వ్యవసాయ ఉత్పత్తుల ధరల పతనం , కారణాలు :
బూమికి సీలింగ్ ఉంది , కాని డబ్బుకు సీలింగ్ లేదు
, చరాస్తులకు సీలింగ్ లేదు , బంగారానికి అంతకంటే సీలింగ్ లేదు , శ్రిమంతులంతా వారి సంపదలో
నాలుగోవ వంతు బంగారం నిలవగా మారుస్తున్నట్టు తెలుస్తుంది , అందుకోసం కోట్లాది రూపాయల బంగారం
దిగుమతి తో విదేశీ మారక ద్రవ్య కొరత
తో విలవిల లాడుతున్న కేంద్ర ప్రభుత్వం , విదేశీ మదుపు దారుల
కోరికలుకు అనుగుణంగా భారత దేశంలో ఆహార పదార్థాల
ద్రవోల్బణo పెరకకుండా కొన్ని కఠిన
చర్యలు తీసుకోవాల్సి వస్తుంది , కనుక
విదేశీ వస్తువుల వినియోగం ఎంతగా తగ్గించుకుంటే అంతగా దేశం స్వావలంబన సాధిస్తుంది , ఈనాడు రైతుల చేతుల్లో ఉన్నది
ఉత్పత్తి కర్చును ఎంతమేరకు సాధ్యమైతే అంత మేరకు తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలి ,
ఎరువులు పురుగు మందులు దిగుమతులను తగ్గించుకునే లా సాంప్రదాయ పద్దతులలో సేంద్రియ
వ్వసాయం వైపు మళ్ళి ఉత్పత్తి కర్చును బాగా తగ్గించినప్పుడే రైతు
అప్పులపాలు కాకుండా ఉంటాడు , వ్యవసాయాన్ని వదిలి ఈ దేశంలో ఉన్న 80 కోట్ల
మంది వ్యవసాయ దారులకు ప్రత్యామ్న్యాయం చూసుకోవడం
ఆచరణ సాధ్యం కాని విషయం, ప్రతి వృత్తిలోను
కష్టాలు నష్టాలు అనివార్యం ,
అయేనప్పటికి వారంతా ధైర్యంగా
ముందుకు సాగుతున్నారే కాని ఆత్మహత్యలు చేసుకోవడంలేదు కనుక రైతు సోదరులారా
సాటి రైతు సోదరులకు ధైర్యాన్ని చెప్పడం ,
మీకు తెలిసిన విధంగా వారిని ఓదార్చడం
చెయ్యాలి. మన రైతులు ఉత్పత్తి చేసిన స్వదేశీ
ఉత్పత్తులనే ఉదాహరణకు కొబ్బరి నీరు
, మజ్జిగ , నిమ్మరసం , పళ్ళ రసాలు వాడుతూ
సాటి రైతులకు సహకరిద్దాం ,
స్వదేశీ ఉత్పత్తుల వినియోగం తోనే మన
సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది , వ్యవసాయ ఉత్పత్తులకు అధిక రేట్ ఆశించి నిరాశ పడవద్దు
, మన మన ఉత్పత్తులను నేరుగా
వినియోగ దారుడికి అందించే
మార్గాన్ని ఆచరిద్దాం

