Sunday, 28 July 2013

వివిధ ప్రాంతాలనుండి వచ్చిన రైతులకు సూచనలు ఇస్తూ ........




BASMATI VARITIES GROWN BY ME

Many farmers from various parts of our country like, Tamilnadu, maharastra and gujarat are asking me about Basmati varieties and expressing their doubts about the cultivation in our region, 
I would like to make it very clear my dear farmer friends , any paddy can be grown anywhere in India, it is only a misconception among farmers that is preventing them to go for growing  High  profit earning  crops like basmati etc...
I have been growing Various Basmati varieties from the past 10 years at my farm lands situated in Raichur district, and not only me many farmers in Karnataka and Andra pradesh are successfully growing the Basmati varieties from the past few years , North Indian Farmers have brought GI for the basmati varieties, but a very interesting fact is we in south India are annually consuming around 30 Lacs Metric tons, hence we can grow the basmati varities and that crop can be used for our own domestic consumption labeling it as long grain aromatic rice , where both farmer and consumer will be equally benefited, also our country also can earn additional foreign exchange.

The following varieties are being successfully grown by me and are available with me 
Variety name            Duration in days          yield per acre (appx)
 1, pusa basmati-1        130-140                    30 Quintals
 2, PS-4(1121)              125                           20 Quintals 
 3, PS-5 (2511)             130                           30 Quintals
 4, PS-6 (1401)             125-130                   28 Quintals
 5, 1509                        120                           25 Quintals
  
1121 variety is a world wide famous variety and is earning our country valuable foreign currency 
recently released variety 1509 is also a very good variety with better yield 

one special feature of these basmati varieties is , The cost of cultivation is very low compare to our sona masoori cultivation cost 
       

Monday, 22 July 2013

మేలుకో రైతన్నా ..................

Broadcasting date : 4.9.2013,variety: WGL 32100, 39th day crop
,
14th day వరి విత్తనాన్ని నేరుగా చల్లి వీడెర్  తో  సాళ్ళు గా  చేసిన  రైతు విగ్న్యని శ్రీ దశరద రావు . 9440484990
వరి విత్తనాన్ని నేరుగా చల్లి వీడెర్  తో  సాళ్ళు గా  చేస్తున్న రైతు విగ్న్యని శ్రీ దశరద రావు . 9440484990
మాతృ  దేవోభవ       పితృ దేవోభవ       ఆచార్య దేవోభవ ....  అనేది  పెద్దల సూక్తి , అయెతే పుట్టిన దగ్గరనుండి చనిపోయే వరకు ఆహారాన్ని  అందిస్తున్న రైతును , రైతు దేవోభవ  అని ఎందుకు  అనకూడదు ???
కనుక   మాతృ  దేవోభవ       పితృ దేవోభవ     రైతు దేవోభవ       ఆచార్య దేవోభవ  అని  అన్నదాత  ఋణం తీర్చుకోవచ్చు కదా 


2012 లో  45 కంపనీలు  గోరుచిక్కుడు ధరలను కృత్రిమంగా పెంచి భారి గా లాభాలు పొంది రైతులు ను తీవ్రంగా నష్ట పరిచినందుకు గాను భారత ప్రభుత్వ దరియాప్తు  సంస్త  ఆ నలభై  అయెదు సంస్త ల పై వంద  కోట్ల జరిమానా విధించాలి అని నిర్ణయించింది ......  లక్షలాది మంది రైతులు  ఆ ధర వస్తుంది అని ఆశించి  అమ్ముకోలేక తీవ్రంగా నష్ట పోయారు ...
 source :http://www.thehindubusinessline.com/industry-and-economy/agri-biz/guargum-seed-price-surge-fmc-set-to-impose-rs-100cr-penalty-on-cartel/article5164488.ece

The Forward Markets Commission (FMC) is set to impose a penalty of Rs 100 crore on a cartel which has been found to be behind the surge in guarseed and guargum prices on futures exchanges to record high last year.

Guargum prices had soared to over Rs 1 lakh a quintal and guarseed to over Rs 30,000 in March last year, forcing the commission, which regulates commodities markets in the country, to suspend futures in both.

An official of the FMC said that the Government will be taking action based on a report submitted to the Consumer Affairs Ministry in October last year, on the unusual price movement.

The report had found fault with at least 45 traders.

Responding to question on the report, the official, who did not wish to be identified, said: “The Government is taking action on the report. Notices have been issued and soon, Rs 100 crore penalty will be imposed on the cartel found to be behind this.”





పప్పు గింజల సాగు : 25.7.2013
వరి నాట్లు ఆయెన తరువాత గట్ల పై పెసర మినుము కంది విత్తటం కొంత కాలం క్రిందట చాల మంది రైతు సోదరులు చేసేవారు , అయెతె ఇటీవల ఈ పద్దతిని పూర్తిగా మర్చిపోయి కేవెలం వరి సాగు మీదే ద్రిష్టి పెట్టి మిగిలిన ఉత్పత్తులను మార్కెట్ లో కొనుగోలు చెయ్యటకు అలవాటు పడి రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు  ఎ మాత్రం అవకాశం ఉన్నా పప్పు గింజలు కూరగాయలు , పాడి , పెరటి కోళ్ళ పెంపకం మొదలైనవి  విధానాలను ఆచరించినంత కాలం రైతు ఆర్ధిక స్థితి బాగుండేది , పాత పద్దతులను మర్చి కేవలం ఒకే పంటను పండించి మిగిలిన అన్ని వ్యసాయ ఉత్పత్తులను మార్కెట్ లో కొనే దుస్స్తితి వల్ల ఈ నాడు రైతు ఆర్ధికంగా ఇబ్బందుల పాలవుతున్నాడు ఈ సమస్య కు పరష్కారం గా ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో చిన్న పప్పుల మిల్లులు స్తాపించి ఎంత చిన్న పరిణామంలో అనగా 20 కిలోలు మీరు పండించిన ఎ పప్పు  గింజలనైన ఇచ్చి మీకు కావాల్సిన పప్పు ను అనగా పెసర , మినుము కంది మొదలైన పప్పులను తెచ్చుకునే  ఏర్పాటు ఆదర్శ రైతులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది , కనుక విద్యావంతులైన యువ రైతులు పై విధంగా చిన్న పపు తయారి మిల్లును ప్రారంభించి ఏ రైతైనా తను పండించిన పప్పు గింజలను ఇచ్చి వారి కుటుంబ అవసరానికి కావాల్సిన పప్పులను పొందే విధంగా ఏర్పాటు చేసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఎంతో మేలు చేకూర్చిన వారు ఆవుతారు , అలాగే ఇద్దరు ముగ్గురు విద్యావంతులైన యువకులకు జీవనోపాది కలుగుతుంది , కేవలం వస్తు మార్పిడి అయేనందున  ఇది ఒక మంచి విధానంగా రైతులందరుకు అందుబాటులోకి వస్తే ప్రతి రైతు పప్పు గింజల పంట పై ఆసక్తి పెరిగి , పప్పు గింజలను పండిస్తూ కల్తి లేని మంచి పప్పులను పొందటమే కాకుండా ఈనాడు  ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించి పప్పులను దిగుమతి చేసుకునే స్థితి నుండి బైట పడగలం కనుక యువ రైతు మిత్రులారా ఈ విషయం పై మీకు ఏమైనా సందేహాలు ఉంటె సాయంత్రం 7 గంటల నుండి 9 గంటలలోపు  ఈ దిగువ తెలిపిన ఫోన్ లో నన్ను సంప్రదించగలరు : 09448190919


వరి సాగు లో కర్చు తగ్గించే నూతన విధానాలు : 24.7.2013
నానాటికి ఎక్కువ ఔతున్న  కృషి కార్మికుల కొరత  పెరుగుతున్న ఎరువుల ధర , దిసల్  ధర , అలాగే తరుగుతున్న బియ్యం తలసరి వినియోగం , ప్రభుత్వాల జనాకర్షక ఆర్ధిక విధానాల వల్ల  పరోక్షంగా వరి రైతు  నష్టపోతున్నాడు .     పరిణామాల  నేపధ్యం  లో రైతు తన సంప్రదాయక సాగు విధానాలను వీడి , కర్చు తగ్గే నూతన విధానాల అన్వేషణ మరియొ వాటి ఆచరించకపోతే   నష్టాల ఊబి లో కూరుకు పోవాల్సి ఉంటుంది   చిన్న కమతాల  వ్యసాయం లాభసాటి కాదని ప్రభుత్వాలు కార్పొరేట్ పెద్దలకు భూములను కట్టబెట్టే పరిస్థితులు కనబడుతున్నాయ కనుక మిత్రులారా, వ్యసాయాన్ని  లాభసాటిగా మార్చుకునే దిశలో మనం ప్రయత్నం చెయ్యకపోతే మన భూముల్లో మనమే కూలీలుగా మారే పరిస్థితులు తప్పవు  వరి సాగు లో సాంప్రదాయక పద్దతులైన నారు పెంచి దమ్ము చేసి నాటు వేసే విధానాన్ని మార్చి నేరు గా విత్తే పద్ధతి వల్ల ఎకరాకు 4 నుండి 5 వేలవరకు కర్చు తగ్గించి , 5 నుంచి 10 బస్తాల దిగుబడి పెంచడమే కాకుండా ఎరువులు పురుగుమొందుల  వినియోగం కూడా బాగా తగ్గించే ఈ నూతన విధానాన్ని సందేహాలకు తావు ఇవ్వకుండా ప్రతి రైతు ఆచరించితే వరి పంటలో అత్యదిక   లాభాలను పొందవచ్చు అనే దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు , కావాల్సిందల్లా నూతన విధానాలను ధైర్యంగా చేపట్టమే .


గోరుచిక్కుడు రైతులకు విశేష సూచన: 23. 7. 2013
గోరుచిక్కుడు సాగు దేశవ్యాప్తంగా బాగా పెరుగుతున్నదున , కేవలం బీడు భూములు ఇతర పంటలకు అనుకూలం కాని భూములలో మాత్రమే తక్కువ కర్చుతో ఉత్పత్తి చేస్తే , ధర తగ్గినా నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అవకాసం ఉన్న అన్ని ప్రాంతాలలో ఈ పంట సాగు గణనీయంగా పెరుగుతోంది , కనుక రైతు సోదరులు ఈ పరిస్తితులను గమనించవలసింది గా కోరుతూ , సాధ్యమైనంత వరకు గోరుచిక్కుడు మిశ్రమ పంటగా , అనగా కంది, సజ్జ , కొర్ర , పొద్దుతిరుగుడు మొదలైన పంటలతో పండించ గలరు.  



బాస్మతేతర బీయ్యంలో బారు రకాల కు పెరగనున్న ఎగుమతి అవకాశం :

రాయచూరు 23.7.2013
వరి సాగు చేసే రైతులకు దేశ వ్యాప్తంగా మంచి వర్షాలు కురుస్తునందున , వరి సాగు విస్తీర్ణం బాగా పెరుగుతుంది ,ఎగుమతికి ప్రపంచ వ్యాప్తంగా బాగా అవకాశం ఉన్న బారు రకాలు అనగా ఐ అర్ 64, ఐ అర్ 36, ఎమ్ . టి . యు 1010, రకాలను పండించినందున , సన్న రకాలతో పోలిస్తే  ఉత్పత్తి కర్చు తక్కువ పంట దిగుబడి ఎక్కువ , రైతుకు లాభదాయకంగత సంవత్సరం సన్న రకాలు దక్షిణాదిన పంట తక్కువ అయనందున వ్యాపారస్తులు ఉత్తరాది రాష్ట్రాలయన ఉత్తరప్రదేశ్ , బీహార్ , ఉత్తరాఖండ్ మహారాష్ట్ర  నుండి ధాన్యం మరియు బీయ్యం అత్యదిక ధరలకు  దిగుమతి చేసుకున్నందున, సంవత్సరం అక్కడి రైతులు సన్న రకాల సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు , కావున ప్రపంచవ్యాప్తంగా  మన దేశం నుండి ఎగుమతి అయ్యే బస్మతిఎతర రకాలలో సన్న బీయ్యం 10 నుండి 15 % అనేది చూసినప్పుడు , ప్రసుత పరిస్తితులలో బారు రకాలాకే  ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది ,ఈ విషయాన్నీ రైతు సోదరులు గమనించగలరు 

Sunday, 21 July 2013

వ్యసాయం లో ప్రయోగాలు EXPERIMENTS IN AGRICULTURE

BASMATI PUSA-5, USING  STOLLER PRODUCTS @ MADAGIRI CAMP,MANVI, TALUKA, RAICHUR DIST, KARNATAKA STATE, INDIA

RED GRAM CROP USING STOLLER PRODUCTS
BASMATI PADDY FIELDS (JUST 5KMS FROM BAY OF BENGAL)OF DR KOTESHWAR RAO MADDINENI, NARASHIMHAPURAM, KRISHNA DIST, AP, INDIA
ME,  WITH RENWAL FARMERS @ JAIPUR, RAJASTHAN STATE, INDIA
TRADITIONAL FARMING OF GUAR, WITH LOW YIELD AND LESS RETURNS  @ RAJASTHAN

TRADITIONAL FARMING OF GUAR, WITH LOW YIELD AND LESS RETURNS  @ RAJASTHAN
STOLLER PRODUCTS USED ON PADDY CROP, PUSA SUGANDHA-5 , EXCELLENT TILLERING AND BUMBER YIELD IS EXPECTED, WILL UPDATE ABOUT THE YIELD , @MADAGIRI CAMP, RAICHUR DIST, KARNATAKA STATE, INDIA

STOLLER PRODUCTS USED IN RED GRAM CROP OF SRI MADHAV RAO @ MANVI, RAICHUR DIST, KARNATAKA STATE, INDIA
DIRECT SOWING (DSR) PADDY CROP , WITH VERY LOW INVESTMENT AND GOOD GROWTH BY USE OF STOLLER`S PRODUCTS , FARMERS SRI G HANUMANTH RAO, SRI KVK RAO AND SRI K SHIVRAM PRASAD @ MADAGIRI CAMP , PIC DATED 29.9.2013
85 DAYS RED GRAM CROP GROWN USING  STOLLER`S FOLLIEAR SPRAYS, INSPITE OF HEAVY RAINS, EXCELLENT GROWTH, THANKS TO STOLLER`S PRODUCTS FOR THIS WONDERFUL GROWTH , SRI MADHAV RAO AND SRI K V KRISHNA RAO , PIC DATED 29.9.2013
RED GRAM  CROP OF SRI MADHAVRAO,65 DAYS OLD HYBRID RED GRAM GROWN BY THE USE OF STOLLER FOLLIEAR SPRAYS. phone no: 9449020990

ముప్ఫై రోజుల గ్వార్ పంటను కొలుస్తున్న KVK
హైదరాబాద్ నుండి వచ్చిన శాస్త్రవేత్తలతో KVK
RED GRAM CROP GROWN BY USING BIO FERTILISERS

NORMAL REDGRAM CROP , SAME AGE , WITHOUT BIO FERTILISER

EQULAPTYUS GROWN IN FIELDS AS NATURAL BIO-DRAIANAGE

ORGANIC GREEN LEAFY VEGETABLES CULTIVATION (KASURI MENTI)
ఆరోగ్యప్రదాయని ములగ 
ఆకు, పువ్వులు, కాయలు  ఆహార వినియోగానికి అత్యుతమ పోషకాలు కలిగి మన పెరట్లో పెంచుకోదగిన చెట్టు ఈ ములగ  
10TH DAY OLD ORGANIC GUAR CROP (FIELD TRAILS) PIC DT:15.8.13
FIELD TRAIL :
CROP NAME : GUAR , DATE OF SOWING : 5.8.2013,  VARIETY : HGC 365
ROW TO ROW DISTANCE : 12 INCHES , PLANT TO PLANT : 8 INCHES 

GROWN EXCLUSIVELY USING LIQUID ORGANIC SUPPLEMENTS , SPECIALLY FORMULATED BY ME........ WILL UPDATE MORE ABOUT THIS SOON.... DEAR FARMERS 

Tuesday, 9 July 2013

గోరుచిక్కుడు సాగులో నా అనుభవాలు



గోరుచిక్కుడు సాగులో నా అనుభవాలు : 

 గత రెండు మూడు సంవత్సరాల నుండి దక్షిణాది రాష్ట్రాలలో జిగురు గోరుచిక్కుడు సాగు గురించి అనేక మంది రైతు సహోదరులలో ఆసక్తి కనపర్చుతున్నారు ఇప్పటికే కొంత మంది అభ్యుదయ  రైతులు జిగురు గోరుచిక్కుడు సాగును చేస్తున్నారు , అయెతే రైతులలో ఈ ఆసక్తి ని చూసి కొంత మంది వ్యక్తులు రకరకాల ప్రకటనలతో రైతులను మభ్య పెడుతున్నారు , ఈ సాగు గత నాలుగుఅయెదు సంవత్సరాలనుండి కడప అనంతపూర్ జిల్లలో కొంత మంది శాస్త్రవేత్తల సహకారంతో పంటను పండించడం ప్రారంభించారు , ధర ఆశాజనకంగా లేకపోవుటవల్ల పెద్దగా ప్రచారంలోకి రాలేదు గత యాభై సంవత్సరాల నుండి రాజస్తాన్ హరియణ గుజరాత్ రాష్ట్రలో పరిశ్రమలు  స్తాపించి గమ్ (జిగురు ) ఉత్పత్తులను తాయారు చేస్తున్నప్పటికి పెద్దగ ధర లేకపోవటం వల్ల  దేశంలోని మిగిలిన రైతుల్లో ఆసక్తిని కలిగించలేక పోయింది , అయెతే 2010-11 నుండి  సహజవాయువు మరియు పెట్రోలియం బావులలో దీని వినియోగం పెరగటం వల్ల గింజల రేటు 15 -20 రూపాయలు ఉన్న కిలో గింజలు 150 నుండి 200 రూపాయలకు పెరిగింది , దీన్ని అదునుగా చేసుకుని కొంత మంది అత్యాశ పరులైన వ్యక్తులు కృత్రిమ కొరతను సృష్టించి రేటు ఇంకా పెరుగుతుంది కనుక ఎవ్వరు రైతులు గింజలను అమ్మవద్దని పత్రికలలో ప్రకటనలు ఇచ్చిన కారణంగా ప్రత్యామ్నాయం దొరకని వినియగోదారులు ఎంత ధర అయినా చెల్లించి జిగురును కొన్నప్పుడు గింజల ధర కిలో 300  నుండి 360 రూపాయలవరకు చేరి ప్రపంచ వార్తా సంస్తలను ఆకర్షించి విపరీతమైన ప్రచారం పొందింది దీంతో కొంతమంది వ్యక్తులు  రైతులను మభ్యపెడుతూ ప్రకటనలు జారిచేస్తూ కిలో విత్తనాన్ని 1000 రూపాయలనుండి 300 రూపాయలవరకు విత్తనాన్ని అమ్ముతూ, పండిన పంట క్వింటాలకు 10 నుండి 20వేల మధ్య  మేమే  కొంటామని ప్రకటించి సాగు చేయించారు అయెతే ప్రస్తుతం రైతుల వద్ద  ఆంధ్రప్రదేశ్ లో షుమారు 10 నుండి 15వేల క్వింటళ్ళూ గింజలు పండించిన రైతులు కోనోగోలుదారులకోసం ఎదురు చూస్తున్నారు  అయెతే మార్కెట్లో అవసరానికన్నా ఉత్పత్తి ఎక్కువైన కారణంగా ధర 6 నుండి 7 వేలకు పడి పోయింది,
  పంట ఉత్పత్తి కర్చు 1500 నుండి 2000 రూపాయలు  ఉన్నందువల్ల వర్షాధరితంగా  పండించే రైతులు పంటను మార్కెట్లో అమ్ముతున్నారు , అయెతే ఎక్కువ ధరను ఆశిచిన రైతులు నిరాశకు చెందుతున్నారు , వాస్తవానికి ఈ వినియోగం పెరగాలన్నా మెట్ట   రైతులకు మేలు జరగాలన్నా ధర 5 నుండి 8 వేల మధ్య  స్తిరంగా ఉంటె , వినియోగం పెరిగి ఇప్పుడున్న ప్రపంచ మార్కెట్లో భారతదేశపు  80 % వాట నిలుపుకోగాలుగుతాం , కనుక రైతుసోదరులుంతా ఆహర  పంటలకు అనుకూలం కాని భూముల్లో ఈ పంటను సాగు చేసి ఆదాయాన్ని పొందవచ్చు

సాగు వివరాలు :

వర్షాధారిత భూములు భూగర్భ జలాలతో సాగు చేసే భూములు అనగా చాల మంది రైతులు బోరులు కింద వేసవి లో కూడా వరి  పంటను సాగు చేస్తూ ఉంటారు పంట చివరి దశలో బోర్లు ఎండిపోయి కానీ కరంటు కొరత వల్ల కానీ చాల మంది రైతులు పంట నష్ట పోవడం పంటను కాల్చి వెయ్యడము మనము టీవీల్లో పేపర్లలో చూస్తూ ఉంటాము ఈ పరిస్తితుల వలన రైతు నష్టపోకుండా ఉండాలి అంటే అతి తక్కువ నీటి తో పండే గోరు చిక్కుడు, కొర్ర పంట  70 రోజులలో వచ్చేటటువంటి  పై పంటలును సాగు చేసుకోవడం వల్ల స్తిరమైన ఆదాయం రైతులు పొందగలరు , రెండో పంటగా గోరుచిక్కుడు సాగు పరిమిత నీటి వనరులకింద జనువరి రెండో వారము నుండి సాగు చేస్తే మంచి దిగుబడి పొందవచ్చు , ప్రస్తుత పరిస్తితుల లో సాగు కర్చు పెంచకుండా తగ్గించడానికి ప్రయత్నం చెయ్యాలి   గోరుచిక్కుడు లో రైతు స్వంతగా పండించిన విత్తనాన్ని వాడుకోవచ్చు 
 పొలాన్ని తయారు చెయ్యడంలో ఎక్కువ సార్లు దుక్కి దున్నవల్సిన అవసరం లేదు , ఒక్క సాలు దున్ని రెండోసారి రొటొవెటొర్ తో దున్నితే సరిపోతుంది విత్తనాన్ని సాలు పద్దతి ద్వారా విత్తితే ఖర్చు  తగ్గుతుంది , ఎరువుల విషయం లో కూడా ఈ పంటకు ఎక్కువగా  రాసాయనిక ఎరువులను వాడనవసరం లేదు ,  భూసారాన్ని బట్టి  ఎరువుల మోతాదు నిర్ణయించాల్సి  ఉంటుంది  , పొలంలో మొక్కల సంఖ్య సక్రమంగా ఉండేట్టు చూడాలి , సాలు నుండి సాలుకు తొమ్మిది నుంచి పన్నిండు అంగుళాల వరకు నీటి లభ్యత, భూసారాన్ని బట్టి నిర్ణయించాల్సి  ఉంటుంది, చాల మంది రైతులు 30 అంగుళాలు అంతకన్నా ఎక్కువ దూరం లో కూడా విత్తినట్టు చెప్తున్నారు  ఈ దూరం అతి తక్కువ వర్షపాతం కలిగిన రాజస్తాన్ లాంటి ఎడారి ప్రాంతం లో విత్తుతారు 
 ముఖ్య గమనిక :
చాలా మంది రైతులు SINGLE STEM VARIETY, 5 కే జి లు విత్తు తున్నట్టు తెలుస్తోంది , 9 నుండి 10 కే జి లు  విత్తి తేనే దిగుబడి బాగా వస్తుంది 

 


Monday, 8 July 2013

My awards

Receiving FELLOWSHIP AWARD From IARI, New delhi

PROGRESSIVE FARMER AWARD

KRISHI PANDIT AWARD

RECEIVING INDUSTRIAL ACHIEVEMENT AWARD

RECEIVING FARMER SCIENTIST AWARD FROM HONORABLE AGRICULTURE MINISTER SHRI SHARAD PAWAR JI

RECEIVING PROGRESSIVE FARMER AWARD

RECEIVING AWARD FOR "SRI" DEVELOPMENT

RECEIVING "KRISHI PANDIT" AWARD FROM HONORABLE CHIEF MINISTER OF KARNATAKA 

FORMER MEMBER RESEARCH ADVISORY COMMITTEE DRR HYDERABAD

FELLOWSHIP AWARD