వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలతో సేంద్రియ
ఎరువులు
వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలతో సేంద్రియ ఎరువులు ముఖ్యం గా వరిమోళ్ళు , వరిగడ్డి , గోధుమ
, వేరుశనగ పొట్టు , కూరగాయల తోటల్లో వచ్చే వ్యర్థ పదార్థాలు ఎదైనగాని
మొత్తం అన్నీ కలిపి వ్యవసాయ పంటల వ్యర్ధాలు భారత్లో దాదాపు 4 కోట్ల టన్నుల వ్యర్ధాలను
సేంద్రియ పదార్ధంగా మార్చుకో గల్గితే దాదాపు
30 లక్షల టన్నుల N.P.K గా భూమికి అందించే అవకాశాలున్నాయి. రైతులు దీనిపై ద్రిష్టిసారించాల్సిన
అవసరం
ఎంతైనా ఉంది. పత్తి కంప , కంది కంప, జోన్నసోప్ప , మొదలైనవి పూర్వం వంట చెరకుగా
ఉపయోగించినప్పటికీ ఇటీవల కాలంలో పట్టణాలే కాకుండా గ్రామాలో సైతం వంట గ్యాస్
ఉపయోగిస్తూనందు వల్ల ఎక్కువ శాతం
పోలాలోనే వీటన్నిటిని అగ్నికి ఆహుతి చేయటం జరుగుతోంది. అయితే యిటీవల పరిశోధనలో తేలింది ఏమిటంటే అవశేషాలను భూమిలో కలిపి వేసినందు వల్ల భారత దేశం మొత్తం మీద
4 కోట్ల టన్నుల
పంటల అవశేషాల నుండి 25 లక్షల టన్నుల నత్రజని , 4 లక్షల
టన్నుల భాస్వరం , షుమారు 4 లక్షల
టన్నుల పోటాష్ కు
సమానమైన సేంద్రియ పోషకాలు లభ్యమౌతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు . ముఖ్య పోషక
పదార్దాలే కాకుండా సూక్ష్మ పోషక పదార్దాల లభ్యత కూడా మెరుగవుతుందని
శాత్రవేత్తల పరిశోధనలో తేలింది
. మీ మీ భూములలో లభ్యమైయే పంటల వ్యర్ధాలను
తేలికగా భూమిలో కలపటానికి ఇటీవల ప్రవేశ పెట్టిన
రోటోవేటర్ బాగా ఉపయోగపడుతున్న సంగతి మనందరికి తెలిసిందే కొన్ని ప్రాంతాల్లో
నత్రజనిని స్తీరీకరించే మినుము , పెసర , అలసంద , జిగురు గోరుచిక్కుడు
మొదలైన పైరుల సాగు
మరియు అవశేశాల వల్ల కూడా
ఎంతో విలువైన సేంద్రియ పదార్ధాన్ని మనం భూమిలో
చేర్చినందు వల్ల గత 30, 40 సంవత్సరాల
నుండి అధిక రసాయన ఎరువులు వాడినందు
వల్ల భూములన్నీ నిస్సారమై ప్రతి సంవత్సరం రసాయన ఎరువుల మోదాదు ను పెంచితే తప్ప దిగుబడి
రాని పరిస్తితి ఏర్పడింది. అధిక ఎరువుల వినియోగం
వల్ల పంటలపై చీడపీడలు
అధికంగా అసించడంతో క్రిమి సంహారక మందుల వినియోగం పెరిగినందువల్ల కోట్లాది రూపాయల విదేశి
మారక ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడమే కాక పర్యవరణానికి , వినియోగదారుల ఆరోగ్యానికి , ఎంతో హానికారకం
అయింది, మన దేశ వ్యవసాయ ఉత్పత్తులలో కూడా క్రిమిసంహారక అవశేషాల వల్ల ఎగుమతులకు అవరోధం కలుగుతోంది . ఒకనాడు పశువుల పెంపకం చేపట్టి వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలను పశువుల కు మేతగా మేపి
వాటి ద్వారా వచ్చే పశువుల
ఎరువును పొలాల్లో వినియోగించి అతి తక్కువ
ఖర్చు తో సేంద్రియ
పంటలు ఉత్పత్తి చేసి వినియోగదారుల ఆరోగ్యానికీ
పర్యవర్యవరణ కాలుష్యం లేకుండా రైతన్నలు చూడగలిగారు . అయితే అది నిన్నటి మాట ప్రస్తుత పరిస్తితులలో , వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం గ్రామీణ ప్రాంతాల నుండి రైతులు పట్టణాలకు వలస పోవడం వల్ల
గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రైతు
పశువుల పాలన అసాధ్యమైనందున మరియు పశువులలో అధిక పాల ఉత్పత్తినిచ్చే సంతతి పెరిగినందు వల్ల నూ వ్యవసాయంలో యంత్ర పరికరాల
వాడకం పెరిగినందు వల్ల కుడా పశువుల సంఖ్య తగ్గుతూ
వస్తుంది . అది కుడా
వ్యవసాయ ఉత్పతుల అవశేషాల వినియోగం తగ్గడానికి కారణం . యిందు వల్ల ప్రతి రైతు మీ
మీ భుములలోని పంటల అవశేషాలను అగ్ని కి
ఆహుతిచేయ్యకుం డా ( ప్లాస్టిక్ , గాజు పెంకు
, తప్ప )
పంటల అవశేషాలను భూమిలో కలిపి దాన్ని సేంద్రియ పదార్ధంగా మార్చటానికి ప్రయత్నించాలి . చౌక గా దొరికే రాక్
ఫాస్ఫేట్ గాని , సింగిల్
సూపర్ పాస్పేట్ కాని చల్లినందువల్ల
పంటల అవశేషాలు త్వరగా
చివికి సేంద్రియ పదార్థంగా మారి భూములను సారవంతం గా మార్చు తాయి . మన భూముల సారవంతంగా
మారితే తప్ప వ్యవసాయం లాభసాటి గా మరే అవకాసం లేదు . అయితే
ఈనాడు చాలా మంది సాగుదారులు కౌలు రైతులే కావటం , మరుసటి సంవత్సరం ఆ చేను వారికే కౌలు కు
లభిస్తుందో , లేదో తెలియక పోవడం వల్ల
తాత్కాలికంగా రసాయన ఎరువులు
వినియోగించటం వల్ల వారూ నష్ట పోతున్నారు . ఈ విషయాన్ని గమనించి భూస్వాములు కూడా భుసారవంతాన్ని పెంచటానికి సేంద్రియ ఎరువుల
వినియోగించే కౌలు రైతులకు
రాయితీ కల్పించినందు వల్ల సత్పలితాలను
పొందవచ్చు . ఇటీవల పంటల అవశేషాలతో కొన్ని యంత్రాల సాహయంతో తెల్ల బొగ్గు అనబడే
brikets ను తయారుచేసి
వంట చెరకు గా పరిశ్రమలలో
వియోగిస్తున్న విషయం కూడా మనకు
తెలిసిందే . అయినప్పటికి నిరంతరం పెరుగుతున్న జనభా , తరుగుతున్న , సాగు భూమిని దృష్టి లో పెట్టుకున్నప్పుడు భూమి లో సేంద్రియ పదార్ధాన్ని 2 నుంచి 3 శాతానికి పెంచితే
తప్ప రాబోయే రోజులాలో పెరుగుతున్న జనాభా కు ఆహార పదార్ధాలను అందించ
లేమనే విషయాన్ని గమనించి అందుబాటు లో ఉన్న పంటల అవశేషాలను సేంద్రియ పదార్ధంగా మార్చేందుకు రైతులకు తగిన సలహాలు సూచనలు చేస్తూ అందుకు కావలసిన పరికరాలకు పెద్ద రైతు , చిన్న
రైతు అనే తారతమ్యం లేకుండా సబ్సిడీ రేటు పై యంత్ర పరికరాలను ప్రభుత్వం అందించినప్పుడే భూములు సారవంతమై
ప్రజల ఆరోగ్యం , పర్యావరణ కాలుష్యం లేకుండా కాపాడుటమే కాక పరోక్షంగా విదేశి మారక ద్రవ్యాన్ని కూడా
పొదుపు చెయ్యగలం .






