Sunday, 13 July 2014

gallery

మద్యలో ఉన్న వారుమనందరికీ  పరిచయస్తులైన  మడమ  తిప్పని  మహా  యోధుడు 1991  నుండి  (పాల  పార్టీ) మిల్క్ ఫెడరేషన్   అధ్యక్షుడు మండవ జానకి రామయ్య గారిని  గూర్చి  ఎంత చెప్పినా  తక్కువే , రైతు కుటుంభం లో జన్మించి  ఇంటర్  వరకే  చదువుకున్నా  రైతుల కోసం  అనుక్షణం శ్రమిస్తూ  నేటి వరకు  పాడి పరిశ్రమ సామాఖ్య  అధ్యక్షులుగా  కొనసాగుతూ   కోట్లాది రూపాయలను  రైతులకు బోనస్ గా ఇచ్చి  పాడి పరిశ్రమను అచలoఅంచలుగా   అభివృద్ధి చేసి  ఇరవై కోట్ల  వార్షిక  వ్యాపారాన్ని 500  కోట్ల వరకు పెంచి కృషి,  పట్టుదల  , నిజయీతి  ఉంటె ఆసాధ్యమనేది లేదని నిరుపిస్తున్న  83 ఏళ్ళ  ఈ మహానీయుడు  నిండు నూరేళ్ళు జీవించి  రైతులకోసం ఇంకా ఎంతో  మేలు చెయ్యగలరని ఆశిస్తూ  వారికి  ఆయురారోగ్యాన్ని  ప్రసాదించవలసిందిగా  భగవంతుడిని కోరదాం ,   ఫోటో లో కుడిపక్కన ఉన్న పద్మశ్రీ  నరసింహ రాజు యాదవ్ గారు ఆదర్శ రైతుగా  సైనికుడి గా కళాకారుడిగా ఎన్నో ఉన్నత  శిఖరాలను  అధిరోహించి  పద్మశ్రీ అవార్డు  పొంది  రైతు లోకానికే ఆదర్శ మూర్తి 


అమరులైన  కొల్లూరి  కోటేశ్వరరావు గారు శ్రద్దాంజలి  సమావేశం లో వారిని  గురించి  నాలుగు  మాటలు మాట్లాడ  మన్నప్పుడు , నాకు వారిని  గురించి చెప్పడానికి మాటలను వెతకాల్సిన స్తితి లో పడ్డాను  కారణం , అతి నిరు పేద రైతు కుటుంభంలో  జన్మించి ఎన్నో కష్ట నష్టాలకోర్చి  ఉన్నత విద్యనభ్యసించి  ఉపాధ్యాయ వృత్తి  లో ఉంటూ తన తోటి   ఉపాధ్యాయులందరి  సమస్యలను చట్ట సభలో  ప్రస్తావిస్తూ  వారి సమస్యల పరిష్కారానికి  షుమారు 17  సంవత్సరాల పాటు శాసన మండలి సభ్యుడిగా  శ్రమించారు
ఉపాధ్యాయుడిగా  తరగతి గదిలో  బోదించడం  కాకుండా  తెలుగు విద్యార్ధి  పత్రికను స్థాపించి  యావద్  విద్యార్తి లోకాన్నే కాకుండా  తెలుగు భాషాభిమానులందరికి  కర దీపికగా  వెలుగుతున్న  పత్రికను  నిరంతరాయంగా  యాభై సంవత్సరాల పైగా నడుపుతూ  తెలుగు విద్యార్ధి  లోకానికి ఎంతో నిస్వార్ధ సేవ చేసిన  మహోన్నత వ్యక్తీ  ని  నా చిన్నతనం నుండి  అతి దగ్గరగా చూసి  ఆయనను  ఆదర్శంగా తీసుకుని    వారిలాగానే  పేదరికం పై  అజ్జ్ఞానం  పై  పోరాటం నేర్చుకుని  పుట్టిన గ్రామాన్ని  వదిలి  ఎంతో దూరం వచ్చినా  నాకు  వారు భౌతికంగా లేకపోయినా  వారి జీవిత చరిత్ర , సమస్యలతో పోరాట పటిమ నాకెప్పటికీ  చిర స్మరనణియమే

No comments:

Post a Comment