Tuesday, 9 July 2013

గోరుచిక్కుడు సాగులో నా అనుభవాలు



గోరుచిక్కుడు సాగులో నా అనుభవాలు : 

 గత రెండు మూడు సంవత్సరాల నుండి దక్షిణాది రాష్ట్రాలలో జిగురు గోరుచిక్కుడు సాగు గురించి అనేక మంది రైతు సహోదరులలో ఆసక్తి కనపర్చుతున్నారు ఇప్పటికే కొంత మంది అభ్యుదయ  రైతులు జిగురు గోరుచిక్కుడు సాగును చేస్తున్నారు , అయెతే రైతులలో ఈ ఆసక్తి ని చూసి కొంత మంది వ్యక్తులు రకరకాల ప్రకటనలతో రైతులను మభ్య పెడుతున్నారు , ఈ సాగు గత నాలుగుఅయెదు సంవత్సరాలనుండి కడప అనంతపూర్ జిల్లలో కొంత మంది శాస్త్రవేత్తల సహకారంతో పంటను పండించడం ప్రారంభించారు , ధర ఆశాజనకంగా లేకపోవుటవల్ల పెద్దగా ప్రచారంలోకి రాలేదు గత యాభై సంవత్సరాల నుండి రాజస్తాన్ హరియణ గుజరాత్ రాష్ట్రలో పరిశ్రమలు  స్తాపించి గమ్ (జిగురు ) ఉత్పత్తులను తాయారు చేస్తున్నప్పటికి పెద్దగ ధర లేకపోవటం వల్ల  దేశంలోని మిగిలిన రైతుల్లో ఆసక్తిని కలిగించలేక పోయింది , అయెతే 2010-11 నుండి  సహజవాయువు మరియు పెట్రోలియం బావులలో దీని వినియోగం పెరగటం వల్ల గింజల రేటు 15 -20 రూపాయలు ఉన్న కిలో గింజలు 150 నుండి 200 రూపాయలకు పెరిగింది , దీన్ని అదునుగా చేసుకుని కొంత మంది అత్యాశ పరులైన వ్యక్తులు కృత్రిమ కొరతను సృష్టించి రేటు ఇంకా పెరుగుతుంది కనుక ఎవ్వరు రైతులు గింజలను అమ్మవద్దని పత్రికలలో ప్రకటనలు ఇచ్చిన కారణంగా ప్రత్యామ్నాయం దొరకని వినియగోదారులు ఎంత ధర అయినా చెల్లించి జిగురును కొన్నప్పుడు గింజల ధర కిలో 300  నుండి 360 రూపాయలవరకు చేరి ప్రపంచ వార్తా సంస్తలను ఆకర్షించి విపరీతమైన ప్రచారం పొందింది దీంతో కొంతమంది వ్యక్తులు  రైతులను మభ్యపెడుతూ ప్రకటనలు జారిచేస్తూ కిలో విత్తనాన్ని 1000 రూపాయలనుండి 300 రూపాయలవరకు విత్తనాన్ని అమ్ముతూ, పండిన పంట క్వింటాలకు 10 నుండి 20వేల మధ్య  మేమే  కొంటామని ప్రకటించి సాగు చేయించారు అయెతే ప్రస్తుతం రైతుల వద్ద  ఆంధ్రప్రదేశ్ లో షుమారు 10 నుండి 15వేల క్వింటళ్ళూ గింజలు పండించిన రైతులు కోనోగోలుదారులకోసం ఎదురు చూస్తున్నారు  అయెతే మార్కెట్లో అవసరానికన్నా ఉత్పత్తి ఎక్కువైన కారణంగా ధర 6 నుండి 7 వేలకు పడి పోయింది,
  పంట ఉత్పత్తి కర్చు 1500 నుండి 2000 రూపాయలు  ఉన్నందువల్ల వర్షాధరితంగా  పండించే రైతులు పంటను మార్కెట్లో అమ్ముతున్నారు , అయెతే ఎక్కువ ధరను ఆశిచిన రైతులు నిరాశకు చెందుతున్నారు , వాస్తవానికి ఈ వినియోగం పెరగాలన్నా మెట్ట   రైతులకు మేలు జరగాలన్నా ధర 5 నుండి 8 వేల మధ్య  స్తిరంగా ఉంటె , వినియోగం పెరిగి ఇప్పుడున్న ప్రపంచ మార్కెట్లో భారతదేశపు  80 % వాట నిలుపుకోగాలుగుతాం , కనుక రైతుసోదరులుంతా ఆహర  పంటలకు అనుకూలం కాని భూముల్లో ఈ పంటను సాగు చేసి ఆదాయాన్ని పొందవచ్చు

సాగు వివరాలు :

వర్షాధారిత భూములు భూగర్భ జలాలతో సాగు చేసే భూములు అనగా చాల మంది రైతులు బోరులు కింద వేసవి లో కూడా వరి  పంటను సాగు చేస్తూ ఉంటారు పంట చివరి దశలో బోర్లు ఎండిపోయి కానీ కరంటు కొరత వల్ల కానీ చాల మంది రైతులు పంట నష్ట పోవడం పంటను కాల్చి వెయ్యడము మనము టీవీల్లో పేపర్లలో చూస్తూ ఉంటాము ఈ పరిస్తితుల వలన రైతు నష్టపోకుండా ఉండాలి అంటే అతి తక్కువ నీటి తో పండే గోరు చిక్కుడు, కొర్ర పంట  70 రోజులలో వచ్చేటటువంటి  పై పంటలును సాగు చేసుకోవడం వల్ల స్తిరమైన ఆదాయం రైతులు పొందగలరు , రెండో పంటగా గోరుచిక్కుడు సాగు పరిమిత నీటి వనరులకింద జనువరి రెండో వారము నుండి సాగు చేస్తే మంచి దిగుబడి పొందవచ్చు , ప్రస్తుత పరిస్తితుల లో సాగు కర్చు పెంచకుండా తగ్గించడానికి ప్రయత్నం చెయ్యాలి   గోరుచిక్కుడు లో రైతు స్వంతగా పండించిన విత్తనాన్ని వాడుకోవచ్చు 
 పొలాన్ని తయారు చెయ్యడంలో ఎక్కువ సార్లు దుక్కి దున్నవల్సిన అవసరం లేదు , ఒక్క సాలు దున్ని రెండోసారి రొటొవెటొర్ తో దున్నితే సరిపోతుంది విత్తనాన్ని సాలు పద్దతి ద్వారా విత్తితే ఖర్చు  తగ్గుతుంది , ఎరువుల విషయం లో కూడా ఈ పంటకు ఎక్కువగా  రాసాయనిక ఎరువులను వాడనవసరం లేదు ,  భూసారాన్ని బట్టి  ఎరువుల మోతాదు నిర్ణయించాల్సి  ఉంటుంది  , పొలంలో మొక్కల సంఖ్య సక్రమంగా ఉండేట్టు చూడాలి , సాలు నుండి సాలుకు తొమ్మిది నుంచి పన్నిండు అంగుళాల వరకు నీటి లభ్యత, భూసారాన్ని బట్టి నిర్ణయించాల్సి  ఉంటుంది, చాల మంది రైతులు 30 అంగుళాలు అంతకన్నా ఎక్కువ దూరం లో కూడా విత్తినట్టు చెప్తున్నారు  ఈ దూరం అతి తక్కువ వర్షపాతం కలిగిన రాజస్తాన్ లాంటి ఎడారి ప్రాంతం లో విత్తుతారు 
 ముఖ్య గమనిక :
చాలా మంది రైతులు SINGLE STEM VARIETY, 5 కే జి లు విత్తు తున్నట్టు తెలుస్తోంది , 9 నుండి 10 కే జి లు  విత్తి తేనే దిగుబడి బాగా వస్తుంది 

 


No comments:

Post a Comment