లెవీ రద్దు :
లెవీని రద్దు
చేస్తూ గత సంవత్సరం ఒక నిర్ణయం
తీసుకున్నప్పటికీ కొన్ని రాజకీయ కారణాల వల్ల మొత్తం లెవీ సేకరణ లో 25 % మాత్రమే తీసుకుంటాం అని ప్రకటించి , అంతవరకే తీసుకుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ FCI ,
అలా కాకుండా మొత్తం లెవీ ని సేకరించినట్లయితే
ధాన్యం ధర ఈ పాటికే
చుక్కలనంటేది , కారణం 13 -14 పంట
సంవత్సరం లో , అతి వృష్టి
అనావృష్టి కారణంగా ఒక కోటి
టన్నులు బియ్యం ఉత్పత్తి తగ్గినప్పటికీ
మార్కెట్ లో మాత్రం ధాన్యం ధర పెరగలేదు , ఇదే కాకుండా అంతర్జాతీయంగా బియ్యం
నిలువలు ఎక్కువ ఉండటం కూడా ఒక కారణం ,
అయెతే ఇప్పటివరకు బియ్యం ధరలు పెరిగినప్పుడల్లా వ్యాపారస్తులు దొంగ నిలువలు చేసి
ధరలు పెంచుతున్నారనే వాదన ప్రచారం లో
ఉండేది , అయెతే ఫుడ్ కార్పొరేషన్ ద్వారా
దేశం మొత్తం మీద షుమారు 4 నుండి 5
కోట్ల టన్నుల బియ్యం , మూడు నుండి 4 కోట్ల టన్నుల గోధుమలు సేకరించి ఆరుబైట నిలువ చేస్తూ , వేలాది కోట్ల రూపాయల సరుకు ఎలుకలు , వర్షం వల్ల నాశనం అయెతే అంతకు రెండు రెట్లు దొంగ లెక్కలతో
జేబులు నింపుకోవడంతో కొంత మంది స్వార్ధం కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వమే నిలువ
చెయ్యాలి అని వాదిస్తూ వచ్చారు తద్వారా
కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం
కావడాన్ని గురించి CAG ఎన్నోసార్లు
హెచ్చరించారు , అంతేకాక నిరుపేదలకు పంపిణి పేరుతొ కూడా అక్రమ సంపాదనకు ఇదొక
చక్కని మార్గంగా కొందరు స్వార్ధపరులు ఎంచుకున్నారు
, అధికారం లో ఉన్న పెద్దలు వారి
వారి రాజకీయ దళారులకు చౌకధరల దుకాణాలకు లైసెన్స్ ఇచ్చి గ్రామం / తాలుకా / మండల / జిల్లా స్థాయిలో
రాజకీయ బ్రోకర్స్ ని నియమించుకున్నారు , సబ్సిడీ ధరలకు దొరికే గ్యాస్ , బియ్యం , కిరోసిన్ , గోధుమలు , పంచదార
మొదలైన సరుకుల బ్రోకేర్ల గా అవతారమెత్తిన వారి సంఖ్య
లక్షలలో ఉంటుంది ... వీరంతా అంచలు
అంచలుగా అక్రమార్జన బలంతో రాజకీయ నాయకులై మంత్రులై
ఈ దేశంలో నిజాయితీపరులు
సమర్ధవంతులైన నాయకత్వానికి చరమ గీతం పాడి
వారసతత్వ రాజకీయానికి నాంది పలికారు , అంతే కాకుండా కులాలు మతాలూ
ప్రాంతాలుగా ప్రజలను విడగొట్టి వారి
అధికారాన్ని శాశ్వతం చేసుకునే ప్రయత్నం లో ఉన్న వీరికి ప్రచార సాధన విప్లవం తో
టీవీలు ప్రాంతీయ భాషలలో అసంఖ్యాకంగా
వచ్చి వారి వ్యాపార వృద్ది లో భాగంగా ప్రజలను ఆకర్షించడానికి నిరంతరం
అనేక సంచలన వార్తల ప్రచారం లో పోటీలు పడి మరీ ఈ విషయాలని ప్రజలకు
తెలియచేస్తు ప్రత్యామ్నాయ రాజకీయాల
వైపు యువత సన్నధమైన తరుణంలో వీరిని ఆకర్షిస్తూ గుజరాత్ లో బ్రహ్మచారి
మోడీ గారు పారదర్శక పాలన పేరిట తీసుకున్న నిర్ణయాలను ప్రజలు
అంగీకరించి మూడు సారులు మోడీ గారికి అవకాశం
ఇచ్చినందువల్ల లెవీ రద్దు లాంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుంది , దీని
వల్ల దక్షిణ భారత రైతులకు పెద్దగా జరిగే లాభం గాని నష్టం
గాని ఉండకపోవచ్చు , ఎందుకంటే కిలో రూపాయికి ఇచ్చిన బియ్యాన్ని చాలా మంది తీసుకోవడంలేదు
, వారు కూడా సన్న బియ్యాన్ని కొనుక్కు తింటున్నారు , అయెతే ఎక్కడ బియ్యం తినరో ..ఉదాహరణకు ఉత్తర భారతం లో పంజాబ్ హరియాణా ఉత్తర ప్రదేశ్ ప్రాంత రైతులకు కొంత ఇబ్బంది
తప్పదు , అయెతే ఇప్పటికే అక్కడ రైతులను వరికి బదులుగా వేరే పంటల వైపు మరల్చే
ప్రయత్నాలు జరుగుతున్నాయి కారణం వీరు
వాతవర్ణ పరిస్తితులను బట్టి వారి వరి
సాగు మే June నెలలోనే మొదలుపెట్టాలి , ఆ
సమయం లో నీటి అవసరం పెరగటం ఎక్కువ శాతం
భూగర్భ జలాల వినియోగం పై ఆధారపడటం వల్ల , కరెంటు
డీజిల్ సబ్సిడీ భారం ప్రభుత్వాలకు పెనుభారంగా మారింది , అయెతే రాజకీయ కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు భాద్యతలు
కేంద్రం పై నెట్టి కాలం
వెళ్ళదీస్తూ వచ్చారు , అయెతే ఇప్పుడు ఆ భాద్యతలను
రాష్ట్ర ప్రభుత్వాలే
పరిష్కరించుకోవాల్సి ఉంటుంది ,
ఉత్తర కర్ణాటక లో NABARD ఆర్ధిక సహాయం తో రైతులు godown లు కట్టుకునే సౌకర్యం
కలుగచేసినందు వల్ల రైతులు చాలా వరకు వారు పండించిన
ధాన్యాన్ని నూర్పిడి అయిన తరవాత వెంటనే అమ్మకుండా మార్కెట్ లో ధర వచ్చినప్పుడు అమ్ముకుంటూ ఉంటారు ,అలాగే తెలుగు రాష్ట్రాల
రైతులకు కూడా ప్రభుత్వాలు గోడౌన్ ల సౌకర్యం కల్పిస్తే ఉత్పత్తి వినియోగంలో పెద్ద తేడా లేని
రాష్ట్రాల రైతులు భయపడాల్సిన అవసరం లేదు .
ఇట్లు KVK
Chakkagaa vivaricharu
ReplyDelete