ఆశా నిరాశల మధ్య రైతులు ...
ఇటివల నేను పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు
ప్రకాశం , నెల్లూరు , చిత్తూరు
కడప కర్నూలు జిల్లాలలో
అనేక మంది రైతులను కలిసి
వారితో వారి అనుభవాలను పంచుకున్నప్పుడు ఆశా వాదులైన
రైతులు వ్యవసాయం లో వారు చేపట్టిన
అనేక నూతన విధానాలు లాభసాటి
వ్యవసాయం గూర్చి తెలియజేస్తూ
వరి సాగు లో నాటు వేసే పద్దతిని
వదిలి నేరుగా వెదజల్లటం మొదలైన పద్దతులు పాటిస్తూ కర్చు
తగ్గించుకున్న విధానాన్ని తెలియజేసారు
, అయెతే వర్షాలు లేకపోవటం
కాలవుల ద్వారా నీరు లేటు గా
అందటం మొదలైన విషయాలపై చర్చించి
వరిలో తక్కువ కాల పరిమితి గల రకాలను సాగు జేసినందున నికరాదాయాన్ని పెంచే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చర్చించటం
జరిగింది.
కొన్ని ప్రాంతాలలో భూములు చదునుగా లేకపోవడం
నీరు సరిగా నిలవకపోవటం కులుపు సమస్య,
అధిక ఎరువుల వినియోగం, చివరి వరకు కాంప్లెక్స్ ఎరువుల వినియోగం
మొదలైన విషయాలు తెలియజేస్తూ
ఎకరానికి ఇరవై నుండి ఇరవై రెండు వేలు కర్చు పెట్టి సగటున
25 బస్తాలు BPT పండించినట్లు చెప్తూ కొన్ని చోట్ల గ్రామస్తులు
తెలియజేయ్యగా నాకు చాలా ఆశ్చర్యం
కలిగింది , లేసర్ లేవేలేర్ తో వరి పొలాలను ఒక సెంటీమీటర్ కూడా వ్యత్యాసం లేకుండా
లెవెల్ చేసుకునే అవకాశం గురించి
వారికి చెప్తే ఇంతవరకు దానిగురించి
తెలియదు అని వారు చెప్పారు , అక్కడ
కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చుకోవాలో అనే విషయాన్నీ గురించి
చర్చించటం జరిగింది ,
అలాగే
నెల్లూరు జిల్లా కనిగిరి లో యెర్ర భూములలో జిగురు గోరుచిక్కుడు సాగును
గురించి వివరించి మార్కెట్ సమస్య లేదని
చెప్పినప్పుడు , బ్యాంకు ద్వారా లోన్
పొంది స్వంత ట్రాక్టర్ కలిగిన రైతులు
కనీసం మా ట్రాక్టర్ కిరాయిలు
మిగిలినా చాలు , అతి తక్కువ కౌలు తో భూములు తీసుకుని దాదాపు
రెండు మూడు వేల ఎకరాలలో జిగురు
గోరుచిక్కుడు సాగు చెయ్యడానికి ముందుకు
వచ్చారు
చిత్తూరు
జిల్లా పీలేరు గ్రామం లో వ్యవసాయ శాస్త్రవేత్తలు “ఆత్మ” అధికారులు ఆదర్శ రైతులతో సమావేశం జరిగినప్పుడు అనేక
కొత్త విషయాలు చర్చకు రావడం
జరిగింది , అన్నపూర్ణ అనే పేరుతొ ఒక అర ఎకరం లోనే రకరకాల కూరగాయ పంటలను
డ్రిప్ ద్వారా పండిస్తున్న రైతు
ప్రయోగం చాలా హర్షేనియం
ఎరువుల
వినియోగాన్ని తగ్గించి జీవామృతం ద్వారా రకరకాల పండ్ల చెట్టులను పండిస్తున్న రైతు , వారి పంట ను
అధిక ధరలకు వినియోగదారులే
తోటవద్దకు వచ్చి కొనుక్కుని
వెళ్తున్నారు .
ఆ ప్రాంతం లో
వరిసాగు తక్కువైనా సేంద్రియ పద్దతులలో
వరిని పండించి BPT , బస్తా వడ్లు
2500 రూపాయలకు అమ్ముతున్న
రైతులను కూడా కలవటం జరిగింది , డ్రిప్ పద్దతిలో వరి పండించే
ఆలోచన ఉన్నట్లు రైతులు తెలియజేసినప్పుడు చాలా
ఆనందం కలిగింది
అయిదు ఎకరాలలో పూల సాగు చేపట్టి ద్రిప్పు , ముల్చింగ్ విధానం లో బంతి , చామంతి , గులాబి పక్కపక్కనే సాగు చేస్తూ అతి తక్కువ రోజుల్లో వచ్చేది , తక్కువ రోజుల్లో వచ్చేది , దీర్ఘ కాలం ఉండేది
, ఈ మూడు రకాలను ఒక దాని పక్కన ఒకటి సాగు చేస్తూ నూతన
విధానాలను ఆవిష్కరిస్తున్న ఈ రైతు శాస్త్రవేత్తల కృషి అభినందనీయం.
చిత్తూరు జిల్లలో
వ్యవసాయ శాస్త్రవేత్తలు extension
అధికారులు చాలా చొరవుగా నిరంతరం రైతులను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా
కొత్త విధానాలు చేపట్టిన రైతుల
వివరాలు తెలుసుకుని మిగిలిన రైతులకు
ఆ విషయాలను తెలియజేయ్యటం లో చొరవ
చూపిస్తున్న రైతు శ్రీ అబ్బయ్య నాయుడు , “ఆత్మ
“ ఆఫీసుర్లు శ్రీమతి జ్యోత్స్న శ్రీ
శ్రీధర, AO శన్ముఖం గారు , ADA శ్రీ రమణరావు
గారు కృషి అభినందనీయం