Thursday, 26 November 2015
Basmati price rise
ఇరాన్ దేశం బాసుమతి దిగుమతుల మీద పెట్టిన నిషేదాన్ని ఎత్తివేసిన నేపధ్యం లో దేశీయ మార్కెట్ లో బాసుమతి ధాన్యం ధరలు ఒక 20 రోజుల కింద ఉన్నధరలతో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యాయి ..
ఇప్పటికే చాలా మంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా లో ఉన్న రైతు సోదరులు తమ వద్ద ఉన్న బాసుమతి ధాన్యాన్ని అతితక్కువ ధరలకు అమ్ముకున్నారు , ఇంకా ధాన్యంనిలువ ఉన్న రైతులు ధరలను తెలుసుకుని తగిన విధంగా అమ్ముకోగలరు
ఇట్లు
మీ
కే వి కృష్ణా రావు
రాయచూరు , కర్ణాటక
26 నవంబర్2015
The price of popular basmati variety PUSA 1121 has risen to Rs 3,100 per quintal as opposed to Rs 1,300 early this month. The price of 1509 variety also jumped to Rs 1,800 a quintal. “What good is the price rise now when more than 90% farmers have disposed of their crop. They do not have the capacity to store it for selling it when the price is better,” said Kokri. The BKU (Ugrahan) demands Rs 4,500 per quintal rate for basmati 1509 and Rs 5,000 per quintal for PUSA 1121...... source HINDUSTAN TIMES
ఇప్పటికే చాలా మంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా లో ఉన్న రైతు సోదరులు తమ వద్ద ఉన్న బాసుమతి ధాన్యాన్ని అతితక్కువ ధరలకు అమ్ముకున్నారు , ఇంకా ధాన్యంనిలువ ఉన్న రైతులు ధరలను తెలుసుకుని తగిన విధంగా అమ్ముకోగలరు
ఇట్లు
మీ
కే వి కృష్ణా రావు
రాయచూరు , కర్ణాటక
26 నవంబర్2015
The price of popular basmati variety PUSA 1121 has risen to Rs 3,100 per quintal as opposed to Rs 1,300 early this month. The price of 1509 variety also jumped to Rs 1,800 a quintal. “What good is the price rise now when more than 90% farmers have disposed of their crop. They do not have the capacity to store it for selling it when the price is better,” said Kokri. The BKU (Ugrahan) demands Rs 4,500 per quintal rate for basmati 1509 and Rs 5,000 per quintal for PUSA 1121...... source HINDUSTAN TIMES
Friday, 30 October 2015
Saturday, 24 October 2015
25.10.2015 వర్షాభావ పరిస్తితులు పంటల రక్షణ , తీసుకోవాల్సిన జాగ్రత్తలు
రైతు సోదరులారా
ఆంధ్రా తెలంగాణా , కర్ణాటక రాష్ట్రాలలో గత నెల రోజులనుండి వర్షాలు లేక పైర్లన్ని ఎండి పోతున్నాయి , చాలా మంది రైతు సోదరులు
ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా అని అడుగుతున్నారు , ప్రస్తుత పరిస్తితులలో రైతు
సోదరులు చేపట్టవలిసింది పైరును రక్షించాలి
అంటే , ఉన్న పైరును పలచన చెయ్యటం , అంటే మొక్కల సాంద్రత ను తగ్గించాలి , మెట్ట భూములలో
పై పాటు చెయ్యడం , భూమిలో ఉన్న తేమను ఆరనియ్యకుండా చెయ్యటం , ఆకుల ద్వారా పోషక
పదార్తలను అందించడం (spray చెయ్యడం ద్వారా ) , అలాగే మాగాణి భూములలో బోర్ల కింద
భావుల కింద నాట్లు వేసిన రైతులు
తాము వేసిన విస్తీర్ణం లో ప్రస్తుతం ఎంతవరకు నీరు అందితే అంతవరకే పైరును బ్రతికించుకోవడం
ఉత్తర తెలంగాణా
ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది కనుక కేవలం రెండు
మూడు తడులతోనే చేతికి వచ్చే గోధుమ
పంట వేసుకోవచ్చు , అలాగే ఆవాలు వేసుకోవచ్చు , ఎట్టి పరిస్తితులలోను వరి పంట పై
పెట్టుబడి పెట్టి నష్టపోవద్దు ,
భూగర్భ జలాలు కూడా తగ్గినట్టు తెలుస్తుంది , కనుక అతి తక్కువ నీటితో , తక్కువ
సమయంలో పండే పెసర, మినుము , గోధుమ , ఆవాలు , కుసుమ లాంటి పంటలను లేదా పశువుల మేతకు పనికి వచ్చే
పైర్లను వేసుకోవాలి, పెట్టుబడి బాగా
తక్కువతో పండే పంటలను మాత్రమె సాగు
చెయ్యాలి , అధిక పెట్టుబడులతో
పండించే వాణిజ్య పంటలు పండించి నష్టపోతున్న
రైతు సోదరులు మరోసారి అలోచించి పంటల సాగు చేపట్టాలి
గత అరవై సంవత్సరాలనుండి హరిత విప్లవం పేరుతొ మనం పండించిన పంటలు దేశ అవసరాలను
తీర్చటమైతే జరిగింది కాని మన
భూములు మన బ్రతుకులు
నిస్సారమై సహాయం కోసం అప్పుల కోసం
అర్రులు చాచే దురదృష్టమైన దుర్భర
దారిద్రియం తో ఆత్మహత్యల వైపు
నెట్టబడ్డారు , ఇకనైనా మన భూములు మన జీవితాలు పరియావరణం ప్రజల
ఆరోగ్యాలు కాపాడుకోవాలి అంటే కృత్రిమ ఎరువులు పురుగు మందులు అత్యాశలు చూపే పంటల వైపు
కాకుండా సేంద్రియ వ్యవసాయంతో మన పూర్వికులు
చేసిన పద్దతులలో వ్యవసాయం చేసి
అప్పులు లేని జీవితాన్ని సాగిద్దాం, సాటి కష్టాలలో ఉన్న రైతు
సోదరులకు ధైర్యాన్ని స్థైర్యాన్ని
నిమ్పవలిసిందిగా కోరుతున్నాను
Wednesday, 21 October 2015
Alternative crops , survival of farmer
With Increase In Diabetes irrespective of age , Rice consumption is
coming down drastically, and people are shifting to alternative food
stuffs which were used extensively a few decades back , and farmers also
should change according to the changing food habits of people, also
since paddy is a High water consuming crop, It should not be cultivated
in Bore-well Irrigated soils , as there will be severe scarcity of
electricity in the coming summer, hence it is very much advisable for
farmers to take up cultivation of alternative crops which require very
less water and give good returns to farmers , as per your soil type and
water availability
Thanks to the central government for Including pulses and oil seeds in
the list of procurement Items for Food corporation Of India , apart
from wheat and Rice , therefore farmers can grow pulses and oil seeds
which the central govt agency will buy at the Minimum support price
specified by the govt, hence farmers will not Incur Heavy losses as they
incurred in the previous years, due to which now there is a severe
shortage of pulses and oil seeds.
alternative profitable crops for paddy , వరికి బదులుగా తక్కువ నీటితో అధిక ఆదాయం వస్తున్న పంటలు
![]() |
| బిందు సేద్యం తో ఆలుగడ్డ సాగు , చిక్క బళ్ళాపూర్ కర్ణాటక ( బెంగలూరు కు దగ్గరలో ) |
![]() |
| రాగి పంట తో అదిక లాభాలు పొందుతున్న రైతులు , చిక్క బళ్ళాపూర్ కర్ణాటక ( బెంగలూరు కు దగ్గరలో ) |
![]() |
| కొర్రల పంట , అనంతపురం రెడ్డిపల్లి KVK లో |
![]() |
| కొర్రల పంట , అనంతపురం రెడ్డిపల్లి KVK లో శాస్త్రవేత్తలతో |
![]() |
| వేరుసెనగ పంట , అనంతపురం రెడ్డిపల్లి KVK లో శాస్త్రవేత్తలతో |
![]() |
| సజ్జ పంట , అనంతపురం రెడ్డిపల్లి KVK లో |
![]() |
| కినోవా పంట |
Saturday, 10 October 2015
పంజాబ్ ప్రభుత్వం సబ్సిడీ ధరలకు రైతులకు సప్లై చేసిన కల్తి పురుగుమందుల వల్ల , పత్తి పంట పై ఆశించిన తెల్ల దోమ కంట్రోల్ కాక పూర్తిగా పత్తి పంట నష్టపోయి ఆత్మహత్యల తో పాటు రోడ్ ఎక్కిన రైతులు.
పంజాబ్ వ్యవసాయ డైరెక్టర్ ని అరెస్ట్ చేసి , ఆదాయపు పన్ను శాఖ వారు దాడి జరిపారు , ఎకరాకు నలభై వేల రూపాయల నష్టపరిహారం అడుగుతున్న రైతులు , చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
పంజాబ్ వ్యవసాయ డైరెక్టర్ ని అరెస్ట్ చేసి , ఆదాయపు పన్ను శాఖ వారు దాడి జరిపారు , ఎకరాకు నలభై వేల రూపాయల నష్టపరిహారం అడుగుతున్న రైతులు , చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
Sunday, 4 October 2015
సన్న ధాన్యానికి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది ,
సెప్టెంబర్ నేలాఖరకు 50 % మాత్రమే వరి నాట్లు వెయ్యటం జరిగింది , అందులో సన్నరకాల సాగు గణనీయంగా తగ్గినట్లు తెలుస్తుంది , సోనా లాంటి రకాలకు మంచి ధర వచ్చే అవకాశం ఉన్నందున , రైతు సోదరులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అవసరాలకు అనుగుణంగా దఫా దఫాలుగా అమ్ముకున్నందున మంచి ధరను పొందగలరు
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో బాసుమతి పండించిన రైతులు ప్రస్తుతం ధర లేనందున మీ సమీప మార్కెట్ యార్డ్ గోదాములలో మీ సరుకు పెట్టుకుని బస్తాకు వెయ్య రూపాయాల దాకా ఆరు నెలల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్టు తెలుస్తుంది , మీ సమీప వ్యవసాయ మార్కెట్లలో సంప్రదించి ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకుంటే రాబోయే మార్చ్ నాటికి బాసుమతి ధాన్యాలకి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే జిగురుగోరుచిక్కుడు రైతులు
సెప్టెంబర్ నేలాఖరకు 50 % మాత్రమే వరి నాట్లు వెయ్యటం జరిగింది , అందులో సన్నరకాల సాగు గణనీయంగా తగ్గినట్లు తెలుస్తుంది , సోనా లాంటి రకాలకు మంచి ధర వచ్చే అవకాశం ఉన్నందున , రైతు సోదరులు తమ వద్ద ఉన్న ధాన్యాన్ని అవసరాలకు అనుగుణంగా దఫా దఫాలుగా అమ్ముకున్నందున మంచి ధరను పొందగలరు
ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో బాసుమతి పండించిన రైతులు ప్రస్తుతం ధర లేనందున మీ సమీప మార్కెట్ యార్డ్ గోదాములలో మీ సరుకు పెట్టుకుని బస్తాకు వెయ్య రూపాయాల దాకా ఆరు నెలల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నట్టు తెలుస్తుంది , మీ సమీప వ్యవసాయ మార్కెట్లలో సంప్రదించి ఈ అవకాశాన్ని రైతు సోదరులు వినియోగించుకుంటే రాబోయే మార్చ్ నాటికి బాసుమతి ధాన్యాలకి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే జిగురుగోరుచిక్కుడు రైతులు
Saturday, 3 October 2015
ప్రియమైన రైతు సోదరులకు
ప్రియమైన రైతు సోదరులకు
కని విని ఎరుగని అనావ్రిష్టి అతివ్రిష్టి నేపధ్యం లో 24 .9 .2015 తారికున ఢిల్లీ లోని IARI భారతీయ వ్యవసాయ పరిశోదనా సంస్థ వారి ఆధ్వర్యం లో జరిగిన సమావేశంలో ప్రస్తుత వాతావరణ పరిస్తితులు , ప్రపంచదేశాల ఆర్ధిక పరిస్తితుల పై చర్చిస్తూ రాబోయే సంవత్సరంలో రైతులు ఎదుర్కోవలసిన అనేక సవాళ్ళను గురించి చర్చిస్తూ గతంలో ఎన్నడు లేని విధంగా జలాశాయాలలో నీరు నిలువ తగ్గిపోవడం , భూగర్భ జలాల మట్టం కూడా అడుగంటిన నేపధ్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయం తద్వారా ఉత్పన్నమయ్యే ఆర్ధిక పరిణామాలను ఎదుర్కొనే విధంగా రైతులను చైతన్యపర్చవల్సిందిగా నాటి సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ఆదర్శ రైతులకు చెప్పడం జరిగింది , ప్రస్తుత గడ్డు పరిస్తితులలో వరి సాగును తగ్గించి దేశం ఎదుర్కొంటున్న దిగుమతుల సమస్యను అధిగమించడానికి పప్పు గింజలు , నునే గింజలు ప్రోత్సహించాలిసిందిగా తెలియజేస్తూ
అతితక్కువ సమయంలో అతి ఎక్కువ దిగుబడిని ఇవ్వగలిగిన కంది , పెసర మరియు మినుము క్షేత్రాలను కూడా చూపించడం జరిగింది , రైతు సోదరులు వ్యవసాయాన్ని పరిశ్రమల లాగా వాణిజ్య సరళి లో అనగా తక్కువ నీరు , తక్కువ కర్చు ఎక్కువ ఆదాయాన్ని గడించే విధంగా సాగు పద్దతులను ఆధునిక పద్దతులను ఉపయోగించి పండించవల్సిందిగా తెలియజేసారు , దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యే కృషి దర్శన్ కార్యక్రమాలను కూడా రోజు చూస్తూ సాటి రైతులను చైతన్యపరచవలసిందిగా తెలియచేసారు .
Wednesday, 30 September 2015
Thursday, 27 August 2015
మినుమల పంట లో అత్యదిక దిగుబడి సాదిస్తున్న రాయలసీమ రైతు శ్రీ పుల్లయ్య చౌదరి
మినుమల పంట లో అత్యదిక దిగుబడి సాదిస్తున్న రాయలసీమ రైతు శ్రీ పుల్లయ్య చౌదరి , గుంపర మానదిన్నె గ్రామం , నంద్యాల.
పంట , విత్తన , మరియు సాగు పద్దతులను తెలుసుకోవడానికి సంప్రదించగలరు
09502421116, 08466021355
: Wednesday, 26 August 2015
కరువు పరిస్తితుల నేపధ్యం లో ప్రత్యామ్నాయ పంటలు
దేశం లో చాలా ప్రాంతాలలో ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్తితుల నేపధ్యం లో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాసిన అవసరం ఉంది ....
జిగురు గోరు చిక్కుడు గింజల కు ప్రస్తుతం దానికి సహజ ధరల స్తితికి వచ్చి చేరాయి (క్వింటాల్ 2900 నుండి 3500 )
నంద్యాల ఆళ్లగడ్డ లో రైతులు తెల్లజోన్న బాగా విరివిగా పండిస్తున్నారు , ముఖ్యంగా రెండూ varieties
మహింద్రా మరియు మిల్కీ white
వరికి నీరు అందని పరిస్తితులలో గట్లను నరికి , rotovator తో నేలను తయారు చేసి ఇటువంటి తక్కువ నీరు అవసరం అయ్యే పంటలు వేస్తె రైతులకు ఉన్నంత లో మేలు .
జిగురు గోరు చిక్కుడు గింజల కు ప్రస్తుతం దానికి సహజ ధరల స్తితికి వచ్చి చేరాయి (క్వింటాల్ 2900 నుండి 3500 )
నంద్యాల ఆళ్లగడ్డ లో రైతులు తెల్లజోన్న బాగా విరివిగా పండిస్తున్నారు , ముఖ్యంగా రెండూ varieties
మహింద్రా మరియు మిల్కీ white
వరికి నీరు అందని పరిస్తితులలో గట్లను నరికి , rotovator తో నేలను తయారు చేసి ఇటువంటి తక్కువ నీరు అవసరం అయ్యే పంటలు వేస్తె రైతులకు ఉన్నంత లో మేలు .
Thursday, 13 August 2015
రైతు సోదరులారా
రైతు సోదరులారా
దక్షిణ భారత దేశం , మహారాష్ట్ర లో విదర్భ అనావ్రిష్టి తో రైతు సోదరులంతా దిక్కు తోచని పరిస్తితిలో ఉన్నారు , కొన్ని ప్రాంతాలలో రైతులు ఆత్మ హత్యలు కూడా చేసుకుంటున్నారు , ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని , ధైర్యంగా ఉండాలని నాయకులంతా చెప్తూ ఉంటారు , కరువు కష్టాలు , అప్పుల బాధలు , ఇవన్ని ఒక్కసారిగా చుట్టుముడితే ఆ వ్యక్తీమనో స్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య వైపు మళ్లుతారు ..వీటిని నివారించటానికి ప్రభుత్వాలు నాయకులు , అధికారులు ఆత్మహత్యకు ముందుగా ప్రయత్నం చెయ్యడం సాధ్యపడదు , దిన్ని నివారించాలి అంటే చుట్టుపక్కల ఉన్న మిత్రులు , భందువులు వీరే నివారించగలరు అప్పు చెయ్యడం తప్పని పరిస్తుతలోకి కి భారత దేశ రైతు నెట్టబడ్డాడు , కరువులు , సమస్యలు , బాధలు ఇవే రైతు కు పర్యాయ పదం , మన తాత ముతాతలనుంచి ఇలాంటి ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని భవిష్యత్తు పైన ఆశతో ముందుకు నడిచారు , వారి వారసులమైన మనం అదే ధైర్యంతో ముందుకు నడుస్తూ మన పిల్లలను వ్యవసాయ రంగం నుండి వేరే రంగాల వైపు మళ్ళించి వారి జీవితాలైనా బాగు పడాలంటే మనం ధైర్యంగా నిలబడక తప్పని పరిస్తితులలో ఉన్నాం , ఇప్పటికే ఎంతో మంది రైతులు తరతరాలుగా వస్తున్న వారి వృత్తిని వదిలి , ఆస్తులను అమ్మి వారి పిల్లలను విద్యావంతులను చేసారు , వేరే రంగాల వైపు మళ్ళిస్తున్నారు , వారంతా ఉన్నంతలో బాగా బ్రతుకుతున్నారు .
దేశ సంపదలో నూటికి 20 శాతమే వస్తున్న వ్యవసాయ రంగం పైన ఆధారపడిన ప్రజలు 70 శాతం ఉండటంతో ఈ రంగానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం ఆసాధ్యం అవుతుంది , అంతేగాక 1994 లో అప్పటి ప్రధాని pv నరసింహారావు గారు ప్రపంచ వాణిజ్య మండలి లో భారత దేశాన్ని సభ్య దేశంగా మార్చడం , సరళీకృత ఆర్ధిక విధానాలవల్ల విలాస వస్తువుల దిగుమతులు పెరగటం ప్రజలంతా స్థోమత ఉన్నా లేకున్నా వాటి వైపు ఆకర్షితులవడం , ఆనాటి ఉమ్మడి కుటుంభ వ్యవస్థ పథనం కావడం , అనేక విషయాలలో నాటికి నేటికి వచ్చిన మార్పులో ఆత్మహత్యల వైపు మొగ్గుచూపడం ఎక్కువయ్యింది , ఇది పరిష్కారం కాదని అలాంటి వ్యక్తులను చుట్టూ సాటి వ్యక్తులు ధైర్యాన్ని చెప్పి ఆత్మహత్యలను నిరోధించడానికి ప్రయంతం చెయ్యాలి .
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి తక్కువగా ఉన్న పంటలకే ధరలు బాగా వస్తున్నాయి , పప్పులన్ని ధరలు పెరిగి కిలో వంద రూపాయలు పైనే ఉన్నాయి , మషాలా దినుసుల పంటలైన మిర్చి , పసుపు , జీలకర్ర , అల్లం వెల్లుల్లి మిరియాలు మొదలైన పంటల ఉత్పత్తులకు మంచి ధరలు ఉన్నాయి , అందుబాటులో ఉన్న సామాచార సాధనల ద్వారా వాతవరణ పరిస్తితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన పంటలను పండిస్తూ కర్చులను ఎంత సాధ్యపడితే అంత తగ్గించుకుంటు అప్పుల ఊబి నుంచి బైట పాడటానికి ప్రయత్నం చెయ్యవచ్చు
సెనగలు : 4500
మొక్కజొన్నలు : 13 నుండి 14 వందలు
ఆముదాలు :3500 నుండి 40 00
ఎండు మిర్చి 9500 నుండి 10 000
గోరుచిక్కుడు 25 00 నుండి ౩౦00
రానున్న season లో కేంద్ర ప్రభుత్వం FCI ద్వారా కొనుగోలు చెయ్యటాన్ని నిలిపివేసింది
Tuesday, 14 July 2015
Sunday, 14 June 2015
Jai Hind
మోడీ గారి
ఏడాది పాలన లో వారు
తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు
1)
ఇరుగు పొరుగు దేశాలతో
సత్సంబందాలు
2)
40 చట్టాల
సవరణ
3)
సామాన్య పౌరులకు 18
నుండి 70 సంవత్సరాల వయసు వరకు ప్రమాద భీమా సౌకర్యం కేవలం 12 రూపాయలకే ,
4)
౩౩౦ రూపాయలకు
సంవత్సరానికి జీవిత భీమా సౌకర్యం ,
5)
అటల్ pension యోజనా
6)
స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి బ్యాంకు మెట్లు ఎక్కని సాధారణ ప్రజలకు జన ధన్ యోజన ద్వారా కోట్లాది
జనంతో బ్యాంకు లో ఖాతాలు తెరిపించడం.
7)
బ్యాంకుల ద్వారా ఇచ్చే వ్యవసాయ రుణాలలో చిన్న సన్నకారు రైతులకు 8 % శాతం తప్పనిసరి చెయ్యడం
8)
కోట్లాది మంది
చిరు వ్యాపారులకు Micro Units Development and Refinance Agency ( MUDRA) ముద్రా
బ్యాంకు ఏర్పాటు చెయ్యడం
9)
ఆడపిల్లలను
రక్షించండి చదివించండి అనే నినాదం
10)
ఎన్నో సంవత్సరాల
నుండి అపరిష్కరితంగా ఉన్న భారత్
బంగ్లా సరిహద్దు సమస్యని
లోక్ సభ , రాజ్యసభల ఏకగ్రీవ ఆమోదంతో
పరిష్కరించడం
11)
రక్షణ వ్యవస్థ కు
Budget లో రెండు లక్షల అరవై వేల కోట్లు
కేటాయించి అత్యాధునిక సామగ్రిని
సమకూర్చుకుని , దేశ రక్షణ విషయం లో 125 కోట్ల జనం
నిశ్చింతగా ఉండేలా చెయ్యడం
12)
ప్రపంచం లో ఉన్న
అగ్ర రాజ్యాలతో పెట్టుబడులు వ్యాపారం
మొదలైన విషయాల పై సత్సంబందాలు పెంచడం
13)
సోదర సరిహద్దు
దేశమైన నేపాల్ లో జరిగిన భయంకర
ఆపత్తు సమయం లో కొద్ది గంటల
వ్యవధిలో స్పందించి సహాయ సహకారాలు అందించే
విషయం లో ప్రపంచ దేశాలకే మార్గదర్శకులు కావడం.
14)
ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదుల పై గంటల వ్యవధిలోనే ఉక్కుపాదం మోపడం
15)
వేలాది నిరర్ధక
NGO సంస్థల పై నిషేధం విధించడం.
16)
రైల్వే లను తాత్కాల టికెట్ రద్దులో టికెట్ డబ్బు సందర్భంలో డబ్బు
refund ఇవ్వటం , మొదలైన ఎన్నో
సాహసోపేతమైన నిర్ణయాలు
17)
June 21 న ఐక్య
రాజ్య సమితి ద్వారా ప్రపంచ యోగా
దినోత్సవం ప్రకటించడం
మతాలు ప్రాంతాలకు
అతీతంగా దేశం లో ఉన్న 125 కోట్ల మంది కి
ఉపయోగపడే విధంగా మీరు మీ మంత్రి వర్గం
తీసుకున్న నిర్ణయాలకు అభినందిస్తున్నాం, అయెతే దేశం మీ నుండి ఎంతో నిరిక్షిస్తుంది
గౌరవనీయులైన మోదిగారు ....భారత ప్రజలు మీ పై పెట్టుకున్న
ఆశలు
1.
రైతుల ఆర్ధిక స్తితిని మెరుగు పరచడం
2.
చట్టసభల అభ్యర్ధులకు
కనీస విద్యార్హతలు నిర్నియించడం
3.
పారదర్శకత లో
భాగంగా చెయ్యబోయే పనులే కాక ,
ఇప్పటివరకు చేసిన పనుల వివరాలు కూడా ప్రతి
రాష్ట్ర మరియు కేంద్ర మంత్రులు ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచే విధంగా ఆదేశించండి
4.
నల్లదనం
నిరోదించే చర్యలను వేగవంతం చెయ్యండి
5.
మంత్రుల
పరిపాలన పటిమను పెంచే శిక్షణ ఇప్పించటం ,
పరిక్షించడం
6.
పోలీసు వ్యవస్థ
లో సమూల మార్పు , సమర్ధతను పెంచడం , FIR
లను వెబ్ సైట్ ద్వారా నమోదు చేసే సౌకర్యం
కల్పించడం , వారి జీతభత్యాలను పెంచడం ,
అవినీతికి పాల్పడని అధికారులకు జిల్లా , రాష్ట్ర , జాతీయ స్థాయి అవార్డు లను
ప్రకటించడం మొదలైనవి మీ నుండి
ఆశిస్తున్నాం
............ఇట్లు కే వి కృష్ణా రావు
............ఇట్లు కే వి కృష్ణా రావు
Saturday, 30 May 2015
రైతు సోదరులకు
రైతు సోదరులకు
కృష్ణా రావు నమస్కారం..
మీతో మాట్లాడి చాలా రోజులు అయ్యింది , అనారోగ్య
కారణం వల్ల ఏమి వ్రాయలేక పోయాను ,
ప్రస్తుతం రైతుల పంటలకు గిట్టుబాటు ధర
లేదు .. వరి , పత్తి గోధుమ , జొన్న
మొక్కజొన్న మొదలైన పంటలు ప్రపంచ వ్యాప్తంగా దిగుబడి బాగున్నందున ఎగుమతి చేస్తున్నప్పటికీ ధరలు పెరగడం లేదు , పంచదార దిగుమతి సుంకం 20 % నుండి
40 % వరకు పెంచి దిగుమతులకు కళ్ళెం
వేసారు, పప్పు గింజలు , నునే గింజలకు మంచి ధర వుంది , భవిష్యత్తు లో కూడా ఈ రెండిటికి
మంచి ధర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది , కారణం ఈ రెండు పంటల విషయం లో
మనం ఇప్పటికి దిగుమతుల పైనే ఆధార పడుతున్నాం , ఈ విషం లో మన ప్రధాని మోడీ గారు చాలా
పట్టుదలతో ఉన్నారు , ఈ పంటలను స్వదేశం లో
ఎక్కువగా పండించాలి అని రైతులను
ప్రోత్సహిస్తున్నారు , 24 గంటలు దూరదర్శన్ లో వ్యవసాయ కార్యక్రమాల ఛానల్
ప్రారంభిస్తూ వారి విషయాన్ని
ప్రస్తావించారు , ఎ విధంగా
పంచదార పైన దిగుమతి సుంకాన్ని పెంచి దేశంలో పంచదార
ధర పతనం కాకుండా చెరకు రైతును కాపాడారో ..అదే విధంగా
భవిష్యత్త్ లో నునే గింజలు పండించిన
రైతులు నష్టపోకుండా దిగుమతుల
పై సుంకాన్ని పెంచి దేశీయ రైతులకు సహాయ
పడగలరు
Subscribe to:
Comments (Atom)














