Saturday, 24 October 2015

25.10.2015 వర్షాభావ పరిస్తితులు పంటల రక్షణ , తీసుకోవాల్సిన జాగ్రత్తలు



రైతు సోదరులారా
ఆంధ్రా  తెలంగాణా , కర్ణాటక రాష్ట్రాలలో  గత నెల రోజులనుండి  వర్షాలు లేక పైర్లన్ని  ఎండి పోతున్నాయి , చాలా మంది రైతు సోదరులు ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అని అడుగుతున్నారు , ప్రస్తుత పరిస్తితులలో రైతు సోదరులు  చేపట్టవలిసింది పైరును రక్షించాలి అంటే , ఉన్న పైరును పలచన చెయ్యటం , అంటే మొక్కల సాంద్రత ను తగ్గించాలి , మెట్ట భూములలో పై పాటు చెయ్యడం , భూమిలో ఉన్న తేమను ఆరనియ్యకుండా చెయ్యటం , ఆకుల ద్వారా పోషక పదార్తలను  అందించడం (spray  చెయ్యడం ద్వారా ) , అలాగే మాగాణి భూములలో  బోర్ల కింద  భావుల కింద  నాట్లు  వేసిన రైతులు   తాము వేసిన విస్తీర్ణం లో ప్రస్తుతం ఎంతవరకు నీరు అందితే  అంతవరకే పైరును  బ్రతికించుకోవడం

ఉత్తర తెలంగాణా ప్రాంతంలో  ఉష్ణోగ్రత  తక్కువ ఉంటుంది కనుక  కేవలం రెండు  మూడు తడులతోనే చేతికి  వచ్చే గోధుమ పంట వేసుకోవచ్చు , అలాగే ఆవాలు వేసుకోవచ్చు , ఎట్టి పరిస్తితులలోను  వరి పంట పై  పెట్టుబడి పెట్టి   నష్టపోవద్దు , భూగర్భ జలాలు  కూడా తగ్గినట్టు  తెలుస్తుంది , కనుక అతి తక్కువ నీటితో , తక్కువ సమయంలో పండే పెసర, మినుము , గోధుమ , ఆవాలు , కుసుమ  లాంటి పంటలను లేదా పశువుల మేతకు పనికి వచ్చే పైర్లను   వేసుకోవాలి, పెట్టుబడి బాగా తక్కువతో  పండే పంటలను మాత్రమె సాగు చెయ్యాలి , అధిక పెట్టుబడులతో  పండించే  వాణిజ్య పంటలు పండించి  నష్టపోతున్న  రైతు సోదరులు మరోసారి అలోచించి పంటల సాగు చేపట్టాలి

గత అరవై  సంవత్సరాలనుండి  హరిత విప్లవం పేరుతొ  మనం పండించిన పంటలు దేశ అవసరాలను తీర్చటమైతే  జరిగింది కాని  మన  భూములు మన బ్రతుకులు  నిస్సారమై  సహాయం కోసం అప్పుల కోసం అర్రులు చాచే దురదృష్టమైన దుర్భర  దారిద్రియం తో ఆత్మహత్యల వైపు  నెట్టబడ్డారు , ఇకనైనా మన భూములు మన జీవితాలు పరియావరణం ప్రజల ఆరోగ్యాలు  కాపాడుకోవాలి అంటే  కృత్రిమ ఎరువులు పురుగు మందులు అత్యాశలు  చూపే పంటల వైపు  కాకుండా  సేంద్రియ వ్యవసాయంతో  మన పూర్వికులు  చేసిన పద్దతులలో  వ్యవసాయం చేసి అప్పులు లేని  జీవితాన్ని  సాగిద్దాం, సాటి కష్టాలలో ఉన్న రైతు సోదరులకు  ధైర్యాన్ని  స్థైర్యాన్ని  నిమ్పవలిసిందిగా కోరుతున్నాను  

No comments:

Post a Comment