరం  బాస్మతి  బియ్యంతో  సమాన విలువ  కలిగిన  గొడ్డు మాంసం  మన దేశం నుంచి ఎగుమతి  అయ్యింది , కనుక రైతు సోదరులు  కూడా  వ్యవసాయం లో  routine  గా  పండించే పంటలే  కాకుండా  ప్రపంచ  ప్రజల మారిన  ఆహారపు  అలవాట్లకు అనుగుణంగా  రైతు సోదరులు  తమ పంట విధానాలను  మార్చుకుంటే  వ్యవసాయం  లాభసాటి  కాగలదు.
గత   సంవత్సరం  మన దేశం నుండి  కూరగాయలు  పళ్ళు  8760  కోట్ల  రూపాయల  విలువైన  ఎగుమతులు  చేసారు , వాటిలో  పళ్ళు   3300  కోట్లు  అదే కూరగాయిలైతే  5460  కోట్ల  రూపాయల ఎగుమతులు  చెయ్యగలిగాం  పళ్ళలో  మామిడి , ద్రాక్ష . అరటి , దానిమ్మ  మొదలైనవి దేశం లో వినియోగించటమే  కాక విదేశాలకు  కూడా  ఇంకా ఎగుమతులు పెంచవచ్చు , నాణ్యత ఇంకా పెంచగలిగితే ఇంకా ఎక్కువ ధర పొందవచ్చు , అదే కూరగాయిలతే బెండ  పచ్చి మిర్చి కాకరకయిలు  పుట్టగొడుగులు , బంగాళా దుంపలు లాంటి నాణ్యమైన  కూరగాయలకు  అమెరికా , బ్రిటన్ , జర్మనీ , సింగపూర్ , రష్యా , కువైట్ , నేపాల్ , బంగ్లాదేశ్ , అరబ్ దేశాల కూటమి  U A E , సేంద్రియ  పద్దతులలో  పండించిన  ఆహార పదార్థాలకు దేశ విదేశాలలో  మంచి గిరాకి ఉన్నందున  రైతులు  ఆ పద్ధతులను అవలంభించి  పంటలు  పండిస్తే  మంచి  ఆకర్షణీయమైన ధరలు పొందవచ్చు.

గతం లో మన  కూరగాయల ధరలు  సీజన్ ని బట్టి  ధరలు తగ్గటం పెరగటం  చూసే వాళ్ళం  , ప్రస్తుతం టమాటో మరియు ఉల్లిపాయ  ఈ రెండిటిలోనే  ఈ పరిసితిని  ఎదుర్కొంటున్నాం , అయెతే శీతల  గిడ్డంగులు  అందుబాటు లోకి  తేవడం ,  విలువ వృద్ది  చేసే  విభిన్నమైన  పద్ధతులు  రైతుకు అందుబాటులోకి తేవడానికి  కేంద్ర ప్రభుత్వం   ఫుడ్ పార్క్ లను స్థాపిస్తుంది , ఉత్సాహవంతులైనటువంటి  యువ రైతులు ఈ నూతన  విధానాలను  ఆచరించి  వ్యవసాయాన్ని  లాభసాటిగా  మార్చి  ఇతర రైతులకు  ఆదర్శంగా నిలవాలి , అలా కాని పక్షంలో  వ్యసాయం కూడా  విదేశీ పెట్టుబడిదారుల చేతిలోకి  వెళ్ళే రోజు  దగ్గరలోనే  ఉంది .


                                                          ఇట్లు  మీ  .....K  V  K  

1 comment: