Tuesday, 20 August 2013
Thursday, 15 August 2013
ఈ మొక్క గింజలు కొనబడును......చిన్న కసింద
రైతు సోదరులకు గమనిక:
పై పంట మీ పరిసరాలలో విరివి గా పెరుగుతుంది..... దేనికిఏ విధమైన సాగు పద్దతులు లేవు..ఇది ఒక సహజసిద్దమైన కలుపు మొక్క.దీని గింజలను కొన్ని దేశాలలో వివిధ ఉపయోగాలకు వినియోగిస్తారు, కనుక మీరు ఈ పంటను సేకరించి విత్తులను జాగ్రత్తగా నిలువ చేసి మంచి ధర ఉన్న సమయం లో అమ్ముకోగలరు
అధిక వివరాలకు నన్ను ఈ క్రింద పేర్కొన్న ఫోన్ నెంబర్ లోసాయంత్రం 7 నుండి 9 ఘంటల మధ్యలో నన్ను సంప్రదించ గలరు PH no : 9448190919
किसान भाईओं के लिए सूचनाएं
धान उगाने वाले
किसान भाईओं केलिये एक सुझाव :
हमारे यहाँ मजदूरोंकी समस्या ज्यादा हो गयी है , समय पे रुपाई नहीं करपाराहें है
हमारे यहाँ मजदूरोंकी समस्या ज्यादा हो गयी है , समय पे रुपाई नहीं करपाराहें है
इसी लिए हम ने
सीधे धान बोनेकी पद्धती अपनाई है , इसके कारण हम को नर्सरी उगानेकी और पडलिंग और रुपाई का कर्च भी बचत हुई , अंदाज़ एक एकड़ में सीधे से सीधा 5000 रुपये का बचत हुई और मजदूरोंकी समस्या भी हल होगई , इसी लिए सारी देश का धान उगने वाले किसान भाईयोने कम कम
मजदूर का उपयोग करनेका यह पद्दति अपनाये तो , मजदूरोंकी समस्या भी हल होगी , लागत भी कम होता है इसीलिये हरेक किसान भाई अपने अपने प्रांत में ऎ पद्दति अपनाके देकिये
Saturday, 10 August 2013
Thursday, 8 August 2013
Information to farmers
01.11.2013 RAICHUR
రైతు
సోదరులకు ముఖ్య సూచన , ముఖ్యంగా విత్తనాల సేకరణ ఎ పంట అయినా రెండు రకాల విత్తనాలను
మనం మార్కెట్ లో కొంటు ఉంటాం ... ఒకటి హైబ్రిడ్ , రెండొవది సాధారణ రకం , హైబ్రిడ్
రకం ఎప్పుడు ప్రత్యెక పద్దతతుల ద్వారా నిపుణుల పరియవేక్షణ లో ఉత్పత్తి చెయ్యబడ్తుంది
, కనుక హైబ్రిడ్ ప్రతి రైతు చెయ్యడానికి సాధ్యపడదు ...దాన్ని మనం మార్కెట్ లో
కొనాల్సిందే , అయెతే సాధారణ రకం విత్తనాలకు నిపుణుల అవసరం గాని ప్రత్యెక పద్దతులు
గాని లేవు , నారు దగ్గరనుండి కొద్దిగా జాగ్రత్త వహించి కలబెరకు లేకుండా నాటుకోవడం
, పండిన పంట లో ఎ విధమైన బెరుకులు ఇతర కలుపు గింజలు లేకుండా చూసి బాగా ఎండబెట్టి దృడమైన
విత్తనాన్ని చూసి మనం మరల పంటకు వినియోగించుకోవచ్చు , ప్రతి
సారి సాధారణ రకాలకు మార్కెట్ పై ఆధార పడేకన్నా మన పంట నుండే మంచి విత్తనాన్ని
సేకరించి వాడుకోవడం మన తోటి రైతులకు కూడా ఆ విత్తనాన్ని ఇవ్వవోచ్చు , ఈ విధంగా
ప్రతి గ్రామం లో కనీసం నలుగురైదుగురు రైతులు స్థానిక అవసరాలకు తగినట్టు వివిధ రకాల
విత్తనాలను తయార్ చేసుకున్నందున మంచి విత్తనం సరసమైన ధరకు మన గ్రామం లోనే
పొందవచ్చు
ఉదాహరణకు
పచ్చి రొట్ట విత్తనం జీలగ ను గత సంవత్సరం కృష్ణ జిల్లా కోడూరు మండలం , నరశింహ పురం
గ్రామం లో Dr ఎం .కోటేశ్వరరావు గారు తదితర రైతులు జీలగ విత్తాన్ని పండించి వారు
వాడుకునటే కాక పక్క రైతులకు కూడా సకాలం లో అందజేసి మిగిలిన వారికి మార్గదర్శకం గా
నిలిచారు
28.10.2013 RAICHUR
Dear farmers , felt very bad to hear many farmers are taking the extreme step of suicides fearing the crop losses due the recent natural clamaties , problems are there for every living being and in every field , one should fight with courage against all the odds , suicide is not at all a solution for farmers , there are some very good products from Dr jerry stoller of USA, which can be sprayed on leaves , Dear farmers please spray 3 grams urea per litre of water , and also fungicide should also sprayed at 2 % along with urea , and the same spray should be repeated after a week, we have seen wonderful results on red gram crop .
28.10.2013 RAICHUR
రైతు సోదరులారా ,అధిక వర్షాల వల్ల పంట నష్టం
వస్తుంది అనే భయం తో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పేపర్ లో వార్తలు
వస్తున్నై , ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు , రైతు సమస్యలు లాగే అనేక రంగాలలో మనకన్నా ఎక్కువ నష్టాలు కష్టాలు
అనుభవిస్తున్న వ్యక్తులు ఉన్నారు , అయేనప్పటికి ధైర్యంగా సమస్యలను ఎదురించి పరిష్కారం
కనుగొంటున్నారు కాని ఆత్మహత్యలు చేసుకోవటం లేదు, మనం కూడా మన సమస్యలను ఎ విధంగా
ఎదురించాలో అలోచించి మన రైతు మిత్రులకు ధైర్యాన్ని ఇద్దాం
చాలా
ప్రాంతాల్లో పత్తి, మిర్చి మొదలైన పంటలు దెబ్బ తినడానికి అవకాశం ఎక్కువ
ఉంది , అయెతే పై పంటలు దీర్ఘ కాలిక పంటలు కనుక రైతు సోదరులు వర్షం తగ్గిన వెంటనే లీటర్ నీటికి మూడు గ్రాములు యురియా పైరు తడిసే విధంగా స్ప్రే చెయ్యాలి , ఈ
మిశ్రమం లో శిలేంద్ర నాశికాన్ని లీటర్
నీటికి రెండు గ్రాములు చొప్పున పిచికారి చేసి , మరల వారం తరువాత ఇదే విధంగా స్ప్రే
చెయ్యాలి , తరువాత stoller usa అనే ఇంటర్నెట్ లో చూసి డాక్టర్ stoller ప్రపంచ ప్రఖ్యాతి
చెందిన ఆకుల పై చల్లే పోషక పదార్ధాలను చల్లడం వల్ల పైరుకు మళ్ళి బ్రతికించుకునే
అవకాశం ఉంది , కంది పైరు లో మాకు ఎదురైన ఇదే సమస్యను మేము పరిష్కరించి 80 %
ఫలితాన్ని సాదించాం , మీరు కూడా ప్రయత్నం చెయ్యండి
22.10.2013
ఆంధ్ర రాష్ట్రం లో ఉన్నటువంటి ఆదర్శ రైతు మిత్రులందరికీ విగ్య్నప్తి మీ మీ జిల్లాల వారిగా మే పేర్లు ,ఫోన్ నుమ్బెర్లతో సహా నా ఈ మెయిల్ id కి మెయిల్ చెయ్యగలరు , వ్యసాయం లో కొత్త ప్రయోగాలూ చేస్తున్న రైతులందరూ తప్పనిసరిగా మీ మీ పూర్తీ పేరు ,చిరునామా , ఫోన్ నుమ్బెర్లు నాకు ఈ మెయిల్ ద్వారా పంపగలరు , భవిష్యత్ లో జరిగే వ్యసాయ పరిశోదన ఫలితాలను ఎప్పటికప్పుడు మీకు అందించే లా ICAR ఢిల్లీ వారి తో అనుసంధానం చెయ్యబడుతుంది . ఇట్లు ...కె వి కె రావు , IARI ఫెలో షిప్ అవార్డు గ్రహిత. కే వి కే గ్వార్ గం ఇండస్ట్రీ , రాయచూరు
e mail :kvkraofarmer@gmail.com
15.10.2013 , ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల జిగురు గోరుచిక్కుడు సాగు చేసిన రైతులు కొన్ని ప్రాంతాల్లో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది , అలాగే రేట్ కూడా అంత ఆశా జనకంగా లేదు , వర్షాలు అధికం కావటం , బూడిద తెగులు లాంటి అనేక సమస్యలతో పంట దిగుబడి తగ్గటమే కాక గింజ నాణ్యత కూడా బాగా దెబ్బ తిందని తెలుస్తోంది , గింజ నలుపైనా దృడంగా ఉంటె పెద్దగా రేట్ తగ్గదు , పీల గింజ , పూర్తిగా నల్ల బడిన గింజ అయెనప్పతికి కనీస ఉత్పత్తి కర్చు అయునా వస్తుంది కొంత మంది ఇది ఎందుకు పనికి రాదు , చెత్త కుప్పలో పారవేయ్యవలిసిందే అని చెప్తున్నారట , కాని వాస్తవానికి అలాంటి పరిస్తితి లేదు , రైతులు ఎవ్వరు నిరాశ చెందక అలాంటి సరుకు ఉంటె కూడా మాకు సాంపిల్ పంపగలరు
9.9. 2013 :అతి తక్కువ కర్చు తో అతి తక్కువ లేబర్ తో వరి సాగు ఎలా అనే దానికి సమాధానం నేరుగా విత్తటం , కలుపు మందు తో కలుపు నివారణ మొక్కల సంఖ్య సరిపడా ఉండటం వల్ల తక్కువ ఎరువు తోనే పంట పెరుగుదల అలాగే ఆకుల పై పిచికారి చేసే ఎరువల వల్ల కూడా కర్చు బాగా తగ్గించ వచ్చు అని నిరూపించిన యువ రైతులు రాయచూరు జిల్లా మాన్వి తాలూకా మదగిరి క్యాంపు లో శ్రీ జి హనుమంత్ రావు , శ్రీ కే శివరాం ప్రసాద్ అనే ఇద్దరు యువ రైతులు షుమారు రెండువందల యాభై ఎకరాల వరి సాగు లో పై పద్దతులు పాటించి చేస్తున్న తీరు మొత్తం దేశం లోనే వరి రైతులు వారిని ఆదర్శంగా తీసుకుని అతితక్కువ లేబర్, అతి తక్కువ కర్చు తో వరి ధాన్యాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసి, నష్టమంటున్న వ్యసాయాన్ని లాభ సాటిగా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి .
24.9.13 : రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక : చాలా ప్రాంతాల నుండి గోరుచిక్కుడు పంట కు బూడిద తెగులు సోకుతునట్లు సమాచారం అందుతున్నది , కావున రైతు సోదరులారా ముందు జాగ్రత్త గా పంట పై బావిస్టన్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చయ్యగలరు
అలాగే పూత బాగా రావడానికి planofix అనే మందు కాని , ఫ్లవర్ పవర్ FLOWER POWER అనే మందు NITRO PLUS అనే మందు తో కలిపి పిచికారి చేస్తే పూత బాగా వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంది
వర్షాలు అధికంగా కురవడం తో కూరగాయల మీద చీడ పీడల నివారణ కు క్రిమి సంహారక మందుల పిచికరారి చెయ్యవలసి వస్తునందున వినియోగ దారులు కూరగాయల ను 3 % ఉప్పు కలిపిన నీటిలో బాగా కడిగి , తరువాత మంచి నీటిలో కడిగితే ఆ హానికారక అవశేషాల ప్రభావం తగ్గించ గలరు
11.9.2013 : ముఖ్యంగా గోరుచిక్కుడు పండే రాష్ట్రాలు ఆయెన రాజస్తాన్ , హరియణ మరియు గుజరాత్ లలో గత నెల రోజులనుండి వర్షాలు లేకపోవడమే కాకుండా ఉష్ణోగ్రత కూడా 35 నుండి 38 డిగ్రీల వరకు పెరిగి వర్షాధారిత గోరుచిక్కుడు దిగుబడి తగ్గే అవకాశం ఉంది , కావున గోరుచిక్కుడు పంట కు మంచి ధర లభించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి
రైతు సోదరులకు వినాయక చవితి శుభాకాంక్షలు.. 8.9.2013
ఈ సంవత్సరం అధిక
వర్షాల వల్ల కొన్ని పంటలు కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు సమాచారం ఉంది, అలాగే
గ్వార్ కూడా విస్తీర్ణం పెరిగినా దిగుబడి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి, కనుక ధరను
గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం అంతగా లేదఅనిపిస్తుంది..అలాగే కేంద్ర
ప్రభుత్వం ఎగుమతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున , రూపాయి విలువ తగ్గడం వల్ల
ఎగుమతి చేస్తున్న ప్రతి పంటకు మంచి ధర వస్తుందనడంలో సందేహం లేదు అయెతే వ్యసాయం లో
వినియోగించే ఎరువులు పురుగుమందులు డీజిల్ పెరిగినందువల్ల రైతు ఆదాయం మాత్రం “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” లా
పెరిగే అవకాశం లేదు, అయెతే ప్రపంచంలో
కొత్త కొత్త పరిశోదనలు వల్ల వ్యసాయ పంటల ఉత్పత్తి కర్చు తగ్గించడానికి
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు నూతన ప్రయోగాలూ చేసినప్పటికీ అవి భారత దేశ రైతులకు చరడం లేదు, ముఖ్యంగా ఇటివల కాలం లో
నీటి లభ్యత తక్కువైనప్పటికీ రక్షణాత్మక వ్యసాయంలో
(PROTECTIVE AGRICULTURE ) పరపంచ దేశాలు ఎంతో ముందుఉన్నాయి ఉదాహరణకు మన పక్క
దేశమైన చైనా లక్ష ఎకరాలలో ఈ పద్ధతి పాటిస్తుంటే మన దేశం కేవలం ఒక వెయ్య ఎకరాలు
మాత్రమే చేస్తున్నట్టు ఇటివల తెలిసింది .
పైరుకు కావాల్సిన
పోషక పదార్థాలు భూమి ద్వారా అందించటమే మనకు తెలిసింది అయెతే అమెరికా లాంటి
అభివ్రిద్ధి చెందిన దేశం లో ఆకుల పై నేరుగా పోషక పధార్తలాను అతి తక్కువ కర్చుతో అందించి అధిక పంటలను
పండిస్తున్న విధానం తెలుసుకున్నపుడు మనం ఎంత వెనుకపడి ఉన్నామో తెలుస్తుంది,
ఉదాహరణకు http://www.stollerusa.com అనే వెబ్ సైట్ ద్వారా అనేక కొత్త విషయాలను
తెలుసుకోగలిగాము , కావున మీరు కూడా అధిక వివరాలకు ఆ వెబ్ సైట్ సందర్శించ గలరు.
5.9.2013
చాలా మంది రైతు మిత్రులు గోరుచిక్కుడు భూమట్టాన్నించే కాయడంవల్ల కోత సమస్య గా ఉంది అని చెప్పడం జరిగింది దేనిపై మా కె వి కె బృందం పరిశోదించగా తేలినది ఏమంటే , విత్తే సమయంలో నత్రజని ఉరెఅ రూపంలో ఎకరానికి 15 నుండి 20 కెజీల వరకు భాస్వరపు ఏరవుతో కలిపి విత్తినందున పూత వచ్చే సమయానికే అనగా 25వ రోజుకే మొక్క 8 నుండి 10 అంగుళాలు పొడవు పెరిగి అక్కడనుండే పూత పింద మొదలైంది కనుక రైతు సోదరులు ఈ విషయాన్నీ గమనించి విత్తే సమయంలో తప్పనిసరిగా నత్రజని urea రూపంలో వేస్తె సత్ఫలితాల్ని పొందగలం
రైతు సోదరులకు ముఖ్య గమనిక 02.9.2013
చాలా మంది రైతు సోదరులు గోరుచిక్కుడు ఎప్పటివరకు విత్తుకొవచ్చు అని అడుగుతున్నారు , మిత్రులారా ఈ పంట మొలక సరిగ్గా రావాలి అంటే 25 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటె నే సరిగ్గా మొలుస్తుంది , మీ మీ ప్రాంతాల ఉష్ణోగ్రతలు అనుసరించి మీరు విత్తవచ్చు , అయెతే చలి కాలం లో ఈ పంటకు బూడిద తెగులు సోకే అవకాశం ఎక్కువ , అయెతే ఈ తెగులు నివారణ కు సమర్దవంతంగా నివారించే మందులు మార్కెట్ లో ఉన్నాయ్ కనుక భయపడాల్సిన అవసరం లేదు ఈ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నయెడల పెరుగుదల కొంచెం తక్కువ గ ఉండొచ్చు అయెతే ఆకుల పై చల్లె పోషక ఎరువులు బజారులో దొరుకుతున్నదున వాటిని వినియోగించి రైతులు మంచి దిగుబడి ని పొందవచ్చు
ఈ పంట వేసవి లో జనవరి మూడోవ వారం నుండి వేసవి పంట గా విత్తే అవకాశం ఉంది అని గమనించగలరు
వ్యసాయం లో వస్తున్న వినూతన మార్పులు : 1.9.2013 హరియణా లో ఉరక (seepage) మరియు చవుడు భూములను బాగు చెయ్యడానికి నీలగిరి చెట్ల పెంపకం పరిశోదన సత్ఫలితాలను ఇచ్చింది అలాగే ఆకులపై పోషక పదార్ధాలను ఉపయోగించి అమెరికా చైనా మొదలైన దేశాలలో పెట్టుబడి తక్కువ తో అధిక దిగుబడి సాధిస్తున్న పద్దతులను మరియు హైడ్రో ఫోనిక్ అనే పధ్ధతి ద్వారా కూడా నీరు మరియు పోషక పదార్ధాలను మాత్రమే ఉపయోగించి అనేక రకాల పంటలను పండిస్తున్న నూతన విధానాలను మనం కూడా ఆచరించి తక్కువ కర్చు తో అధిక ఆదాయాన్ని పొందగలం .
గోరుచిక్కుడు సాగు చేసిన రైతులు , వివిధ దశలలో ఉన్న పంట పై బూడిద తెగులు సోకినట్లు చెపుతున్నారు , సల్పర్ స్ప్రే చేసినప్పటికీ తగ్గలేదు అంటున్నారు , అయెతే బావిస్టన్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి 10 రోజుల తరవాత CARATHION అనే మందును 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చెయ్యాలి , లేదా MYCLOBUTANIL అనే మందు కూడా INDEX అనే పేరుతొ బజారులో దొరుకుతోంది ఇది 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చెయ్యాలి
రైతుసోదరలుకు సూచన :
చాలా మంది రైతు మిత్రులు గోరుచిక్కుడు ధరలను గురించి
అడుగుతున్నారు , 5-6 సంవత్సరాల క్రిందట ధర 20 నుండి 25 రూపాయలు కిలో ఉండేది , అయినా ఉత్తర భారత రైతులు సాగు చేస్తూనే వచ్చారు , ఇటీవల విపరీతంగా ధరలు పెరగటం వల్ల ఈ పంట భారత దేశం మొత్తం వ్యాపించి నందున ధరలు తగ్గాయి అయనప్పటికీ మిగిలిన
పప్పు ధాన్యాలు అన్నిటికన్నా ధర బాగానే ఉంది తక్కువ రోజుల్లో తక్కువ పెట్టుబడితో ,
కేవలం 90 రోజుల్లో పండే పంట ఇది ఒక్కటే. ఈ సంవత్సరం దేశం మొత్తం మీద వర్షపాతం
బాగున్నందున అన్ని పంటలు బాగా పండే అవకాసం ఉంది , కనుక ఏ పంట కు అతి ఎక్కువ ధరను ఆశించే
అవకాసం కనపడటం లేదు కర్చు తక్కువ తో దిగుబడిని పెంచే మార్గమే ఆచరించాలి
18.8.2013 7.00 AM చాలా మంది రైతు మిత్రులు గోరుచిక్కుడు గింజల ధరల గురించి ఆందోళన చెందుతు నాకు ఫోన్లు చేస్తున్నారు , కాని కేవలం కృత్రిమ కొరత శ్రుష్టించి గత రెండు సంవత్సరాలుగా దీని ధరను కొద్ది మంది శాశించారు ...కాని ఈ పంట సరళత .. లాభదాయకత గురించి దేశం లో ఇతర ప్రాంత రైతులు కూడా తెలుసుకోవడం తో ఇప్పుడు దేశం లో ఈ పంట విస్తీర్ణం బాగా పెరిగింది , దాంతో మంచి ధర వస్తుంది అనే ఆశతో నిలువ చేసుకున్న రైతులు ఇప్పుడు తమ పంటను అమ్మడం తో మార్కెట్ లో ధరలు తమ సాధారణ స్థాయి కి వచ్చాయి , బహుళ ప్రయోజనాలు / ఉపయోగాలు కలిగి ఉన్న ఈ గోరుచిక్కుడు జిగురు ను ఎ విధం గా ఉపయోగిస్తారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్య పోతారు , ఉదయం మనం వాడే టూత్ పేస్టు దగ్గరనుండి మనం దిన నిత్యం ఉపయోగించే అనేక పదార్థాలలో ఈ జిగురు ను విరివి గా ఉపయోగిస్తారు, కనుక ధర సాధారణ స్థాయిలో ఉంటె దీని వినియోగం ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది కనుక రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు , ఈ రోజు కంది పెసర, మినుము, సెనగ , సోయా చిక్కుడు లాంటి అనేక పంటలకన్నా దీని సాగులో లేబర్ అవసరం తక్కువ , , నీరు, ఎరువులు , పురుగుమందులు మొదలైన కర్చులు పై పేర్కున్న మిగిలిన పంటలతో పోల్చుకున్నప్పుడు ఈ పంట లాభదాయకం , ఉత్పత్తి ఖర్చు తగ్గించి దిగుబడిని పెంచే మార్గాన్ని రైతులు అనుసరించాలి , సాధారణ స్థాయి లో ధర ఉంటె ప్రపంచ వ్యాప్తంగా అనేక రెట్లు వినియోగం పెరిగి , భారత రైతులకు మరియు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే జిగురు గోరుచిక్కుడు కు మరేది సాటి రాదు
28.8.2013 :a new solution for the seepage problems in fields : recently scientists from Hariyana have discovered a new way to tackle the problem of seepage water in the fields , and its simple, what one has to do is to plant a nilgiri plant in that area, its called as Bio Drainage system. :(for more info please go to this link :http://www.indg.in/agriculture/crop_production_techniques/biodrainage.pdf
28.8.2013 :రైతు సోదరలoతా మీ మీ అవసరాలకు కావాల్సిన , కూరగాయలు తప్పనిసరిగా మీరే పండించుకోవాల్సిన అవసరం కనపడుతుంది , భారత దేశం లో కూరగాయల ధరలు అమెరికా ను మించి పోయి నట్టు ఒక అమెరికా మిత్రుడు తెలియజేసారు , కారణాలు ఏమైనా , కూరగాయల ధరలు సమీప భవిష్యత్ లో తగ్గే అవకాశం కనుపదటంలేదు , అయెతే మిగిలిన మీరు పండించే పంటలకు కూడా గిట్టు బాటు ధర దొరకటం కూడా కష్టమే , ఈ పరిస్తితిలుల్లో రైతుల ఆర్ధిక పరిస్థితి పూర్తిగా క్షి నించే అవకాశాలు ఉన్నాయ్ , యువ రైతులు ఈ విషయాలు అన్ని మీ తోటి రైతులకు తెలియచేస్తూ ప్రస్తుత ఆర్ధిక సంకట పరిస్తి నుండి దేశం కోలుకునే వరకు ఎన్ని కష్టాలు ఉన్నా రైతులు ఆత్మహత్యే పరిష్కారం అనే స్తితి నుంచి వారిని కాపాడవలసిన భాద్యత మన లాంటి వారి పై ఉంది
Subscribe to:
Comments (Atom)






