బాసుమతి సాగు పై రైతుల అపోహలు మరియు వాస్తవాలు :
కొన్ని వ్యవసాయ మాసపత్రికలలో వస్తున్నట్టు ఎ వరి పైరు అతి చల్లటి వాతావరణం లో పండదు , ఉత్తర భరతం లో కూడా అక్టోబర్ నెలలోనే కోతలు అయపోతాయి ఆ సమయం లో పగటి ఉష్ణోగ్రత 32 నుండి 34 డిగ్రీలు రాత్రి ఉస్న్హోగ్రత 28 డిగ్రీలు ఉంటుంది , అయెతే నూర్పిడి అయిన దగ్గరనుండి మర్చి నెలవరకు అక్కడ వాతావరణం అతి చల్లగా ఉండటం వల్ల సువాసన కొంతవరకు ఉంటుంది ఆ సమయం లో అక్కడ మిల్లెర్స్ స్టీమ్ బెయ్యాన్నే ఉత్పత్తి చేస్తారు ఏప్రిల్ నుండి కొత్త పంట వచ్చే వరకు boiled బీయాన్నే తయార్ చేస్తారు , దాన్నే వారు WHITE SELLA & GOLDEN SELLA అని పిలుస్తారు , ఈ బీయ్యానికి విదేశాలలో చాలా గిరాకి ఉంటుంది , ఒక్క ఇరాన్ కే 6 నుండి 8 లక్షల టన్నులు మనం ఎగుమతి చేస్తున్నాం . మొత్తం బాసుమతి 35 లక్షల టన్నులు ఎగుమతి చెయ్యడం జరిగింది , దేశీయ వినియోగం కూడా పెరిగి 38 లక్షల టన్నులు దాటింది. అయెతే పంజాబ్ హరియాణ , ఉత్తరాంచల్ , జమ్మూ కాశ్మీర్ , GI జియోగ్రాఫికల్ ఇండికేషన్ అడుగుతున్నారు , అయెతే ఇంతవరకు ఆమోదం పొందలేదు, అయినప్పటికీ వేరే ఎక్కడా పండని పంటకు GI అడగరు , ఉదాహరణకు ఆపిల్ కొరకు GI అడగలేదు అయెతే బాసుమతి వరి పండించే ప్రతి ప్రాంతంలోనూ పండే అవకాశం ఉన్నందునే GI అడుగుతున్నారు , ఇది మన శాస్త్రవేత్తలు గ్రహించాలి , సువాసన గురించి ఆలోచించినప్పుడు మన దగ్గర పండిన ఖరీఫ్ ధాన్యాన్ని కోల్డ్ స్టోరేజ్ లలో నిలువ చేసుకుంటే సువాసన పోదు , వేసవి లో పండించే బాసుమతి ధాన్యాన్ని boiled బియ్యంగా మార్చి export చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయ్ , మనకున్న ఈ సదావకశాన్ని వదులుకుని అతి తక్కువ ధర పలికే ముతక రకాల ధాన్యాన్ని మన రైతుల పై రుద్దటం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి
తెలంగాణా లాంటి ప్రాంతంలో బావులకింద సాగు చేస్తూ ఎన్నో కష్టనష్టలకోర్చి వరి పండించే రైతులకు న్యాయం చెయ్యాలి అంటే పై రకాలను సాగు చేసి రైతుల నికరాదాయ్యాన్ని పెంచే విధంగా ప్రోత్శాహించాలే గాని నిరుత్సాహ పరచ వద్దు , ఎంతో విలువైన భూగర్భ జలాన్ని ఒక కేజీ బీయ్యానికి 5౦౦౦ లీటర్ల నీటిని వినియోగిస్తూ ఎగుమతి చేస్తున్న ముతక బియ్యానికి , మనకొచ్చే ధర కేవలం 20 నుండి 25 రూపాయలు మాత్రమే , దీనివల్ల మన రైతులు మరియు దేశం కూడా ఎంతో నష్టపోతున్నారు
ఆలోచించండి శాస్త్రవేత్తలారా
No comments:
Post a Comment