Wednesday, 10 September 2014

my tour snaps

వ్యసాయం నష్టమంటూ భూమాతను వదిలి  పట్టణాల వైపు పరుగులు తీస్తున్న  యువత లో వస్తున్న  మార్పుకు నిదర్శనమే  ఈ యువ రైతు, విద్యావంతుడైన శ్రీ యలమంచిలి వాసు గారు (హోస్పేట , కర్ణాటక ) నూతన పద్దతులలో  ఆధునిక యంత్ర పరికరాల  ఉపయోగంతో , ఉద్యానవన పంటలను సాగు చేస్తున్న ఆదర్శ రైతు

నూతన పద్దతులలో  ఆధునిక యంత్ర పరికరాల  ఉపయోగంతో , ఉద్యానవన పంటలను సాగు చేస్తున్న ఆదర్శ రైతు

ఆదర్శ యువ రైతు శ్రీ వాసు

బాసుమతి  విత్తిన చేను (కోడూరు మండలం , నరసింహా పురం గ్రామం లో ) పరిశీలిస్తున్న K V K , శ్రీ D  శ్రీనివాస్ గారు . శ్రీ k.సుబ్బారావు గారు  , శ్రీ  డాక్టర్ కోటేశ్వర్రావు  గారు , మరియు ఇతర రైతులు 

తల్లి తండ్రులే  భారమై వ్రుద్దాశ్రమాలకు  పంపుతున్న  ప్రస్తుత రోజులలో తండ్రి గారి  కాంస్య విగ్రహాన్ని  ప్రతిష్టించి మాతృదేవోభవ పితృదేవోభవ అన్న  భారతీయ సంస్కృతికి  సజీవ ఉదాహరణ  డాక్టర్ కోటేశ్వర్ రావు గారు

బాసుమతి సాగును గురించి తెలుసుకుని  మా వద్ద  విత్తనం తీసుకుని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం , కుందేరు  గ్రామం లో శ్రీ వి . శేషుబాబు గారు పూసా  పంజాబ్ బాసుమతి  1509 , మా సూచనలను అనుసరించి లేత నారు నాటి పొలానికి ఆరుతడులు  మాత్రమే ఇస్తూ నాటిన  పదిహేడు రోజులలో  పదిహేడు కర్రల దుబ్బు  చేయించిన ఆదర్శ రైతు : ఫోన్ :9393818199

పుజ్యనీయులు  శ్రీ పాపారావు గారిని  వారి స్వగ్రామం లో  గుంటూరు జిల్లా  బాపట్ల  మండలం  నరసాయ పాలెం  గ్రామం లో  మిత్రులు కర్రి సుబ్బారావు గారు , శ్రీ D శ్రీనివాస్ గార్లతో కలిసి పత్తి పంట లో  స్వర్ణ యుగం 1970  నుండి 80  వరకు ఒక క్వింటాల్ పత్తి అమ్మి రెండు తులాల బంగారం కొనుకున్న  ఆ  అనుభవాలను వారితోనే పంచుకున్న  మధుర క్షణాలు : 6.9.2014 

స్వాతంత్రం  వచ్చినా  ఎన్నో ప్రణాలికలు  రూపొందించినా , రాజకీయ ప్రాభల్యం కలిగిన ఎ కొంతమంది వ్యక్తులకో తప్ప  మాలాంటి ఇంకా ఎంతో మంది  నిరుపేద మత్స్య కారుల జీవితాలలో  ఎ మాత్రం వెలుగు రాలేదని  వాపోతున్న  చీరాల పక్కన  వాడరేవు గ్రామ మత్స్యకారులు ( మోడీ గారి  ఆదార్  ద్వారా అయినా  ఇలాంటి వారందరికీ రాజకీయాలకు అతీతంగా న్యాయం జరుగుతుందని  ఆశిద్దాం )   

బోయన పల్లి గ్రామం ,  మిడ్జిల్  మండలం , మహాబూబనగర్ జిల్లా లో 10 mw ప్రైవేటు   సోలార్ పవర్ ప్లాంట్ , కరెంటు కొరతతో తల్లడిల్లుతున్న రైతన్నల కష్టాలను తీర్చే దిశగా ఇప్పటికైనా పాలకులు నిర్ణయాలు తీసుకోవడం  సంతోషించాల్సిన విషయం , దేశ సమగ్రాభివ్రుద్దికి మూలమైన విద్యుత్ ఉత్పత్తికి  సౌర శక్తిని  ఉపయోగించి , గుజరాత్ ను ఆదర్శంగా తీసుకుని దేశంలోని అన్ని ప్రభుత్వాలు కదలాలి

నల్గొండ జిల్లా మిరియాల గూడ మండలం పాలూరు గ్రామంలో సురేష్  అనే ఆదర్శ రైతు చేపట్టిన  బాస్మతి సాగు పరిశీలిస్తున్న KVK

No comments:

Post a Comment