మోడీ గారి
ఏడాది పాలన లో వారు
తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు
1)
ఇరుగు పొరుగు దేశాలతో
సత్సంబందాలు
2)
40 చట్టాల
సవరణ
3)
సామాన్య పౌరులకు 18
నుండి 70 సంవత్సరాల వయసు వరకు ప్రమాద భీమా సౌకర్యం కేవలం 12 రూపాయలకే ,
4)
౩౩౦ రూపాయలకు
సంవత్సరానికి జీవిత భీమా సౌకర్యం ,
5)
అటల్ pension యోజనా
6)
స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి బ్యాంకు మెట్లు ఎక్కని సాధారణ ప్రజలకు జన ధన్ యోజన ద్వారా కోట్లాది
జనంతో బ్యాంకు లో ఖాతాలు తెరిపించడం.
7)
బ్యాంకుల ద్వారా ఇచ్చే వ్యవసాయ రుణాలలో చిన్న సన్నకారు రైతులకు 8 % శాతం తప్పనిసరి చెయ్యడం
8)
కోట్లాది మంది
చిరు వ్యాపారులకు Micro Units Development and Refinance Agency ( MUDRA) ముద్రా
బ్యాంకు ఏర్పాటు చెయ్యడం
9)
ఆడపిల్లలను
రక్షించండి చదివించండి అనే నినాదం
10)
ఎన్నో సంవత్సరాల
నుండి అపరిష్కరితంగా ఉన్న భారత్
బంగ్లా సరిహద్దు సమస్యని
లోక్ సభ , రాజ్యసభల ఏకగ్రీవ ఆమోదంతో
పరిష్కరించడం
11)
రక్షణ వ్యవస్థ కు
Budget లో రెండు లక్షల అరవై వేల కోట్లు
కేటాయించి అత్యాధునిక సామగ్రిని
సమకూర్చుకుని , దేశ రక్షణ విషయం లో 125 కోట్ల జనం
నిశ్చింతగా ఉండేలా చెయ్యడం
12)
ప్రపంచం లో ఉన్న
అగ్ర రాజ్యాలతో పెట్టుబడులు వ్యాపారం
మొదలైన విషయాల పై సత్సంబందాలు పెంచడం
13)
సోదర సరిహద్దు
దేశమైన నేపాల్ లో జరిగిన భయంకర
ఆపత్తు సమయం లో కొద్ది గంటల
వ్యవధిలో స్పందించి సహాయ సహకారాలు అందించే
విషయం లో ప్రపంచ దేశాలకే మార్గదర్శకులు కావడం.
14)
ఈశాన్య రాష్ట్రాలలో ఉగ్రవాదుల పై గంటల వ్యవధిలోనే ఉక్కుపాదం మోపడం
15)
వేలాది నిరర్ధక
NGO సంస్థల పై నిషేధం విధించడం.
16)
రైల్వే లను తాత్కాల టికెట్ రద్దులో టికెట్ డబ్బు సందర్భంలో డబ్బు
refund ఇవ్వటం , మొదలైన ఎన్నో
సాహసోపేతమైన నిర్ణయాలు
17)
June 21 న ఐక్య
రాజ్య సమితి ద్వారా ప్రపంచ యోగా
దినోత్సవం ప్రకటించడం
మతాలు ప్రాంతాలకు
అతీతంగా దేశం లో ఉన్న 125 కోట్ల మంది కి
ఉపయోగపడే విధంగా మీరు మీ మంత్రి వర్గం
తీసుకున్న నిర్ణయాలకు అభినందిస్తున్నాం, అయెతే దేశం మీ నుండి ఎంతో నిరిక్షిస్తుంది
గౌరవనీయులైన మోదిగారు ....భారత ప్రజలు మీ పై పెట్టుకున్న
ఆశలు
1.
రైతుల ఆర్ధిక స్తితిని మెరుగు పరచడం
2.
చట్టసభల అభ్యర్ధులకు
కనీస విద్యార్హతలు నిర్నియించడం
3.
పారదర్శకత లో
భాగంగా చెయ్యబోయే పనులే కాక ,
ఇప్పటివరకు చేసిన పనుల వివరాలు కూడా ప్రతి
రాష్ట్ర మరియు కేంద్ర మంత్రులు ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచే విధంగా ఆదేశించండి
4.
నల్లదనం
నిరోదించే చర్యలను వేగవంతం చెయ్యండి
5.
మంత్రుల
పరిపాలన పటిమను పెంచే శిక్షణ ఇప్పించటం ,
పరిక్షించడం
6.
పోలీసు వ్యవస్థ
లో సమూల మార్పు , సమర్ధతను పెంచడం , FIR
లను వెబ్ సైట్ ద్వారా నమోదు చేసే సౌకర్యం
కల్పించడం , వారి జీతభత్యాలను పెంచడం ,
అవినీతికి పాల్పడని అధికారులకు జిల్లా , రాష్ట్ర , జాతీయ స్థాయి అవార్డు లను
ప్రకటించడం మొదలైనవి మీ నుండి
ఆశిస్తున్నాం
............ఇట్లు కే వి కృష్ణా రావు
............ఇట్లు కే వి కృష్ణా రావు