Monday, 24 February 2014

Field day invitation 16.3.2014

KIND ATTENTION TO ALL FARMERS .....
WE ARE HAPPY TO INFORM YOU THAT WE ARE ORGANIZING A FIELD DAY AT
FARMER NAME : SRI D. SRINIVAS RAO , PH: 9603105171
SOODIVAARI PALEM
INKOLLU MANDALAM
PRAKASHAM DISTRICT
ANDHRAPARDESH

DATE: 16.3.2014
DAY: SUNDAY @ 3 PM

DEAR FARMERS 
FARMERS WHO HAVE TAKEN THE CULTIVATION OF GUAR CROP ACROSS THE STATE IN DIFFERENT PARTS ARE FACING LOTS OF PROBLEMS IN CULTIVATING THE SAME AND ALSO THEY ARE GETTING DIFFERENT YIELDS AT DIFFERENT PLACES TO FARMERS , AND IT WILL BE A GOLDEN OPPORTUNITY TO TAKE PART IN THE ABOVE FIELD DAY SO THAT THE FARMERS CAN SEE THE CROP ON FIELD AND CAN INT REACT WITH FARMERS OF VARIOUS PARTS OF STATE AS WELL AS AGRI SCIENTISTS WHO WILL ALSO BE VISITING THE FIELD ON THAT DAY
HENCE I REQUEST ALL THE FARMERS TO TAKE THE MAXIMUM BENEFIT OF THIS FIELD DAY

YOURS TRULY
K V KRISHNA RAO

Saturday, 8 February 2014

దక్షిణ భారతదేశం లో బాసుమతి సాగు

09.02.2014, రాయచూరు
అన్నదాత లో నా ప్రకటన చూసి చాలా మంది రైతుసోదరులు బస్మతిని గురించి వివరాలు అడుగుతున్నారు ,
బాసుమతి అనే పదానికి అర్థం సువాసన గలది  ఈ విషయాన్నీ మనం గమనించాలి , భారతదేశం నలుమూలలా సువాసన గలిగిన ధాన్యం చాలా కాలం నుండి పండిస్తున్నారు అయితే ఉత్తర భారతదేశం లో పండిస్తున్న సువాసన గల ధాన్యం బాసుమతి పేరుతొ ప్రసిద్ధి చెందటం మిగిలిన సువాసన కలిగిన రకాలకు ప్రాధ్యాన్యం తగ్గింది, అందువల్లే ఈనాడు ఉత్తర భరతం లో పండిన బాసుమతి బియ్యానికి  దేశవిదేశాలలో విపరీతమైన గిరాకి ఏర్పడింది , పూర్వకాలపు బాసుమతి దిగుబడి తక్కువ రావటం పంటకాలం ఎక్కువ అవ్వటం , పైరు బాగా ఎత్తు పెరగటం మదలైన అవరోధాలవల్ల  ఈ పంట ఎక్కువ ప్రాంతం లో సాగుబడి కావటం లేదు , ఈ విషయాన్నీ గమనించిన అక్కడి శాస్త్రవేత్తలు గత రెండు దాశాబ్దలుగా అనేక ప్రయోగాలూ చేసి తక్కువ కాలం, ఎక్కువ దిగిబడి, గింజ పొడవు , అన్నం బాగా  అయ్యేలా , నూతన వంగడాలను  సృష్టించారు , ఆ క్రమం లో PUSA సుగంధ -1 అనే రకం దిగుబడి పెరిగి ఇటు రైతుల అటు వినియోగదారుల ఆదరణ పొందింది , ఆ క్రమం లో వచ్చిన pusa సుగంధ -4  బాసుమతి 1121 గా ప్రపంచ ఖ్యాతి ని ఆర్జించి రైతులు మరియు వ్యాపారుల పాలిట అదృష్టం గా మారింది . అదే క్రమం లో ఇంకా అనేక రకాలు మన శాస్త్రవేత్తలు , భారతీయ కృషి అనుసంధాన పరిషత్ , ఢిల్లీ వారు రూపొందిస్తున్నారు , అయితే దేశం లో మిగిలిన ప్రాంతాలలో ఈ దిశగా పరిశోధనలు జరగక పోవడానికి కారణం కొంత మంది బాసుమతి పదాన్ని ఎవరు వాడకుండా , GEOGRAPHICAL INDICATION (GI) ప్రయత్నించుట వల్ల ప్రభుత్వ వ్యసాయ శాస్త్రవేత్తలు పరిశోదనలో మరియు ప్రచారం లో వెనకంజ వేస్తున్నారు , వాస్తవానికి వరి  పండే  ప్రతి ప్రాంతంలోనూ పై రకాలు పండించవచ్చు  అయెతే ఇది చల్లటి ప్రాంతం లో పండుతుంది వేరే ఎక్కడ పండదనే ప్రచారం తో రైతులు వెనకంజు వెయ్యటం,దానికి మిల్లింగ్ కు  రైస్ మిల్లులు  లేకపోవడం కూడా ఒక కారణం , దీని వల్ల ప్రతి సంవత్సరం దక్షినాది రాష్ట్రాలలో ఇరవై అయిదు నుండి ముప్ఫై లక్షల టన్నులు బాసుమతి బియ్యాన్ని  మన దిగుమతి చేసుకోవడం జరుగుతోంది , గత అయిదారు సంవత్సరాలనుండి రాజస్తాన్    మధ్యప్రదేశ్     బిహార్   మహారాష్ట్ర  రాష్ట్రాలలో  బాగా పండిస్తున్నారు , అలాగే ఆంధ్రప్రదేశ్  కర్ణాటకలో కూడా గత ఏడెనిమిది సంవత్సరాలనుండి బస్మతిని పండించడం జరుగుతుంది , ఇప్పటికే తెలంగాణా లో  "తెలంగాణా బాసుమతి ఉత్పత్తి దారుల సంఘాన్ని కూడా register చేయించారు , కృష్ణా జిల్లా కోడూరు మండలం నరసింహాపురం గ్రామం లో డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు ( ఫోన్ నెంబరు :09440368801) గత రెండు సంవత్సరాలనుండి  ( సముద్రానికి అయిదు కిలోమీటర్ల దూరం ) పండిస్తున్నారు , వారు పండించిన ధాన్యాన్ని కొనుగోలుకు హరియానా నుండి కొనుగోలు దారులు రావడమే బాసుమతి మనవద్ద పండుతుంది అనడానికి గట్టి నిదర్శనం
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ రకాలను పండించి రైతులు లాభపడవచ్చు , సందేహాలకు తావివ్వకుండా ప్రయత్నిద్దాం ...