Wednesday, 2 April 2014

జిగురు గోరుచిక్కుడు రైతులకు శుభవార్త :



 జిగురు గోరుచిక్కుడు రైతులకు శుభవార్త :
3.4.2014 Raichur
గత సంవత్సరం  గోరు చిక్కుడు గం ధర విపరీతంగా పెరగటం వల్ల , విదేశాలలో కూడా ఈ పంట ను పండిచడం మొదలు పెట్టారు , ఇప్పుడు ధరలు మల్లి పూర్వ స్తితి కి వచ్చినందువల్ల  అక్కడ (విదేశాలలో ) నెలకొల్పిన  గోరు చిక్కుడు పరిశ్రమలు మన తో పోటి పడలేక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ,

అందువల్ల మనం పండిస్తున్న గోరుచిక్కుడు కు  మంచి మార్కెట్ మరియు  ధర కూడా నిలకడ గా  ఉండే అవకాశాలు చాలా  ఎక్కువగా ఉన్నాయ్ , ఉత్పత్తి కర్చు మనకన్నా ఎక్కువ అయినందున  విదేశీ రైతులు  పండించడానికి వెనకడుగు వేస్తున్నారు , అమెరికా లో ఒక కంపెనీ రైతులకు డబ్బు చెల్లించలేక తీవ్ర ఆర్ధిక సంక్షోబం లో  ఉంది అని  ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా తెలుసుకున్నాం .

భారత రైతులతో సమానంగా పండించే అవకాశాలు చాల దేశాలలో లేనందున  మన పంటకు  ఎప్పటికి మంచి డిమాండ్  ఉంటుంది , అయితే చాలా మంది ఎక్కువ రేట్ ను దృష్టిలో పెట్టుకుని , విలువైన పంటను పండించే భూములలో కూడా ఈ పంటను వేసి ఆశించిన ధర లేక చాలా మంది రైతులు నిరుత్సాహ పడి  ఈ పంటను పండించేందుకు ఇష్టపడటం లేదు , కనుక వర్షాధార ఎర్ర నెలలు  వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాలలో  అనగా ఉత్తర తెలంగాణా , రాయలసీమ మొదలైన జిల్లాలలో  ఈ పంటను కంది , సజ్జ , కొర్రలు మొదలైన ఆయా ప్రాంతాలలో  పండించే సాంప్రదాయ పంటలతో మిశ్రమ పంటగా వేసుకుని లాభపడవచ్చు  కనుక రైతులు తమ  వద్ద  ఉన్న విత్తనాలను ఉపయోగించి  కర్చు తక్కువతో దిగుబడి పొందగలరు , ఇప్పటికే అనేక ప్రాంతాలలో  తమ వద్ద ఉన్న విత్తనాలను వినియోగించి అధిక దిగుబడి సాదిన్చినట్లు  రైతులు తెలియజేస్తున్నారు , ఒక వేళ మీకు విత్తనం అవసరం అయితే మమ్మల్ని సంప్రదించండి , కిలో వంద రూపాయలకే  మేం నాణ్యమైన విత్తనాలను సరపరా చెయ్యగలం , అలాగే ధర విషయం లో కూడా చాల మంది మధ్యవర్తులు రైతులను రెండు వేలకు  కూడా అమ్ముడు పోదు అని భయపెడుతున్నట్లు  తెలుస్తున్నది , అది నిజం కాదు, రైతులకు  కనీస ధర 3500/-per quintal మేము మేం  గ్యారంటీ  ఇస్తాం అంతకన్నా ఎక్కువ వచ్చినా ఆ ధర కూడా రైతులకే  ఇచ్చి కొనుగోలు చేస్తాం అని తెలియజీస్తున్నాం ,

ఇప్పటికే  నాణ్యమైన గింజలకు  జోధ్పూర్  ధరకు   కొనుగోలు చేస్తున్నాం , కనుక  కొంత మంది రైతులు  jute  వితనం  తో పోల్చుకుని భయపడుతున్నట్లు  తెలుస్తోంది , jute విత్తనం కేవలం విత్తనం కోసమే వాడతారు , జుగురు గోరుచిక్కుడు అలా కాదు , అనేక రకాలైన ఉత్పత్తులలో వాడతారు కనుక జిగురు గోరుచిక్కుడు  వినియోగం రోజు రోజు పెరిగేదే కాని తరిగేది కాదు  






No comments:

Post a Comment