Saturday, 3 October 2015

ప్రియమైన రైతు సోదరులకు

ప్రియమైన  రైతు సోదరులకు 
కని  విని ఎరుగని  అనావ్రిష్టి అతివ్రిష్టి  నేపధ్యం లో  24 .9 .2015  తారికున  ఢిల్లీ  లోని IARI భారతీయ వ్యవసాయ పరిశోదనా సంస్థ  వారి  ఆధ్వర్యం లో  జరిగిన  సమావేశంలో  ప్రస్తుత  వాతావరణ  పరిస్తితులు , ప్రపంచదేశాల ఆర్ధిక  పరిస్తితుల పై  చర్చిస్తూ రాబోయే సంవత్సరంలో  రైతులు  ఎదుర్కోవలసిన  అనేక సవాళ్ళను గురించి  చర్చిస్తూ గతంలో ఎన్నడు లేని విధంగా   జలాశాయాలలో  నీరు  నిలువ తగ్గిపోవడం , భూగర్భ జలాల  మట్టం కూడా అడుగంటిన  నేపధ్యంలో  వ్యవసాయ ఆధారిత  పరిశ్రమలు  వ్యవసాయం తద్వారా  ఉత్పన్నమయ్యే  ఆర్ధిక  పరిణామాలను ఎదుర్కొనే విధంగా  రైతులను  చైతన్యపర్చవల్సిందిగా నాటి సమావేశంలో  పాల్గొన్న  వివిధ రాష్ట్రాల ఆదర్శ  రైతులకు   చెప్పడం జరిగింది , ప్రస్తుత  గడ్డు పరిస్తితులలో  వరి సాగును తగ్గించి  దేశం ఎదుర్కొంటున్న  దిగుమతుల సమస్యను అధిగమించడానికి  పప్పు గింజలు , నునే గింజలు  ప్రోత్సహించాలిసిందిగా  తెలియజేస్తూ 
అతితక్కువ సమయంలో అతి ఎక్కువ దిగుబడిని  ఇవ్వగలిగిన  కంది , పెసర  మరియు  మినుము క్షేత్రాలను కూడా  చూపించడం జరిగింది , రైతు సోదరులు  వ్యవసాయాన్ని  పరిశ్రమల లాగా వాణిజ్య  సరళి లో  అనగా  తక్కువ నీరు , తక్కువ కర్చు  ఎక్కువ ఆదాయాన్ని  గడించే విధంగా  సాగు పద్దతులను  ఆధునిక పద్దతులను ఉపయోగించి పండించవల్సిందిగా  తెలియజేసారు , దూరదర్శన్  ద్వారా  ప్రసారమయ్యే  కృషి దర్శన్ కార్యక్రమాలను కూడా  రోజు చూస్తూ సాటి రైతులను  చైతన్యపరచవలసిందిగా తెలియచేసారు .

No comments:

Post a Comment