జిగురు
గోరుచుక్కుడు పంట సాగు లో
పాటించవలసిన విధానాలు
మరియు కొన్ని
విశేష సూచనలు
ముఖ్య గమనిక : రైతు
సోదరులు ఈ పంటను
కర్చు తక్కువ దిగుబడి
ఎక్కువ వచ్చే నూతన విధానాలను
అవలంభిస్తే , మంచి
ఫలితాలను మరియు అధిక లాభాలను పొందగలరు ,
సంప్రదాయక పద్దతులనుండి బైటకు వచ్చి , విశ్వవ్యాప్తం గా వస్తున్న మార్పులను
అనుసరించి , వాటిని తమ సేద్యం లో ఆచరించి మంచి ఫలితాలను పొందగలరు
పంట కాలం :- 90 నుండి
100 రోజులు
విత్తే సమయం :- ఖరీఫ్ లో జులై నుండి సెప్టెంబర్
15 వరకు
విత్తనం ఎకరాకు :-నాలుగు నుండి అయెదు కేజీలు (4 to 5 KG per acre )
సాళ్ళ మధ్య
దూరం :- సాధారణ భూముల్లో సాలు నుంచి సాలుకు 9 అంగుళాలు
, సారవంతమైన భూముల్లో
12 అంగుళాలు
పోషణ : సేంద్రియ
ఎరువుల తో పాటు DAP 50కేజీ లు లేదా 10:26:26 50కేజీ ల తో 15 కేజీ ల
urea విత్తనం తో పాటు సాళ్ళలో విత్తాలి
# 25వ రోజు 35వ రోజు మరియు 45వ రోజు అవసరాన్ని
బట్టి UREA రెండు కేజీలు
బావిస్టన్ లేక Diethian M -45 లీటర్ నీటికి
రెండు గ్రాముల చొప్పున
పైరును బట్టి 100 నుండి 150 లీటర్ల నీటిలో
కలిపి పిచికారి చెయ్యాలి
కలుపు నివారణ :- విత్తిన మరుసటి రోజు
ఎకరాకు ఒక లీటర్ STAMP అనే మందును 200 లీటర్ల నీళ్ళలో
కలిపి పిచికారి చెయ్యాలి
, అవకాశాన్ని బట్టి
సాళ్ళ మధ్య గుంటుక తోల టం
మంచిది
సస్య రక్షణ
: గోరుచిక్కుడు లో అనేక రోగాలు ఉన్నపటికీ
మన దగ్గిర ప్రస్తుతం బూడిద తెగులు ఎక్కువ గా
వస్తున్నది , నివారణ కు అనేక రకాల మందులు
ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయి
, మీ సమీపం లో ఉన్న వ్యసాయ శాస్త్ర వేత్తలను సంప్రదించి
నివారణకు తగు చరియలు చేపట్టగలరు
గమనిక : ఈ పంటను
కొతులనుండి గాని అడవి పందుల నుండి కాని ఇతర ఎ పశు పక్షియదులనుండి హానీ కలుగుట లేదని అనేక
ప్రాంతాల నుండి రైతులు వారి వారి అనుభవాలను తెలియచేస్తున్నారు