రైతు సోదరులకు
కృష్ణా రావు నమస్కారం..
మీతో మాట్లాడి చాలా రోజులు అయ్యింది , అనారోగ్య
కారణం వల్ల ఏమి వ్రాయలేక పోయాను ,
ప్రస్తుతం రైతుల పంటలకు గిట్టుబాటు ధర
లేదు .. వరి , పత్తి గోధుమ , జొన్న
మొక్కజొన్న మొదలైన పంటలు ప్రపంచ వ్యాప్తంగా దిగుబడి బాగున్నందున ఎగుమతి చేస్తున్నప్పటికీ ధరలు పెరగడం లేదు , పంచదార దిగుమతి సుంకం 20 % నుండి
40 % వరకు పెంచి దిగుమతులకు కళ్ళెం
వేసారు, పప్పు గింజలు , నునే గింజలకు మంచి ధర వుంది , భవిష్యత్తు లో కూడా ఈ రెండిటికి
మంచి ధర వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది , కారణం ఈ రెండు పంటల విషయం లో
మనం ఇప్పటికి దిగుమతుల పైనే ఆధార పడుతున్నాం , ఈ విషం లో మన ప్రధాని మోడీ గారు చాలా
పట్టుదలతో ఉన్నారు , ఈ పంటలను స్వదేశం లో
ఎక్కువగా పండించాలి అని రైతులను
ప్రోత్సహిస్తున్నారు , 24 గంటలు దూరదర్శన్ లో వ్యవసాయ కార్యక్రమాల ఛానల్
ప్రారంభిస్తూ వారి విషయాన్ని
ప్రస్తావించారు , ఎ విధంగా
పంచదార పైన దిగుమతి సుంకాన్ని పెంచి దేశంలో పంచదార
ధర పతనం కాకుండా చెరకు రైతును కాపాడారో ..అదే విధంగా
భవిష్యత్త్ లో నునే గింజలు పండించిన
రైతులు నష్టపోకుండా దిగుమతుల
పై సుంకాన్ని పెంచి దేశీయ రైతులకు సహాయ
పడగలరు
