గోరుచిక్కుడు సాగును గురించి రైతుసోదరుల అనుభవాలు రాష్ట్రం
నలుమూలలనుండి వస్తున్న సమాచారాన్ని బట్టి
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ఉత్తర తెలంగాణ , కోస్తా ప్రాంతం , శ్రీకాకుళం , విజయనగరం ,
ఈ ప్రాంతాలు జిగురు గోరుచిక్కుడు కు అనుకూలం కాదు అని తేలింది , దక్షిణ తెలంగాణ ,
రాయలసీమ , చిత్తూరు , నెల్లూరు జిల్లాలలో వర్షపాతం తక్కువగా ఉన్న చోట్ల ఈ పంట ,
ఖరీఫ్ లో మిశ్రమ పంటగా కంది+ గోరుచిక్కుడు , కొర్రలు + గోరుచిక్కుడు , ఈ విధంగా
మిశ్రమ పంటగా వేసిన రైతులు బాగా లాభసాటిగా ఉందని చెప్తున్నారు , ఏక పంటగా
వెయ్యాలనుకునే రైతులు ఆగష్టు నెలలో వేసుకున్నందున మంచి దిగుబడులు మంచి దిగిబడులు
సాధించినట్లు తెలుస్తోంది
ఇంతకుముందు మనం అనుకున్నట్లు తక్కువ ఎరువులతో
అధిక దిగుబడి సాధించటం సాధ్యం కాదని తేలింది , కనుక ఈ పంటకు విత్తే సమయంలో ఎకరాకు
75 kgs సల్ఫర్ కలిగిన కాంప్లెక్స్ ఎరువు వేసుకోవటం , తరువాత ౩౦ % జింక్
సల్ఫేట్ లీటర్ నీటికి 2 గ్రాములు కలిపి
ఇరవై రోజులలోపల రెండు సారులు స్ప్రే చేసినందున పంట పెరుగుదల దిగుబడి బాగా
పెరిగినట్లు తెలుస్తుంది , ఈ పంటకు ముఖ్యంగా బూడిద తెగులు ఎక్కువగా కనపడుతుంది
కనుక రైతు సోదరులు ప్రారంబ దశలోనే నిరోధక చరియలు చేపట్టినందున మంచి ఫలితాలు
వచ్చినట్లు తెలిసింది
పత్తి
పంట సాగు చేసే రైతులు మొక్కల సాంద్రత ను పెంచి అయిదు నుండి ఆరు నెలలలోపే
పూర్తీ పంటను పొందవచ్చు అని జాన్ డియర్ కంపని వారు ఈ విధానాన్ని ప్రవేశ
పెట్టినట్లు తెలుస్తుంది దీనివల్ల భవిష్యత్ లో యంత్రాల ద్వారానే పత్తి తీసే
అవకాశం ఉన్నందున మరియు పత్తి తరువాత రెండో పంటగా జిగురు గోరుచిక్కుడు సాగు
చెయ్యడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది , అభ్యుదయ రైతులు ఈ విధానాన్ని కొంత ప్రాంతం
లో అయినా ఆచరిస్తే మిగిలిన రైతులకు