Friday, 22 August 2014

farmer scientists Dr Koteshwar rao garu, రైతు విజ్న్యాని శ్రీ కోటేశ్వరరావు గారు



వ్యవసాయంలో నిరంతర హరిత విప్లవం గురించి చాలా  మంది మాట్లాడుతూ ఉంటారు.శాస్త్రవేత్తల పై విమర్శలు ల్యాబ్ టు ల్యాండ్ సరిగా లేదని విమర్శిస్తూ వుంటారు.అయితే ఇది అర్ధ సత్యం మాత్రమే అనేది  నా అభిప్రాయం! కారణం గత పదిహేను సంవత్సరాల నుండి నేను ఈ దిశగాఎంతో శ్రమిస్తూసాటి రైతుల నుండి ఎన్నో విమర్శలు,అవమానాలు ఎదుర్కోంటున్నాను.ఒక కొత్త విషయాన్ని అమోదించడంలో కొంత మంది అవమానంగా భావించటం,ఈ విధమైన ప్రవర్తనకు కొంత న్యూనత భావం కావచ్చు.ఏది ఏమైనప్పటికీ ఒక తాగుబోతు,ఒకతిరుగుబోతు,ఒక జూదగాడునైన సమాజం గౌరవిస్తుంది. కానీ నూతన విదానంలో వ్యవసాయం కానీ, అనుభంద ఉత్పత్తులను ప్రారంభించే వార్నీ నిరాశ పరచటం ,అవమానించటం మనం చూస్తున్నవే అంతే కాకుండా ఇంతటి వ్యతిరేక్త పరిస్టితిలో కూడా సాటి రైతుల విమర్శలను లెక్కచేయకుండా, ముందుకుపోతున్న కొంత మంది రైతు శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం. 


వారిలో ఒకరు డాక్టార్ ఎం.కోటేశ్వర్ రావు గారు  కోడూరు మండలం ,కృష్ణాజిల్లా , నరసింహాపురం వాస్తవ్యులు . 60 సంవత్సరాల పై పడ్డ డాక్టరు గారు కొంత కాలం తెలంగాణా లోను , కొంత కాలం ఆఫ్రికా దేశాల్లోను  డాక్టరుగా వారి వృత్తి కొన్నసాగించినప్పటికి వారి తండ్రిగారి కోరికపై స్వగ్రామం వచ్చినప్పటి నుండి వైద్య వృత్తిని కొనసాగిస్తూ అలాగే వ్యవసాయం కొనసాగిస్తూ అక్కడి ప్రజలకు సేవచేస్తూన్నారు. మూడు సంవ్సరాల క్రిందట 60 ఎకరాల్లో బాస్మతి సాగుచేసి వారే కాకుండా ప్రక్క రైతులను ప్రోత్సహించి , బాస్మతి ప్రప్రదమంగా సముద్రతీర ప్రాతంలో సాగుచేసిన ఘనత వారికే దక్కుతుంది.బాస్మతి 1121 రకాన్ని సాగుచేయమని ప్రోత్సహించిన వారు సరి అయిన సలహాలు,సూచనలు ఇవ్వకపోవడంతో కొంత ఆందోళనకు గురైనాడు. ఆ సందర్భంలోనే నాకు పరిచయమై నేను రెండు,మూడు సార్లు వారి గ్రామానికి వెళ్ళడం వారితో అనేక విషయాలు వ్యవసాయం పై చర్చించటంజరిగింది. గత 20,25 సంవత్సరాల నుండి ఆ చుట్టూ ప్రక్కల రైతులు బిపిటి 5204 అనే రకాన్నే సాగుచేస్తూ అనేక రకాలైన రోగాలు,తెగుళ్ళ ను ను ఎదుర్కొంటూ లాభసాటి కాని బిపిటి రకం సాగులో నిరాశ చెంది ఉన్న  రైతులకు డాక్టరుగారు తెసుకున్న బాస్మతి సాగు కొదరిలో ఆశ కలిగించిన ఆ పంట దిగుబడి సరిగా రాకపోవడం ,సరైన మార్కెట్ సదుపాయం లేకపోవడం ,అనేక సమస్యలతో నీరశాపడిన , నా ప్రోత్సహంతో డాక్టరు గారు గత సంవత్సరం కూడా బాస్మతిలో పలు రకాల,షర్బతి అనే రకాన్ని,జైశ్రీరాం అనే రకాన్ని బాగా పండించ కలిగాము.ఆధునిక పరికరాలైన లేజర్ లేవలర్ తో వారి వ్యవసాయ భూమిని పొలం మొత్తం ఒకే లెవల్ గా చేయటం మరియు నేరుగా విత్తనాన్ని విత్తే విధానాన్ని ప్రవేశపెట్టటం జరిగింది.లేబర్ దొరకక, నాటు వేయటానికి ఎంతో సమస్యగా మారిన ప్రస్తుత తరుణంలో డాక్టరు గారు తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు గ్రామం మొత్తం విత్తనాన్ని నేరుగా విత్తడమే కాకుండా ఎకరానికి ౩౦ కేజీలు వాడే విత్తనం 10 నుంచి 15 కేజీలకే తీసుకరాడం ఏ నెలలో నాటు వేసిన 150 రోజుల పంటైన బిపిటి రకానికే స్వస్తి పలికి, నీటి లభ్యతను బట్టి 130 రోజుల అవధి కలిగిన జైశ్రీరాం , 120 రోజులు, అరెఎన్ఆర్15048, 110 రోజుల వ్యవధి కల్గిన పంజాబ్ బాస్మతి 1509 అనే రకాలను ఎంచుకొని విత్టటం అనేక మంది రైతులు సాగుచేయటం ద్వారా ఆ చుట్టుప్రక్కల  గ్రామలలోని అనగా నాగాయలంక ,ఎదురుమండి, ఎటిమేగా, రేపల్లె , ఇలా ఎన్నో గ్రామాల రైతులకు డాక్టరు కోటేశ్వరావు గారు నూతన విధానాలను పరిచయంచేస్తూ ఒక భస్తా ధాన్యం ఉత్పత్తి ఖర్చు 300ల నుంచి 350 రూపాయలకు తీసుకరాగలరని ఆసిస్తూ, విమర్సలకు వెరువక నూతన విధానాలను ప్రవేశపెడుతూ సాటి రైతు సోదరులకు మార్గదర్శనం చేయగలరని ఆసిస్తూ వార్నీ అభినందిస్తున్నాం.

No comments:

Post a Comment