Friday, 30 October 2015
Saturday, 24 October 2015
25.10.2015 వర్షాభావ పరిస్తితులు పంటల రక్షణ , తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రైతు సోదరులారా
ఆంధ్రా తెలంగాణా , కర్ణాటక రాష్ట్రాలలో గత నెల రోజులనుండి వర్షాలు లేక పైర్లన్ని ఎండి పోతున్నాయి , చాలా మంది రైతు సోదరులు
ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అని అడుగుతున్నారు , ప్రస్తుత పరిస్తితులలో రైతు
సోదరులు చేపట్టవలిసింది పైరును రక్షించాలి
అంటే , ఉన్న పైరును పలచన చెయ్యటం , అంటే మొక్కల సాంద్రత ను తగ్గించాలి , మెట్ట భూములలో
పై పాటు చెయ్యడం , భూమిలో ఉన్న తేమను ఆరనియ్యకుండా చెయ్యటం , ఆకుల ద్వారా పోషక
పదార్తలను అందించడం (spray చెయ్యడం ద్వారా ) , అలాగే మాగాణి భూములలో బోర్ల కింద
భావుల కింద నాట్లు వేసిన రైతులు
తాము వేసిన విస్తీర్ణం లో ప్రస్తుతం ఎంతవరకు నీరు అందితే అంతవరకే పైరును బ్రతికించుకోవడం
ఉత్తర తెలంగాణా
ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది కనుక కేవలం రెండు
మూడు తడులతోనే చేతికి వచ్చే గోధుమ
పంట వేసుకోవచ్చు , అలాగే ఆవాలు వేసుకోవచ్చు , ఎట్టి పరిస్తితులలోను వరి పంట పై
పెట్టుబడి పెట్టి నష్టపోవద్దు ,
భూగర్భ జలాలు కూడా తగ్గినట్టు తెలుస్తుంది , కనుక అతి తక్కువ నీటితో , తక్కువ
సమయంలో పండే పెసర, మినుము , గోధుమ , ఆవాలు , కుసుమ లాంటి పంటలను లేదా పశువుల మేతకు పనికి వచ్చే
పైర్లను వేసుకోవాలి, పెట్టుబడి బాగా
తక్కువతో పండే పంటలను మాత్రమె సాగు
చెయ్యాలి , అధిక పెట్టుబడులతో
పండించే వాణిజ్య పంటలు పండించి నష్టపోతున్న
రైతు సోదరులు మరోసారి అలోచించి పంటల సాగు చేపట్టాలి
గత అరవై సంవత్సరాలనుండి హరిత విప్లవం పేరుతొ మనం పండించిన పంటలు దేశ అవసరాలను
తీర్చటమైతే జరిగింది కాని మన
భూములు మన బ్రతుకులు
నిస్సారమై సహాయం కోసం అప్పుల కోసం
అర్రులు చాచే దురదృష్టమైన దుర్భర
దారిద్రియం తో ఆత్మహత్యల వైపు
నెట్టబడ్డారు , ఇకనైనా మన భూములు మన జీవితాలు పరియావరణం ప్రజల
ఆరోగ్యాలు కాపాడుకోవాలి అంటే కృత్రిమ ఎరువులు పురుగు మందులు అత్యాశలు చూపే పంటల వైపు
కాకుండా సేంద్రియ వ్యవసాయంతో మన పూర్వికులు
చేసిన పద్దతులలో వ్యవసాయం చేసి
అప్పులు లేని జీవితాన్ని సాగిద్దాం, సాటి కష్టాలలో ఉన్న రైతు
సోదరులకు ధైర్యాన్ని స్థైర్యాన్ని
నిమ్పవలిసిందిగా కోరుతున్నాను
Wednesday, 21 October 2015
Alternative crops , survival of farmer
With Increase In Diabetes irrespective of age , Rice consumption is
coming down drastically, and people are shifting to alternative food
stuffs which were used extensively a few decades back , and farmers also
should change according to the changing food habits of people, also
since paddy is a High water consuming crop, It should not be cultivated
in Bore-well Irrigated soils , as there will be severe scarcity of
electricity in the coming summer, hence it is very much advisable for
farmers to take up cultivation of alternative crops which require very
less water and give good returns to farmers , as per your soil type and
water availability
Thanks to the central government for Including pulses and oil seeds in
the list of procurement Items for Food corporation Of India , apart
from wheat and Rice , therefore farmers can grow pulses and oil seeds
which the central govt agency will buy at the Minimum support price
specified by the govt, hence farmers will not Incur Heavy losses as they
incurred in the previous years, due to which now there is a severe
shortage of pulses and oil seeds.
alternative profitable crops for paddy , వరికి బదులుగా తక్కువ నీటితో అధిక ఆదాయం వస్తున్న పంటలు
![]() |
| బిందు సేద్యం తో ఆలుగడ్డ సాగు , చిక్క బళ్ళాపూర్ కర్ణాటక ( బెంగలూరు కు దగ్గరలో ) |
![]() |
| రాగి పంట తో అదిక లాభాలు పొందుతున్న రైతులు , చిక్క బళ్ళాపూర్ కర్ణాటక ( బెంగలూరు కు దగ్గరలో ) |
![]() |
| కొర్రల పంట , అనంతపురం రెడ్డిపల్లి KVK లో |
![]() |
| కొర్రల పంట , అనంతపురం రెడ్డిపల్లి KVK లో శాస్త్రవేత్తలతో |
![]() |
| వేరుసెనగ పంట , అనంతపురం రెడ్డిపల్లి KVK లో శాస్త్రవేత్తలతో |
![]() |
| సజ్జ పంట , అనంతపురం రెడ్డిపల్లి KVK లో |
![]() |
| కినోవా పంట |
Saturday, 10 October 2015
పంజాబ్ ప్రభుత్వం సబ్సిడీ ధరలకు రైతులకు సప్లై చేసిన కల్తి పురుగుమందుల వల్ల , పత్తి పంట పై ఆశించిన తెల్ల దోమ కంట్రోల్ కాక పూర్తిగా పత్తి పంట నష్టపోయి ఆత్మహత్యల తో పాటు రోడ్ ఎక్కిన రైతులు.
పంజాబ్ వ్యవసాయ డైరెక్టర్ ని అరెస్ట్ చేసి , ఆదాయపు పన్ను శాఖ వారు దాడి జరిపారు , ఎకరాకు నలభై వేల రూపాయల నష్టపరిహారం అడుగుతున్న రైతులు , చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
పంజాబ్ వ్యవసాయ డైరెక్టర్ ని అరెస్ట్ చేసి , ఆదాయపు పన్ను శాఖ వారు దాడి జరిపారు , ఎకరాకు నలభై వేల రూపాయల నష్టపరిహారం అడుగుతున్న రైతులు , చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
Sunday, 4 October 2015
సన్న ధాన్యానికి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది ,
సెప్టెంబర్ నేలాఖరకు 50 % మాత్రమే వరి నాట్లు వెయ్యటం జరిగింది , అందులో సన్నరకాల సాగు గణనీయంగా తగ్గినట్లు తెలుస్తుంది , సోనా లాంటి రకాలకు మంచి ధర వచ్చే అవకాశం ఉన్నందున , రైతు సోదరులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అవసరాలకు అనుగుణంగా దఫా దఫాలుగా అమ్ముకున్నందున మంచి ధరను పొందగలరు
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో బాసుమతి పండించిన రైతులు ప్రస్తుతం ధర లేనందున మీ సమీప మార్కెట్ యార్డ్ గోదాములలో మీ సరుకు పెట్టుకుని బస్తాకు వెయ్య రూపాయాల దాకా ఆరు నెలల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్టు తెలుస్తుంది , మీ సమీప వ్యవసాయ మార్కెట్లలో సంప్రదించి ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకుంటే రాబోయే మార్చ్ నాటికి బాసుమతి ధాన్యాలకి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే జిగురుగోరుచిక్కుడు రైతులు
సెప్టెంబర్ నేలాఖరకు 50 % మాత్రమే వరి నాట్లు వెయ్యటం జరిగింది , అందులో సన్నరకాల సాగు గణనీయంగా తగ్గినట్లు తెలుస్తుంది , సోనా లాంటి రకాలకు మంచి ధర వచ్చే అవకాశం ఉన్నందున , రైతు సోదరులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అవసరాలకు అనుగుణంగా దఫా దఫాలుగా అమ్ముకున్నందున మంచి ధరను పొందగలరు
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో బాసుమతి పండించిన రైతులు ప్రస్తుతం ధర లేనందున మీ సమీప మార్కెట్ యార్డ్ గోదాములలో మీ సరుకు పెట్టుకుని బస్తాకు వెయ్య రూపాయాల దాకా ఆరు నెలల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్టు తెలుస్తుంది , మీ సమీప వ్యవసాయ మార్కెట్లలో సంప్రదించి ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకుంటే రాబోయే మార్చ్ నాటికి బాసుమతి ధాన్యాలకి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే జిగురుగోరుచిక్కుడు రైతులు
Saturday, 3 October 2015
ప్రియమైన రైతు సోదరులకు
ప్రియమైన రైతు సోదరులకు
కని విని ఎరుగని అనావ్రిష్టి అతివ్రిష్టి నేపధ్యం లో 24 .9 .2015 తారికున ఢిల్లీ లోని IARI భారతీయ వ్యవసాయ పరిశోదనా సంస్థ వారి ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో ప్రస్తుత వాతావరణ పరిస్తితులు , ప్రపంచదేశాల ఆర్ధిక పరిస్తితుల పై చర్చిస్తూ రాబోయే సంవత్సరంలో రైతులు ఎదుర్కోవలసిన అనేక సవాళ్ళను గురించి చర్చిస్తూ గతంలో ఎన్నడు లేని విధంగా జలాశాయాలలో నీరు నిలువ తగ్గిపోవడం , భూగర్భ జలాల మట్టం కూడా అడుగంటిన నేపధ్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయం తద్వారా ఉత్పన్నమయ్యే ఆర్ధిక పరిణామాలను ఎదుర్కొనే విధంగా రైతులను చైతన్యపర్చవల్సిందిగా నాటి సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ఆదర్శ రైతులకు చెప్పడం జరిగింది , ప్రస్తుత గడ్డు పరిస్తితులలో వరి సాగును తగ్గించి దేశం ఎదుర్కొంటున్న దిగుమతుల సమస్యను అధిగమించడానికి పప్పు గింజలు , నునే గింజలు ప్రోత్సహించాలిసిందిగా తెలియజేస్తూ
అతితక్కువ సమయంలో అతి ఎక్కువ దిగుబడిని ఇవ్వగలిగిన కంది , పెసర మరియు మినుము క్షేత్రాలను కూడా చూపించడం జరిగింది , రైతు సోదరులు వ్యవసాయాన్ని పరిశ్రమల లాగా వాణిజ్య సరళి లో అనగా తక్కువ నీరు , తక్కువ కర్చు ఎక్కువ ఆదాయాన్ని గడించే విధంగా సాగు పద్దతులను ఆధునిక పద్దతులను ఉపయోగించి పండించవల్సిందిగా తెలియజేసారు , దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యే కృషి దర్శన్ కార్యక్రమాలను కూడా రోజు చూస్తూ సాటి రైతులను చైతన్యపరచవలసిందిగా తెలియచేసారు .
Subscribe to:
Comments (Atom)













