వేసవిలో జిగురు గోరుచిక్కుడు సాగు
చాలా మంది రైతు మిత్రులు గోరుచిక్కుడు సాగు ఇప్పుడు
చేపట్టవచ్చా అని అడుగుతున్నారు , గోరు సాగుకు ఉష్ణోగ్రత ఆటంకం కాదు , కాకపోతే
చివరి దశలో వర్షం పడకుండా చూసుకోవాలి అని మనం చెప్తున్నాం , మారిన వాతావరణం
ప్రకారం వర్షం ఎప్పుడు పడేది చెప్పలేని స్తిథి లో ఉన్నాం , పంట వయసు తొంబై
రోజులయినప్పటికి వాతావరణ శాక వారు వారం పది రోజులు ముందుగానే వర్ష సూచన చేస్తున్న
సందర్బం లో అవసరమైతే పది పదిహేను రోజులు ముందుగానే గోరుచిక్కుడు నూర్పిడి
చేసుకున్నందు వల్ల అయిదు నుండి పది శాతం మాత్రమే నష్టపోవాల్సి వస్తుంది ఇప్పటికే ప్రకాశం జిల్లా లో కొంత మంది రైతులు ప్రయోగాత్మకంగా పత్తి పంట అయినా తరువాత మార్చ్ ఒకటి రెండూ వారాలలో విత్టటం జరిగింది .16.3.2014ఆదివారం , ఇంకొల్లు మండలం సూదివారి పాలెం లో శ్రీ డి శ్రీనివాస్ రావు అనే రైతు నవంబర్ నెల మూడో వారం లో విత్తి రెండో సారి నీటి తడి పెట్టకుండానే పండించిన గోరుచిక్కుడు పంట క్షేత్రోత్సవం జరిగింది , ఈ సందర్బంగా గా వచ్చిన వ్యవసాయ శాస్త్రవేత్తలు చుట్టుపక్కల రైతులు మీడియా వారు సుప్రసిద్ధ వ్యవసాయ వ్యాసంగా రచయత శ్రీ ఆళ్వార్ స్వామి గారు కూడా పాల్గొ న్నారు అలాగే కృష్ణా గుంటూరు నెల్లూరు శ్రీకాకుళం ఆదిలాబాద్ జిల్లాలనుండి కూడా యువ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కోస్తా ఆంధ్రా లో అధిక వర్షాల వల్ల తొలకరి పంట నష్టపడగా అక్టోబర్ నవంబర్ లో విత్తిన రబీ పంట మంచు వల్ల బూడిద తెగులు వ్యాపించి పంట దిగుబడి బాగా తగ్గింది అని , కోస్తా ప్రాంతం లో ఈ సాగు వేసవి పంటగా మంచి దిగుబడిని ఇస్తుందనే నిర్ణయానికి రావడం జరిగింది అలాగే ఎక్కువ కవులుకు తీసుకుని గాని వాణిజ్య పంటలు పండే భూముల్లో ఈ పంట లాభదాయకం కాదని చర్చ లో అభిప్రాయ పడ్డారు , అయెతే భూమియొక్క సారవంతాన్ని పెంచే ఈ పంట వేసవి లో మొక్కజొన్న ప్రత్తి పెసర మినుము అయినా తరువాత , మొలక తడికి నీరుంటే తప్పకుండా ఈ పంటను సాగు చెయ్యవచ్చు , తొంబై శాతం దిగుబడికి అవకాశం ఉన్న ఈ పంట ఒక వేళా వర్షాల వల్లచేతికిఅందనిపక్షంలో పచ్చిరొట్ట ఎరువుగా బాగా ఉపయోగపడుతుంది
No comments:
Post a Comment