Friday, 28 March 2014

KVK fisheries at his Agri pond (dual purpose ) at madagiri camp, manvi taluka Raichur , Karnataka


Fish farming in the agri pond , dual purpose , both For Irrigation of fields and Fish rearing , a Model Multiple Income source for farmers

KVK emo farming


పెరటి పక్షిగా ఈము పెంపకం


Thursday, 20 March 2014

IMPORTANT INFORMATION TO FARMERS రైతు సోదరులకు విగ్య్నప్తి

24.3.2014 
Dear farmers 
there have been rumors in the market especially regarding guar price, that there is a surplus stocks and prices will fall down , but as per my analysis of market , prices for guar seed are unlikely to come down , since the export and domestic market of the guar gum are in a steady basis, and on the other hand the guar gum  usage has increased in the domestic industry , THE EARLIER ABNORMAL HIKE IN THE GUAR SEED PRICES WAS CREATED BY A FEW AND NOT DUE TO ITS NATURAL DEMAND, AND WHEN THE PRICES WERE AT THEIR ALL TIME PEAKS, MANY USERS SHIFTED TO ALTERNATIVE PRODUCTS,  BUT SINCE PRICES HAVE COME DOWN TO ALMOST NORMAL LEVELS, MANY OF THEM WHO HAVE GONE FOR SUBSTITUTES ARE RETURNING BACK FOR GUAR GUM, HENCE   THERE IS NO NEED TO GET WORRIED ABOUT THE PRICE , AND FARMERS WHO HAVE LIMITED WATER RESOURCES CAN CULTIVATE THIS CROP AND CAN MAKE GOOD RETURNS 

THANKYOU
YOUR`S 
KVK




ఆత్మీయ  రైతు సోదరులారా
ప్రస్తుతం  దేశం లో నెలకొన్న క్లిష్ట పరిస్తితులలో  అందులోను  మన రైతుల పరిస్తితి మరీ  దీనం గా ఉంది అనడం లో ఎ మాత్రం సందేహం లేదు ,  ప్రభుత్వ  విధానాలు  ప్రక్రుతి  వైపరిత్యాలు కలిసి మానవ కోటికి  ఆహారాన్ని అందిస్తు ప్రాణాన్ని  నిలుపుతున్న   రైతు ఈనాడు  తన ప్రాణాల్ని ధారబోస్తున్నాడు  , నిరంతరం మనం చదువుతున్న రైతు ఆత్మహత్యలే  దీనికి నిదర్శనం  పరిస్థితులు ఇలాగే ఉంటె భవిష్యత్ లో  మన దేశం లో కూడా  మరో సోమాలియా గా మారకముందే  సరయిన నిర్ణయాలతో  70 % మంది ఆధార పడిన వ్యసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ   చేతల రూపం లో  రైతు సమస్యలను పరిష్కరించే నిజాయితీ గల వ్యక్తులను మనం ఎన్నికలలో కుల మత  ప్రాంత అనే భేద భావాలు చూపకుండా  అర్హుడైన వ్యక్తీ / పార్టీ కి మన వోటు వేసి  గెలిపిద్దాం 

Tuesday, 18 March 2014

GUAR FIELD DAY @ SOODIVAARI PALEM , PRAKASAM DIST






వేసవిలో  జిగురు గోరుచిక్కుడు సాగు
చాలా మంది రైతు మిత్రులు గోరుచిక్కుడు సాగు ఇప్పుడు చేపట్టవచ్చా అని అడుగుతున్నారు , గోరు సాగుకు ఉష్ణోగ్రత ఆటంకం కాదు , కాకపోతే చివరి దశలో వర్షం పడకుండా చూసుకోవాలి అని మనం చెప్తున్నాం , మారిన వాతావరణం ప్రకారం వర్షం ఎప్పుడు పడేది చెప్పలేని స్తిథి లో ఉన్నాం , పంట వయసు తొంబై రోజులయినప్పటికి వాతావరణ శాక వారు వారం పది రోజులు ముందుగానే వర్ష సూచన చేస్తున్న సందర్బం లో అవసరమైతే పది  పదిహేను రోజులు ముందుగానే గోరుచిక్కుడు నూర్పిడి చేసుకున్నందు వల్ల అయిదు  నుండి  పది శాతం మాత్రమే నష్టపోవాల్సి వస్తుంది   ఇప్పటికే ప్రకాశం జిల్లా లో కొంత మంది రైతులు  ప్రయోగాత్మకంగా  పత్తి పంట  అయినా తరువాత  మార్చ్  ఒకటి  రెండూ  వారాలలో  విత్టటం జరిగింది .


16.3.2014ఆదివారం   , ఇంకొల్లు  మండలం  సూదివారి  పాలెం లో శ్రీ  డి  శ్రీనివాస్ రావు  అనే రైతు  నవంబర్  నెల మూడో వారం లో విత్తి  రెండో సారి నీటి తడి పెట్టకుండానే  పండించిన  గోరుచిక్కుడు  పంట  క్షేత్రోత్సవం  జరిగింది , ఈ సందర్బంగా  గా వచ్చిన  వ్యవసాయ  శాస్త్రవేత్తలు చుట్టుపక్కల  రైతులు  మీడియా వారు సుప్రసిద్ధ  వ్యవసాయ  వ్యాసంగా  రచయత శ్రీ ఆళ్వార్  స్వామి గారు  కూడా పాల్గొ న్నారు  అలాగే  కృష్ణా  గుంటూరు నెల్లూరు   శ్రీకాకుళం  ఆదిలాబాద్  జిల్లాలనుండి  కూడా  యువ రైతులు  ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు 
కోస్తా  ఆంధ్రా లో అధిక వర్షాల వల్ల  తొలకరి పంట  నష్టపడగా  అక్టోబర్ నవంబర్ లో విత్తిన రబీ పంట  మంచు వల్ల  బూడిద తెగులు వ్యాపించి  పంట దిగుబడి  బాగా తగ్గింది అని , కోస్తా ప్రాంతం లో ఈ సాగు  వేసవి పంటగా  మంచి దిగుబడిని ఇస్తుందనే  నిర్ణయానికి  రావడం జరిగింది  అలాగే ఎక్కువ కవులుకు తీసుకుని గాని  వాణిజ్య పంటలు పండే భూముల్లో  ఈ పంట  లాభదాయకం కాదని  చర్చ లో అభిప్రాయ పడ్డారు , అయెతే భూమియొక్క సారవంతాన్ని  పెంచే ఈ పంట వేసవి లో మొక్కజొన్న ప్రత్తి పెసర మినుము అయినా తరువాత , మొలక తడికి నీరుంటే తప్పకుండా ఈ పంటను సాగు చెయ్యవచ్చు , తొంబై శాతం దిగుబడికి అవకాశం ఉన్న ఈ పంట ఒక వేళా వర్షాల వల్లచేతికిఅందనిపక్షంలో పచ్చిరొట్ట ఎరువుగా  బాగా ఉపయోగపడుతుంది 

Monday, 17 March 2014

photo gallery

Addressing Media men regarding new agricultural practices for cost reduction and Increased profitability for farmers

Being honored by sri K Raghav reddy Garu, Vice chancellor of Acharya NG Ranga University and Dr Viraktmath garu , Director , Directorate of Rice research Institute




Monday, 10 March 2014

కృషి మేళా

కృషి మేళా :
ఫెబ్రవరి  26 ,27 28 న డెల్లి లో కృషి మేళా జరిగింది , ఎంతో మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు , వ్యవసాయం లో వస్తున్న నూతన మార్పులు ..నూతన వంగడాలు రైతు కు లాభసాటిగా ఉండాలి అంటే ఎం చెయ్యాలి  అనే విషయాల మీదే ప్రధానంగా చర్చిస్తూ భారత దేశం లో ఇరవై ఎనిమిది కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార దాన్యాలని ఉత్పత్తి చేసి  చైనా తరువాత  ప్రపంచం లోనే రెండో దేశంగా ఉన్నాం , అయితే ప్రజలకు కావాల్సిన పోషకాహార కొరతను తీర్చాలి అంటే ఆహార దాన్యాలే కాకుండా ఇతర పంటలు (హార్టికల్చర్ ) పై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలి అని చెప్తూ  రక్షిత వ్యవసాయం (protective agriculture ) ఉపయోగం లోకి తేవాల్సిన అవసరం ఉత్తర భారత దేశానికి ఎక్కువగా ఉందని చెప్తూ సమ సీతోష్ణ  స్తితి కలిగిన దక్షిణ భారత ప్రాంతం లో పండే పంటలను ఇక్కడ కూడా పండించవచ్చు అని చెప్పారు , ప్రయోగాత్మకంగా  కర్చు తక్కువతో పోలి హౌసెస్ ఉపయోగించి  చలి కాలం లో కూడా  అనేక రకాల కూరగాయులు పూలు అన్ని కూడా పండించ వచ్చు ... అలాగే ప్రతి ఇంట్లో కుండిలలో  పండించే విధానాన్ని గురించి కూడా చెప్పారు , మామిడి మొదలైన తోటలలో మొక్కల సాంద్రతను పెంచి ప్రునింగ్ చేస్తూ ప్రతి సంవత్సరం కాపునిస్తూ అధిక దిగుబడి  సాధిస్తూ  స్వదేశం లోను మరియు ఎగుమతులలోను మార్కెట్ చెయ్యడం వల్ల రైతు అధిక లాభాలు సాదించవచ్చు అని చెప్పారు . మార్కెట్ లోకి ఉత్పత్తి ఎక్కువ  వచ్చి  ధరలు పడి పాయినప్పుడు  ఆ పంటను నిలువ ఉండే విధంగా మార్చి  విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశాలను గురించి కూడా వివరించటం జరిగింది
వరి పంట విషయం పై మాట్లాడుతూ అధిక వర్షాలు పడే ఈశాన్య రాష్ట్రాలు తీర ప్రాంతాలు వరిను పండించాలి అని చెప్పారు , భూగర్బ జలాలు ఉపయోగించి అధిక విలువ కలిగిన ఎగుమతి కి అనుకూలమైన పంటలు పండించినందున ఇటు రైతుకి లాభం తోపాటు అటు దేశానికి కూడా విదేశీ మారక ద్రవ్యం  కూడా వస్తుంది అని చెప్పారు , ఆ క్రమం లో బస్మతిని ఎక్కువ పండించాల్సిందిగా రైతులకు సూచించారు .