Wednesday, 25 June 2014

దొంగల భీభత్సం .... తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దొంగల భీభత్సం .... తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
ఇటీవల కాలం లో దొంగల దోపిడీ రోజు రోజు విపరీతంగా పెరుగుతోంది ,సామాన్యుడి నుండి  పోలీస్ , రాజకీయ నాయకుల మరియు న్యాయమూర్తుల ఇళ్ళ లోను  , విశ్రాంత మిలటరీ అధికారుల ఇళ్ళలోనూ  . నగల దుకాణాలలో , ఆఖరికి దేవాలయాల్లో కూడా నిర్భీతిగా దోపిడిలు  జరుగుతున్న  విషయం మనందరికీ  తెలిసిన విషయమే , అయెతే  దొంగల బారినుండి  మనల్ని మనం  రక్షించు కోవడం లో మన భాద్యత కూడా చాలా ఉంది , అందుకు  తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి  రాయచూరు నేతాజీ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్  శ్రీ చంద్రశేకర్ గారు నిన్న , అనగా 25.6.14 న  జన జాగృతి  సమావేశం లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను  గూర్చి  అనేక విషయాలను తెలియజేసారు , కేవలం వెయ్యి  మంది ప్రజలకు ఒక పోలీస్ వంతున ఉన్న ఈ తరుణం లో ప్రజలు కూడా ఈ దొంగతనాలను అరికట్టడానికి సహకరించవలసిందిగా కోరుతూ  , అనుమానాస్పద వ్యక్తులు  వీధుల్లో తిరుగుతూ ఉంటె పోలీసులకు తెలియజేయ్యవలిసిందిగా  చెప్పారు.
అయెతే  నేను తెలియజేసేది ఏంటి అంటే  ,
 ప్రతి ఇంటికి  తప్పనిసరిగా  CC టీవీ  కెమెరాలు అమర్చుకోవాలి ,
అలాగే  కనీసం మీ పక్క ఇంటి వారి ఫోన్ నెంబర్  మీ దగ్గర ఉండాలి ,
siren  అలారం అమర్చుకోవాలి
మెయిన్ డోర్స్  కి ఇనుప గ్రిల్ డోర్ , దాని తాళం చెవి లోపలి ఉండేటట్టు  అమర్చుకోవాలి
అపరిచిత సేల్స్ గర్ల్స్ బాయ్స్  ని  వస్తువులు కొనడానికి  పిలవకండి
బాగా తెలిసిన , లేక  పూర్తీ  వివరాలు ఫోటో  ఉన్న పని మనిషి ని పని లో పెట్టుకోండి
పనిమనుషులకు  తెలిసేలా  మీ ఇంట్లో నగలు అవి పెట్టుకోకండి .
Theft ఇన్సురన్సు  తప్పనిసరిగా చేయించు కుంటే  మంచిది .

ఇటువంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు  తీసుకుంటే  , మనం దొంగల బారినుండి  బైట పడగలం
జై  హింద్.

Wednesday, 18 June 2014

el nino వచ్చిన సందర్బం లో........



ఈ సంవత్సరం రైతులకు పరిక్షా సమయం , el nino  వల్ల  అతి వృష్టి  అనావృష్టి  తప్పదు అనిపిస్తుంది , రైతులు ఉత్పత్తి కర్చును తగ్గిస్తూ  స్వల్పకాలిక రకాల్నే ఎన్నుకుని పంటలను పండించే ప్రయత్నం చెయ్యాలి వరి లో నేరుగా విత్తే విధానాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో కొంత మంది ఆచరిస్తున్నారు , దీని వల్ల ఎకరానికి అయిదు నుండి ఆరు వేలు రూపాయలు కర్చు తగ్గటమే కాకుండా దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంది , అలాగే కొర్రలు రాగులు ఒకప్పటి పేద వాని ఆహరం ఈనాడు ఆరోగ్యాన్ని కాపాడే ఆహరం గా చాలా మంది గుర్తించి ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా ఈ రోజు స్పెషల్ అని బోర్డు పెట్టి మరి అందిస్తున్నారు , కనుక ఈ పంటలను కూడా పండించ వచ్చు .

గోరుచిక్కుడు ధర మరియు పంట విస్తీర్ణం ...



ఆత్మీయ రైతు సోదరులకు నమస్కారం ...
జూన్ 19 వ తేది వచ్చినా  దేశం లో చాలా ప్రాంతాలలో  వర్షం జాడ లేదు , ఎండల తీవ్రత విపరీతంగా పెరుగుతుంది , గత వారం నేను గుజరాత్, హరియాణా , రాజస్తాన్ ప్రాంతాలలో  పరియటించి వచ్చాను.
 చాలా మంది రైతు మిత్రులు  జిగురు గోరుచిక్కుడు ధరను గురించి అడుగుతున్నారు , ప్రస్తుతానికి నాలుగు నుండి అయిదు వేల మధ్య ఉండే అవకాశం కనపడతా  ఉంది ...అయెతే జూన్ జూలై నెలలో వర్షం పడనట్లయితే ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని కొంతమంది చెప్తున్నారు , అయెతే వర్షం లేట్ అయినందువల్ల  పత్తి  వరి కి బదులుగా  గోరుచిక్కుడు  సాగు పెరిగే అవకాశం ఉందని మరి కొంత మంది అనుభవంతులు చెప్తున్నారు , ఏది ఏమైనప్పటికీ  నాలుగు నుండి అయిదు వేల మధ్య ధర స్థిరంగా ఉండే అవకాశం ఉంది కనుక గోరుచిక్కుడు నిరభ్యంతరంగా సాగు చెయ్యవచ్చు అయెతే కొంత మంది ప్రచారం చేస్తున్నట్లు , కొనే వారే ఉండరు అనేది తప్పు కల్పన , నేను దేశం లో ఎక్కువగా gum exporters  తో కలవటం  జరిగింది కనీస ధరను గురించి రైతులకు 35౦౦ వరకు క్వింటాల్ భరోసా ఇవ్వవలసిందిగా చెప్పారు ఆ ధర ప్రకారం వారు gum కొనడానికి సిద్ధంగా ఉన్నారు , ఈ విషయం మీకు తెలియజెయ్యడానికి సంతోషిస్తున్నాను .