Sunday, 24 November 2013

LATEST GUAR NEWS ON INTERNET WORLD WIDE

 

Indian chana, guar fall on higher output hopes

MUMBAI Fri Jan 3, 2014 2:46pm IST
Jan 3 (Reuters) - Indian guar seed futures fell on Friday due to supplies from the new season harvest and expectations of higher output.
* The January contract was down 0.63 percent at 4,710 rupees per 100 kg on the National Commodity and Derivatives Exchange (NCDEX) at 0909 GMT.
* "Production is expected to be higher this season but demand from oil and gas companies is weak. The sentiment looks weak in guar futures," said Surendra Kumar Yadav, a trader from Hanumangarh, Rajasthan.
* Industry experts expect guar seed production to be 2.5-2.7 million tonnes in 2013, up from about 2.2 million tonnes a year earlier.

 http://in.reuters.com/article/2014/01/03/markets-india-chana-idINL3N0KD15B20140103

 http://www.tribuneindia.com/2013/20131125/main4.htm

Monday, November 25, 2013, Chandigarh, India






SPECIAL COVERAGE
CHANDIGARH
DELHI


THE TRIBUNE SPECIALS
50 YEARS OF INDEPENDENCE

TERCENTENARY CELEBRATIONS




M A I N   N E W S
Guar price in free fall, farmers fume
Sushil Manav/Raj Sadosh
Tribune News Service

The ‘green gold’ Guar, dubbed ‘green gold’, is a rain-fed monsoon crop requiring 8-15 inches of rain in 3-4 spells
India leads the way
India is the leading producer of guar and guar gum in the world. Rajasthan leads the way with 70 per cent production in the country
Guar gum is used in the food and pharmaceutical industries. it is also used as a thickener in toothpaste and conditioner
The China factor
A strong demand from the shale gas industry led to a spurt in guar gum production last year
But cheap alternatives from China are being blamed for Indian traders’ plight
Sown in 8,000 acres
Apart from Rajasthan, Haryana, Gujarat and Punjab are the other guar producing states
In Rajasthan, guar seed was grown on 3.5 million hectares in 2013
Guar had been sown on around 8,000 acres in Khuyiansarwer and Abohar blocks
Sirsa/Abohar, november 24
Ellenabad farmer Sat Narain is in no hurry to sell his 50 quintal guar, a costly legume, which he has grown on 10 acres. With current price of guar hovering at Rs 4,500 per quintal, Narain hopes it will touch the Rs 30,000 per quintal mark of last year.

Though Narain grew guar on just two to three acres, he decided to go with the crop on the better part of his total landholding this time as the prices had shot up last year.
Unaware of the nitty-gritty of market forces that led to huge fluctuation in prices, Narain has decided to wait, as he still remembers how prices soared to Rs 31,500 per quintal in March 2012 after he had sold his guar for Rs 6,100 per quintal in the beginning of January that year.

 http://www.mydigitalfc.com/commodities/guar-exports-surge-price-falls-617

Guar exports to surge as price falls

Tags: Commodities

US drilling firms, European food processors spur consumption

Guar exports to surge as price falls
A record plunge in the prices of guar gum, a thickening agent used for oil and gas extraction, may boost exports from India, as demand revives among US drilling companies and European food processors.

Shipments may surge as much as 50 per cent to 500,000 tonnes in the year that began on April 1 from 333,000 tonnes a year earlier, said Rajesh Kedia, director at Jai Bharat Gum & Chemicals, India’s third-largest exporter. Shipments increased about 30 per cent to about 210,000 tons in the five months through August, he said.

Prices slumped after India, the world’s largest producer, banned futures trading in March 2012 to curb speculation and record rates cut demand from users.

Guar prices may continue to fall, Mark McCollum, Halliburton’s chief financial officer said Sept. 19. The importers will definitely buy more as prices are attractive, Chowda Reddy, a senior manager at Inditrade Derivatives and Commodities, said. Demand will increase. Guar gum futures slumped more than 50 per cent since May 15, when the Indian exchanges restarted trading after a 14-month ban.

Tuesday, 12 November 2013

FOR GUAR SEEDS REQUIREMENTS , గోరుచిక్కుడు విత్తనాల కొరకు .......

FOR GUAR SEEDS REQUIREMENTS , PLEASE SEND MONEY TO THE BELOW MENTIONED BANK ACCOUNT NUMBER AT RS 100/- PER KG, AVAILABLE IN 5KG PACKING
VARIETIES AVAILABLE
HGC-365 & HGC-563
PLEASE SEND YOUR ADDRESS DETAILS AFTER PAYMENT TO CELL NO. 9449020919

VISHWA SHANTI AGRO INDUSTRIES
CURRENT ACCOUNT NO.  32145195939
IFSC CODE : SBIN0004622
RAICHUR BRANCH

ఆత్మీయ రైతు సోదరులారా ..
గోరుచిక్కుడు విత్తనాల కొరకు పైన పేర్కొన్న  బ్యాంకు ఎకౌంటు కి డబ్బు కే జి  100 /- చొప్పున  పంపగలరు,
అయిదు కే జిల  ప్యాకింగ్ లో ఇవి దొరుకుతాయి.....
మా వద్ద దొరికే  VARIETIES  HGC-365  మరియు  HGC-563
ఇట్లు
మీ
కే వి కృష్ణా రావు

ARTICLES IN PRESS

IN SAAKSHI NEWSPAPER, 12.11.2013 ANANTHAPUR EDITION

IN SAAKSHI NEWSPAPER, 12.11.2013 ANANTHAPUR EDITION

Saturday, 2 November 2013

my messages , నా సందేశాలు

రాయచూరు :24.12.2013 
రైతు మిత్రులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో , చాలా మంది రైతు మిత్రులు ప్రతి రోజు గోరుచిక్కుడు విత్తనం ధర అడుగుతూ , ప్రస్తుత ధర కన్నా భవిష్యత్ లో ధర పెరిగే అవకాశం ఉందా అని అడుగుతున్నారు , అనేక రాష్ట్రలలో గోరుచిక్కుడు వ్యాపారస్తులు ఎగుమతి దారులను అడిగినప్పుడు , ఒక సంవత్సరం వరకు ధర పెద్దగా పెరిగే అవకాశాలు లేవని చెప్తున్నారు , మీ వద్ద ఉన్న సరుకు నిలువ చేసుకున్నపటికి కొత్తగా సాగు చేసే రైతులు మాత్రం ఎక్కువ ధరను ఆశించి , ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఇతర పంటలకు ప్రత్యామ్నాయం గా ఈ పంట ను పండించక పోవడం మంచిది , వేరే అవకాశం లేనప్పుడు క్వింటాలు ధర షుమారు నాలుగు వేలు అయినా పరవాలేదు అనుకున్నప్పుడు ఈ పంట ను పండించండి అంతే  కాని  ఆధిక ధరను  ఆశించి  నిరాశ చెందవద్దు
ముఖ్యగమనిక:మనంపండించిన పంటకి  గిట్టుబాటుధర  పొందే  అవకాశం మన  చేతుల్లో లేనందున ,మన పంటకు అయ్యేఉత్పత్తి కర్చును తగ్గించుకుందాం 


రాయచూరు :9.12.2013


చాలా మంది రైతు మిత్రులు గోరుచిక్కుడు  ను డిసెంబర్ నెల లో విత్త వచ్చా అని అడుగుతున్నారు , గత సమత్సరం అనుభవాన్ని బట్టి చుస్తే జనవరి పదిహేను తరవాత విత్తిన పంటే బాగా వచ్చింది , కనుక జనవరి నుండి వేసవి పంట గా విత్తుకుంటే దిగుబడి ఎక్కువగా వచ్చినట్టు రైతుల అనుభవాలు చెప్తున్నాయి కనుక మీ మీ ప్రాంతాలను బట్టి అక్కడి రైతుల అనుభవాలను తెలుసుకుని విత్తు కోగలరు 



23.11.2013 రాయచూర్ :
హెలెన్ తూఫాను భాదిత రైతు సోదరులకు మా సహానుభూతి ని తెలియచేస్తూ  ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు ఈ తూపాను సందర్భంగా కష్టాలలో ఉన్న ప్రజలందరుకు  తక్షణ సహాయాన్ని అందిస్తూ కొంత అయినా వారికి సహాయపడాలి అని ఆశిస్తున్నాం , మా వంతు , ఈ ప్రాంతాల్లో పండిన జిగురు గోరుచిక్కుడు విత్తనాల్ని , కలర్ మారి పోయినా  కాని వాటికి తగిన ధర ఇచ్చి కొనగలం అని తెలియజేస్తున్నాం
 
21.11.2013 రాయచూర్ : అన్నదాతల జీవితం , ఆర్ధిక సంక్షోబం 
విపరీతంగా పెరిగిన వ్యసాయ కర్చులు గిట్టుబాటు కాని ధరలు , ప్రక్రుతి వైపరిత్యాలు వెరసి అన్నదాత జీవితం అప్పుల సుడిగుండం,నిరంతరంఅనేకకష్టనష్టాలకోర్చి మానవ  జీవన మనుగడ కు ముఖ్యమైన  ఆహారాన్ని అందించే అన్నదాత అప్పుల ఊబి లో కూరుకుని దిక్కు తోచని స్తితి లో వ్యసాయాన్ని వదిలి , ఎం చెయ్యాలో తెలియని అయోమయం లో తప్పనిసరి అయి అదే నష్టాల సాగు చేస్తూ చివరకి దారి తెలియక ఆత్మహత్యలే శరణ్యం అని నిర్ణయానికి వచ్చి వెలుగు లోకి రాని ఆత్మహత్యలు ఎన్నో .... ఇదే నా అన్నదాతకు మనం చూపే దారి ?? 


17.11.2013 రాయచూరు : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు మిత్రులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు


16.11.2013 రాయచూరు : ఖరీఫ్ లో వేసిన గోరుచిక్కుడు పంట దిగుబడి గాని ధర గాని అంత ఆశాజనకంగా లేదు అయితే మిగిలిన పప్పు ధాన్యాల పంటలతో పోల్చి చూసినప్పుడు ధర విషయం కొంత మెరుగే , ఏది ఏమైనప్పటికీ రాయలసీమ ప్రాంతం లోని రైతులు ఈ పంట పై సంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు ,, ఇప్పటి వరకు ప్రతి పంటలోను ఎక్కువ శాతం నష్టాన్ని చవిచూసిన రైతులు ఊహించిన అధిక లాభాలు లేకపోయినా , ఈ పంట లాభదాయకమే అనే ఉద్దేశం తో మళ్ళి ఈ పంట సాగు మొదలు పెట్టారు ,చాలా మంది రైతులు వారి స్వంత విత్తనాన్నే ఉపయోగించి ఇప్పటివరకు పెట్టిన అధిక కర్చులను తగ్గించుకోగలిగారు అధిక వర్షాల వల్ల పంట దిగుబడులు ఆశించినంతగా రాలేదు , గింజ నాణ్యత కూడా దెబ్బతిందని తెలుస్తోంది, అయితే మేము ఇంతకుముందే చెప్పనట్లు గింజ నలుపైనా , దానికి తగిన ధర ఇచ్చి కొనగలమని మరొక్క సారి తెలియజేస్తున్నాము , ఇప్పటివరకు రైతు సోదరలు క్వింటాలు ధర ఎక్కువగా వస్తుందని అంచనాలు వేసుకుని , వారి పంటను అమ్ముకోకుండా చాలా వరకు నష్టపోయారు ,ప్రచార సాధనాలలో వచ్చే ధరను చూసి ,కాశ్మీర్ నుండి కన్యా కుమారి వరకు ఈ పంటను పండించటం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో ధర లేదు , ఏది ఏమైనప్పటికీ నాలుగు నుండి ఆరు వేల వరకు ధర ఉన్నపుడు రైతులు అమ్ముకోగలరు , అంతకన్నా తగ్గితే అమ్మకుండా నిలువ చేసుకోవచ్చు ,ఈ పంట గుంటూరు ప్రకాశం జిల్లాలో ఎకరానికి పది నుండి పద్నాలుగు క్వింటాల్ లకు పైగా పండించటం జరిగింది ,అయెతే ఇప్పటివరకు చెప్పిన విధంగా అతితక్కువ ఎరువులతో అధిక దిగుబడి సాధించడం కష్టం అని తేలింది , కనుక ఇకనుండి వేసే రైతులు విట్టేతప్పుడే ఏకారినికి 75 kgs DAP ,25 kgs urea  విత్తనం తో పాటే విత్తి , సస్య రక్షణ చర్యలు చేపట్టి , అధిక దిగుబడి సాధించితే , ధర అయేదు వేలు ఉన్నా  రైతు కు గిట్టుబాటు ఆవతుంది , ఇది కొంత మంది రైతుల స్వానుభవం
   
 బూడిద తెగులు ...నివారణ చర్యలు : 11.11.2013  రాయచూరు :
రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక , జుగురు గోరుచిక్కుడు పంట కు వ్యాపిస్తున్న బూడిద తెగులు నివారణ కు క్రింద పేర్కొన్న కంపెనీ మందులలో ఏదైనా ఒకటి , కంపని వారు సూచన ప్రకారం ఆకులు మొత్తం తడిసేలా బాగా పిచికారి చెయ్యాలి 
1, ధనుకా వారి casor 
2, bayer వారి BELYTON 
3, దుపొంట్ వారి NEWSTAR 
4, కరమండళ్ వారి BENOFIT 

3.11.2013 , రాయచూరు :
రైతు సోదరులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు , ఈ సంవత్సరం చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలు పడి దేశ వ్యాప్తంగా రైతు సోదరులు అందరు వారి వారి ప్రాంతాల్లో పండే పంటలు బాగా పండినట్లు తెలియజేస్తున్నారు అయెతే కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల కొంత నష్టం కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది , అఎనప్పటికి దేశ వ్యాప్తంగా అన్ని జలాశయాలు , చెరువులు అన్నింటా సంతృప్తి కరంగా నీరు నిలువలు ఉన్నాయి , రాష్ట్రాల మధ్య నీటిని గురించిన వివాదాలను ఆ వరుణ దేవుడే ఈ సంవత్సరానికి పరిష్కరించాడు , అయెతే భవిష్యత్ లో కూడా ఇలాగె ఉండాలని ఆ వరుణ దేవుని ప్రార్థిస్తూ , మన ప్రయత్నంగా సామాజిక అరణ్యాలను మన రైతు సోదరులు అందరు కలసికట్టుగా  చెట్లను పెంచి దేశాలోని అరుణాచల్ ప్రదేశ్ ,ఛత్తీస్ గడ్ , మణిపూర్ , మిజోరం , హిమాచల్ ప్రదేశ్ , నాగాలాండ్ , అస్సాం ఒర్రిస్సా , సిక్కిం త్రిపురా ఉత్తరాంచల్ , మొదలైన అరణ్యాలు బాగా ఉన్న రాష్ట్రాలలో వర్షపాతాన్ని గమనిస్తూ మనం కూడా ఆదాయాన్ని ఇచ్చే చెట్ల పెంపకాన్ని చేపట్టి , ఆదాయానికి ఆదాయం పొందుతూ , పర్యావర్ణ  సమతౌల్యానికి మన వంతు కృషి చేద్దామని ఈ దీపావళి సందర్భంగా ప్రతిజ్ఞ చేద్దాం.

Sunday, 13 October 2013

MY MARKET ANALSYS, నా మార్కెట్ విశ్లేషణ .....ಮಾರುಕಟ್ಟೆ ವಿಶ್ಲೇಷೆನೆ

 30.10.2013 రాయచూరు :ప్రియమైన రైతు సోదరులకు వందనాలు 
గోరుచిక్కుడు సాగు ఇప్పుడు చెయ్యవచ్చా అని చాలామంది రైతులు అడుగుతున్నారు ,ఈ చలి వాతావరణం అంత అనుకూలం కాదు , కనుక జనవరి రెండో వారం నుండివేసవి పంటగా సాగు చేస్తే దిగుబడి బాగుంటుంది ,జిగురు ఎగుమతులు పెరుగుతున్నoదున కొంత మంది ప్రచారం చేస్తున్నటు ఈ పంటను కొనక పోవడం అనేది అబద్దం , సరసమైన ధరకు అందించగలిగితే , వినియోగం దేశవిదేశాలలో ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది , కృత్రిమ కొరతను శ్రుష్టించి ధరను విపరీతంగా పెంచినందునే , ఎగుమతులు తగ్గి   వినియోగ దారులు , ప్రత్యామ్నాయ (alternative ) వెతుకుతున్న తరుణం లో , ధరలు సాధారణ స్తితికి వచ్చినందున మరల తిరిగి మన ఎగుమతులు పెరిగాయి , అయేదు నుండి పది వేల మధ్య గోరుచిక్కుడు విత్తనం ధర ఉంటె , ఇటు రైతు , అటు వినియోగదారుడు ఇద్దరికీ లాభదాయకం
80 % మన దేశం లోనే పండటం మన రైతులకి అనుకూలం , అయితే తొంభై శాతం ఎగుమతులమీదే ఆధార పడటం మనకు ప్రతికూలం  ,ఈ రెండిటిని సమన్వ్య పరచుకుంటూ పొతే , తక్కువ వర్షపాతం కలిగిన మెట్ట  భూములు , బీడు భూముల రైతులకు ఈ పంట ఒక వరదానం

13.10.2013 రాయచూరు :
 చాలా మంది రైతు మిత్రులు ఫోన్ చేసి .. ఈ  పంట సాగు చేస్తే , పండిన పంటను అమ్మగలమా ? అని తమ ఆందోళన వ్యక్తపరుస్తున్నరు , అయెతే ప్రపంచ వ్యాప్తంగా షుమారు 1500 రకాల ఉత్పత్తులలో దీనిని వినియోగిస్తున్నారు , ఈ పంట పండేది 80 % భారత దేశమే కావటం వల్ల ఈ  పంటను ఎగుమతిని ప్రోత్సహించంటమే కాని , ఎగుమతిని నిషేదించే అవకాశం లేనందు వల్ల , అమ్మలేము అనే భయం అవసరం లేదు , రైతులు ఎంత పండించినప్పటికి , వినియోగం పెరుగుతుందే కాని , తగ్గదు.
చాలా  మంది రైతులు గతం లో జరిగిన అనేక సంఘటనలలో అనగా కుందేళ్ళ పెంపకం , రొయ్యల పెంపకం , jatropa ... జనప నార , ఈము కోళ్ళ పెంపకం, వెనిలా   మొదలైన  చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని , సందేహాలతో ఉన్నారు , అయెతే పైన పేర్కున్న అన్ని ఉత్పత్తులు ఎన్నో దేశాలలో ఉత్పత్తి ఆవ్తున్నందువల్ల మరియు వాటికి  ప్రత్యామన్యాయ  ఉత్పత్తులు ఉన్నందువల్ల , మరియు  అవగాహనా లోపం తో ఉత్పత్తి చేసినందువల్ల  నష్టాల పాలు అయ్యారు , జిగురు  గోరుచిక్కుడు విషయం లో  అలంటి పరిస్తితులు  రావనడానికి కారణం ఈ పంట ఉత్పతి మన దేశం లో నే 80 % ఉన్నందువల్ల , సరసమైన ధరలకు మనం supply చెయ్యగలిగితే  వినియోగం పెరుగుతుందే కాని తగ్గదనడానికి ఎటువంటి సందేహం లేదు 

MANY FARMERS ARE INQUIRING ME ABOUT THE PRICE OF GUAR SEED AND THEY ARE VERY MUCH CONCERNED ABOUT ITS PRICE, SINCE THE AREA OF THE GUAR CROP HAS SPREAD TO OTHER PARTS OF OUR COUNTRY AND THEIR IS A STEADY DEMAND , IN MY OPINION THEIR WAS A ARTIFICIAL INFLATION OF THE PRICE OF THE GUAR SEED MAINLY BY A HANDFUL OF TRADERS , DUE TO WHICH MANY FARMERS INCURRED HEAVY LOSSES , BECAUSE THEY COULD NOT SELL THEIR CROP IN TIME IN ANTICIPATION OF HIGHER PRICE , BUT THE MARKET REMAINED SLUGGISH, BUT IN MY OPINION THE PRICE OF 4500/- TO 8000/- PER QUINTAL OF GUAR SEED IS A STABLE AND IDEAL ONE, AND SINCE THE GROWING COST IS VERY LOW , FARMERS WILL GET A HANDSOME RETURNS EVEN AT THE CURRENT MARKET PRICES, AND SINCE THE DOMESTIC DEMAND FOR THE GUAR GUM IS PICKING UP AND EVEN CHINA IS CONSIDERING THE POSSIBILITY OF EXPLORING ITS VAST RESERVES OF SHALE GAS , THE PRICES OF GUAR SEED WILL BE IN THE UPWARD TREND IN THE COMING YEARS, MY SUGGESTION TO FARMERS IS , REDUCE THE COST OF CULTIVATION, GET BETTER PRODUCTIVITY AND PLEASE DON'T WAIT FOR ABNORMAL INFLATED HIGHER PRICES AND SELL YOUR PRODUCT AT THE RIGHT TIME FOR THE REASONABLE RIGHT PRICE , BE IN TOUCH WITH THE MARKET PRICES AND TREND.  



greetings

24 .12 .13  రాయచూరు :
రైతు సోదరులుకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ರೈತ ಭಾನ್ದವರಿಗೆ ಕ್ರಿಸ್ಮಸ್ ಹಾರು ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು
किसान भयिओंको  क्रिसमस और नए साल की हार्दिक शुबकामनाएं
happy Christmas and wish you a happy new year to all my farmers friends and all my fellow human beings

13.10.2013 , RAICHUR:
రైతు సోదరులకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను , అతి తక్కువ సమయం లో ప్రపంచ వ్యాప్తంగా  అనగా , అమెరికా , రష్యా , నార్వే , మలేషియా , జర్మనీ , దక్షిణ కొరియా , కెనడా , స్పెయిన్  మరియు యుక్రెయిన్ దేశాలనుండి నా బ్లాగ్ చూసి ,  ఫోన్ లో నాకు అభినందనలు తెలియచేస్తున్న వేలాది మంది మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ,
మన  దేశ  కీర్తి ని దశ దిశలా వ్యాపింపజేస్తున్న  విదేశాల లో స్తిరపడ్డ మన సహోదరులకు  ఆ  దుర్గా  మాత అస్సిస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని , మరియు వారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని మనస్పూర్తి గా  కోరుకుంటున్న  మీ కె వి కృష్ణ రావు

Monday, 9 September 2013

జిగురు గోరుచుక్కుడు పంట సాగు విధానాలు ...



జిగురు గోరుచుక్కుడు  పంట  సాగు లో  పాటించవలసిన  విధానాలు
మరియు  కొన్ని  విశేష  సూచనలు  

ముఖ్య  గమనిక : రైతు  సోదరులు    పంటను   కర్చు  తక్కువ  దిగుబడి  ఎక్కువ  వచ్చే నూతన  విధానాలను  అవలంభిస్తే  , మంచి  ఫలితాలను  మరియు  అధిక  లాభాలను  పొందగలరు , సంప్రదాయక  పద్దతులనుండి   బైటకు వచ్చి , విశ్వవ్యాప్తం గా  వస్తున్న  మార్పులను  అనుసరించి  , వాటిని  తమ  సేద్యం  లో  ఆచరించి  మంచి  ఫలితాలను  పొందగలరు 

పంట  కాలం :-  90 నుండి  100 రోజులు

విత్తే  సమయం :- ఖరీఫ్  లో  జులై  నుండి  సెప్టెంబర్ 15 వరకు

విత్తనం  ఎకరాకు :-నాలుగు  నుండి  అయెదు  కేజీలు (4 to 5 KG per acre )

సాళ్ళ మధ్య  దూరం :- సాధారణ భూముల్లో సాలు  నుంచి  సాలుకు  9  అంగుళాలు , సారవంతమైన  భూముల్లో  12 అంగుళాలు

పోషణ :  సేంద్రియ  ఎరువుల తో  పాటు   DAP  50కేజీ లు లేదా  10:26:26 50కేజీ ల తో  15 కేజీ ల  urea  విత్తనం  తో  పాటు  సాళ్ళలో విత్తాలి
#  25వ రోజు  35  రోజు  మరియు  45వ రోజు  అవసరాన్ని  బట్టి  UREA  రెండు  కేజీలు  బావిస్టన్  లేక  Diethian  M -45 లీటర్  నీటికి  రెండు  గ్రాముల  చొప్పున  పైరును  బట్టి  100 నుండి  150 లీటర్ల  నీటిలో  కలిపి  పిచికారి  చెయ్యాలి
      
కలుపు నివారణ :- విత్తిన  మరుసటి రోజు  ఎకరాకు  ఒక లీటర్ STAMP  అనే మందును  200 లీటర్ల  నీళ్ళలో  కలిపి  పిచికారి  చెయ్యాలి  , అవకాశాన్ని బట్టి  సాళ్ళ మధ్య  గుంటుక  తోల టం  మంచిది 

సస్య  రక్షణ  : గోరుచిక్కుడు  లో  అనేక  రోగాలు  ఉన్నపటికీ  మన దగ్గిర  ప్రస్తుతం  బూడిద  తెగులు  ఎక్కువ గా   వస్తున్నది , నివారణ  కు  అనేక  రకాల  మందులు  ఇప్పుడు  మార్కెట్  లో  దొరుకుతున్నాయి , మీ  సమీపం లో ఉన్న వ్యసాయ శాస్త్ర వేత్తలను సంప్రదించి నివారణకు తగు చరియలు చేపట్టగలరు

గమనిక : ఈ పంటను కొతులనుండి గాని అడవి పందుల నుండి కాని ఇతర ఎ పశు పక్షియదులనుండి  హానీ  కలుగుట  లేదని అనేక  ప్రాంతాల నుండి  రైతులు  వారి వారి అనుభవాలను తెలియచేస్తున్నారు

Tuesday, 20 August 2013

Thursday, 15 August 2013

ఈ మొక్క గింజలు కొనబడును......చిన్న కసింద




రైతు సోదరులకు గమనిక:
పై పంట మీ పరిసరాలలో విరివి గా పెరుగుతుంది..... దేనికిఏ విధమైన సాగు పద్దతులు లేవు..ఇది ఒక సహజసిద్దమైన కలుపు మొక్క.దీని గింజలను కొన్ని దేశాలలో వివిధ ఉపయోగాలకు వినియోగిస్తారు, కనుక మీరు ఈ పంటను సేకరించి విత్తులను  జాగ్రత్తగా నిలువ చేసి మంచి ధర ఉన్న సమయం లో అమ్ముకోగలరు
అధిక వివరాలకు నన్ను ఈ క్రింద పేర్కొన్న ఫోన్ నెంబర్ లోసాయంత్రం 7 నుండి 9 ఘంటల మధ్యలో నన్ను సంప్రదించ గలరు PH no : 9448190919

किसान भाईओं के लिए सूचनाएं





धान उगाने वाले किसान भाईओं केलिये एक सुझाव :
हमारे यहाँ मजदूरोंकी समस्या ज्यादा हो गयी है , समय पे रुपाई नहीं करपाराहें है 
इसी लिए हम ने सीधे धान बोनेकी पद्धती अपनाई है , इसके कारण हम को नर्सरी उगानेकी और पडलिंग और रुपाई का कर्च  भी बचत हुई , अंदाज़ एक एकड़ में सीधे से सीधा 5000 रुपये का बचत हुई  और मजदूरोंकी समस्या भी हल होगई , इसी लिए सारी देश का धान उगने वाले किसान भाईयोने कम कम मजदूर का उपयोग करनेका यह पद्दति अपनाये तो , मजदूरोंकी समस्या भी हल होगी , लागत भी कम होता है  इसीलिये हरेक किसान भाई अपने अपने प्रांत में ऎ पद्दति अपनाके  देकिये   

Thursday, 8 August 2013

Information to farmers







01.11.2013 RAICHUR


రైతు సోదరులకు ముఖ్య సూచన , ముఖ్యంగా విత్తనాల సేకరణ ఎ పంట అయినా రెండు రకాల విత్తనాలను మనం మార్కెట్ లో కొంటు ఉంటాం ... ఒకటి హైబ్రిడ్ , రెండొవది సాధారణ రకం , హైబ్రిడ్ రకం ఎప్పుడు ప్రత్యెక పద్దతతుల ద్వారా నిపుణుల పరియవేక్షణ లో ఉత్పత్తి చెయ్యబడ్తుంది , కనుక హైబ్రిడ్ ప్రతి రైతు చెయ్యడానికి సాధ్యపడదు ...దాన్ని మనం మార్కెట్ లో కొనాల్సిందే , అయెతే సాధారణ రకం విత్తనాలకు నిపుణుల అవసరం గాని ప్రత్యెక పద్దతులు గాని లేవు , నారు దగ్గరనుండి కొద్దిగా జాగ్రత్త వహించి కలబెరకు లేకుండా నాటుకోవడం , పండిన పంట లో ఎ విధమైన బెరుకులు ఇతర కలుపు గింజలు లేకుండా చూసి బాగా ఎండబెట్టి దృడమైన  విత్తనాన్ని  చూసి మనం మరల పంటకు వినియోగించుకోవచ్చు , ప్రతి సారి సాధారణ రకాలకు మార్కెట్ పై ఆధార పడేకన్నా మన పంట నుండే మంచి విత్తనాన్ని సేకరించి వాడుకోవడం మన తోటి రైతులకు కూడా ఆ విత్తనాన్ని ఇవ్వవోచ్చు , ఈ విధంగా ప్రతి గ్రామం లో కనీసం నలుగురైదుగురు  రైతులు స్థానిక అవసరాలకు తగినట్టు వివిధ రకాల విత్తనాలను తయార్ చేసుకున్నందున మంచి విత్తనం సరసమైన ధరకు మన గ్రామం లోనే పొందవచ్చు
ఉదాహరణకు పచ్చి రొట్ట విత్తనం జీలగ ను గత సంవత్సరం కృష్ణ జిల్లా కోడూరు మండలం , నరశింహ పురం గ్రామం లో Dr ఎం .కోటేశ్వరరావు గారు తదితర రైతులు జీలగ విత్తాన్ని పండించి వారు వాడుకునటే కాక పక్క రైతులకు కూడా సకాలం లో అందజేసి మిగిలిన వారికి మార్గదర్శకం గా నిలిచారు

28.10.2013 RAICHUR
Dear farmers , felt very bad to hear many farmers are taking the extreme step of suicides fearing the crop losses due the recent natural clamaties , problems are there for every living being and in every field , one should fight with courage against all the odds , suicide is not at all a solution for farmers ,  there are some very good products from Dr jerry stoller of USA, which can be sprayed on leaves , Dear farmers please spray 3 grams urea per litre of water , and also fungicide should also sprayed at 2 %  along with urea , and the same spray should be repeated after a week, we have seen wonderful results on red gram crop .
 
28.10.2013 RAICHUR

రైతు సోదరులారా ,అధిక వర్షాల వల్ల పంట నష్టం వస్తుంది అనే భయం తో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు పేపర్ లో వార్తలు వస్తున్నై , ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు , రైతు సమస్యలు లాగే  అనేక రంగాలలో మనకన్నా ఎక్కువ నష్టాలు కష్టాలు అనుభవిస్తున్న వ్యక్తులు ఉన్నారు , అయేనప్పటికి ధైర్యంగా సమస్యలను ఎదురించి పరిష్కారం కనుగొంటున్నారు కాని ఆత్మహత్యలు చేసుకోవటం లేదు, మనం కూడా మన సమస్యలను ఎ విధంగా ఎదురించాలో అలోచించి మన రైతు మిత్రులకు ధైర్యాన్ని ఇద్దాం

చాలా  ప్రాంతాల్లో పత్తి, మిర్చి మొదలైన పంటలు దెబ్బ తినడానికి అవకాశం ఎక్కువ ఉంది , అయెతే పై పంటలు దీర్ఘ కాలిక పంటలు కనుక రైతు సోదరులు వర్షం తగ్గిన వెంటనే  లీటర్ నీటికి మూడు గ్రాములు  యురియా పైరు తడిసే విధంగా స్ప్రే చెయ్యాలి , ఈ మిశ్రమం లో శిలేంద్ర నాశికాన్ని  లీటర్ నీటికి రెండు గ్రాములు చొప్పున పిచికారి చేసి , మరల వారం తరువాత ఇదే విధంగా స్ప్రే చెయ్యాలి , తరువాత stoller usa అనే ఇంటర్నెట్ లో చూసి డాక్టర్ stoller ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆకుల పై చల్లే పోషక పదార్ధాలను చల్లడం వల్ల పైరుకు మళ్ళి బ్రతికించుకునే అవకాశం ఉంది , కంది పైరు లో మాకు ఎదురైన ఇదే సమస్యను మేము పరిష్కరించి 80 % ఫలితాన్ని సాదించాం , మీరు కూడా ప్రయత్నం చెయ్యండి
 
22.10.2013
ఆంధ్ర రాష్ట్రం లో ఉన్నటువంటి ఆదర్శ రైతు మిత్రులందరికీ విగ్య్నప్తి మీ మీ జిల్లాల వారిగా మే పేర్లు ,ఫోన్ నుమ్బెర్లతో సహా నా ఈ మెయిల్ id కి మెయిల్ చెయ్యగలరు , వ్యసాయం లో కొత్త ప్రయోగాలూ చేస్తున్న రైతులందరూ తప్పనిసరిగా మీ మీ పూర్తీ పేరు ,చిరునామా , ఫోన్ నుమ్బెర్లు నాకు ఈ మెయిల్ ద్వారా పంపగలరు , భవిష్యత్ లో జరిగే వ్యసాయ పరిశోదన ఫలితాలను ఎప్పటికప్పుడు మీకు అందించే లా ICAR ఢిల్లీ వారి తో అనుసంధానం చెయ్యబడుతుంది . ఇట్లు ...కె వి కె రావు , IARI ఫెలో షిప్ అవార్డు గ్రహిత. కే వి కే గ్వార్ గం ఇండస్ట్రీ , రాయచూరు
e mail :kvkraofarmer@gmail.com

15.10.2013 ,  ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల జిగురు గోరుచిక్కుడు సాగు చేసిన రైతులు కొన్ని ప్రాంతాల్లో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది , అలాగే రేట్ కూడా అంత ఆశా జనకంగా  లేదు , వర్షాలు అధికం కావటం , బూడిద తెగులు లాంటి అనేక సమస్యలతో  పంట దిగుబడి తగ్గటమే కాక గింజ నాణ్యత కూడా బాగా దెబ్బ తిందని తెలుస్తోంది , గింజ నలుపైనా దృడంగా ఉంటె పెద్దగా రేట్ తగ్గదు , పీల గింజ , పూర్తిగా నల్ల బడిన గింజ అయెనప్పతికి కనీస ఉత్పత్తి కర్చు అయునా వస్తుంది కొంత మంది ఇది ఎందుకు పనికి రాదు , చెత్త కుప్పలో పారవేయ్యవలిసిందే అని చెప్తున్నారట , కాని వాస్తవానికి అలాంటి పరిస్తితి లేదు , రైతులు ఎవ్వరు నిరాశ చెందక అలాంటి సరుకు ఉంటె కూడా మాకు సాంపిల్ పంపగలరు 

9.9. 2013 :అతి తక్కువ కర్చు తో  అతి తక్కువ లేబర్ తో వరి సాగు  ఎలా అనే దానికి సమాధానం నేరుగా విత్తటం , కలుపు మందు తో కలుపు నివారణ మొక్కల సంఖ్య సరిపడా ఉండటం వల్ల తక్కువ ఎరువు తోనే పంట పెరుగుదల అలాగే ఆకుల పై పిచికారి చేసే ఎరువల వల్ల కూడా కర్చు బాగా తగ్గించ వచ్చు అని నిరూపించిన  యువ రైతులు రాయచూరు జిల్లా మాన్వి  తాలూకా  మదగిరి క్యాంపు లో శ్రీ జి హనుమంత్ రావు , శ్రీ కే శివరాం ప్రసాద్ అనే  ఇద్దరు యువ రైతులు  షుమారు రెండువందల యాభై ఎకరాల వరి సాగు లో పై పద్దతులు పాటించి చేస్తున్న తీరు  మొత్తం దేశం లోనే వరి రైతులు వారిని  ఆదర్శంగా తీసుకుని అతితక్కువ లేబర్, అతి తక్కువ కర్చు తో వరి ధాన్యాన్ని ఎక్కువ  ఉత్పత్తి  చేసి, నష్టమంటున్న  వ్యసాయాన్ని లాభ సాటిగా మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి .

24.9.13 : రైతు సోదరులకు  ఒక ముఖ్య గమనిక : చాలా ప్రాంతాల నుండి   గోరుచిక్కుడు పంట కు బూడిద తెగులు సోకుతునట్లు సమాచారం అందుతున్నది , కావున రైతు సోదరులారా ముందు జాగ్రత్త గా పంట పై బావిస్టన్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చయ్యగలరు

అలాగే పూత బాగా రావడానికి  planofix  అనే మందు కాని , ఫ్లవర్ పవర్  FLOWER POWER  అనే మందు NITRO PLUS  అనే మందు తో కలిపి పిచికారి చేస్తే   పూత బాగా వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంది

వర్షాలు అధికంగా కురవడం తో కూరగాయల మీద చీడ  పీడల నివారణ కు క్రిమి సంహారక  మందుల పిచికరారి చెయ్యవలసి  వస్తునందున  వినియోగ దారులు  కూరగాయల ను  3 % ఉప్పు కలిపిన నీటిలో  బాగా కడిగి , తరువాత మంచి నీటిలో కడిగితే  ఆ  హానికారక  అవశేషాల ప్రభావం  తగ్గించ గలరు    


11.9.2013 : ముఖ్యంగా   గోరుచిక్కుడు  పండే  రాష్ట్రాలు  ఆయెన  రాజస్తాన్ , హరియణ  మరియు  గుజరాత్  లలో   గత  నెల రోజులనుండి వర్షాలు లేకపోవడమే కాకుండా ఉష్ణోగ్రత కూడా 35 నుండి  38 డిగ్రీల వరకు పెరిగి వర్షాధారిత గోరుచిక్కుడు దిగుబడి తగ్గే అవకాశం ఉంది , కావున  గోరుచిక్కుడు  పంట కు మంచి ధర లభించే  అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి 

రైతు సోదరులకు  వినాయక చవితి శుభాకాంక్షలు.. 8.9.2013

ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల కొన్ని పంటలు కొన్ని ప్రాంతాల్లో దెబ్బతిన్నట్లు సమాచారం ఉంది, అలాగే గ్వార్ కూడా విస్తీర్ణం పెరిగినా దిగుబడి తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి, కనుక ధరను గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం అంతగా లేదఅనిపిస్తుంది..అలాగే కేంద్ర ప్రభుత్వం ఎగుమతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున , రూపాయి విలువ తగ్గడం వల్ల ఎగుమతి చేస్తున్న ప్రతి పంటకు మంచి ధర వస్తుందనడంలో సందేహం లేదు అయెతే వ్యసాయం లో వినియోగించే ఎరువులు పురుగుమందులు డీజిల్ పెరిగినందువల్ల రైతు  ఆదాయం మాత్రం “ఎక్కడ వేసిన గొంగళి అక్కడే” లా పెరిగే అవకాశం లేదు, అయెతే  ప్రపంచంలో కొత్త కొత్త పరిశోదనలు వల్ల వ్యసాయ పంటల ఉత్పత్తి కర్చు తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రవేత్తలు నూతన ప్రయోగాలూ చేసినప్పటికీ అవి భారత  దేశ రైతులకు చరడం లేదు, ముఖ్యంగా ఇటివల కాలం లో నీటి లభ్యత తక్కువైనప్పటికీ  రక్షణాత్మక వ్యసాయంలో (PROTECTIVE AGRICULTURE ) పరపంచ దేశాలు ఎంతో ముందుఉన్నాయి ఉదాహరణకు మన పక్క దేశమైన చైనా లక్ష ఎకరాలలో ఈ పద్ధతి పాటిస్తుంటే మన దేశం కేవలం ఒక వెయ్య ఎకరాలు మాత్రమే చేస్తున్నట్టు ఇటివల తెలిసింది .

పైరుకు కావాల్సిన పోషక పదార్థాలు భూమి ద్వారా అందించటమే మనకు తెలిసింది అయెతే అమెరికా లాంటి అభివ్రిద్ధి చెందిన దేశం లో ఆకుల పై నేరుగా పోషక పధార్తలాను  అతి తక్కువ కర్చుతో అందించి అధిక పంటలను పండిస్తున్న విధానం తెలుసుకున్నపుడు మనం ఎంత వెనుకపడి ఉన్నామో తెలుస్తుంది, ఉదాహరణకు http://www.stollerusa.com అనే  వెబ్ సైట్ ద్వారా అనేక కొత్త విషయాలను తెలుసుకోగలిగాము , కావున మీరు కూడా అధిక వివరాలకు ఆ వెబ్ సైట్ సందర్శించ గలరు.

5.9.2013 
చాలా  మంది  రైతు  మిత్రులు  గోరుచిక్కుడు  భూమట్టాన్నించే  కాయడంవల్ల  కోత  సమస్య గా  ఉంది  అని చెప్పడం  జరిగింది  దేనిపై  మా  కె  వి  కె  బృందం  పరిశోదించగా  తేలినది  ఏమంటే , విత్తే  సమయంలో  నత్రజని ఉరెఅ రూపంలో  ఎకరానికి  15 నుండి  20 కెజీల  వరకు భాస్వరపు ఏరవుతో  కలిపి  విత్తినందున పూత  వచ్చే సమయానికే  అనగా 25వ  రోజుకే మొక్క  8 నుండి 10 అంగుళాలు పొడవు  పెరిగి అక్కడనుండే  పూత  పింద  మొదలైంది  కనుక రైతు  సోదరులు ఈ  విషయాన్నీ  గమనించి  విత్తే  సమయంలో తప్పనిసరిగా  నత్రజని  urea  రూపంలో  వేస్తె  సత్ఫలితాల్ని  పొందగలం 


రైతు  సోదరులకు  ముఖ్య  గమనిక  02.9.2013
చాలా  మంది  రైతు సోదరులు  గోరుచిక్కుడు  ఎప్పటివరకు  విత్తుకొవచ్చు  అని  అడుగుతున్నారు , మిత్రులారా  ఈ  పంట  మొలక  సరిగ్గా  రావాలి  అంటే  25 నుండి  30 డిగ్రీల  ఉష్ణోగ్రత  ఉంటె నే  సరిగ్గా  మొలుస్తుంది , మీ  మీ  ప్రాంతాల  ఉష్ణోగ్రతలు  అనుసరించి  మీరు  విత్తవచ్చు , అయెతే  చలి  కాలం లో ఈ  పంటకు  బూడిద  తెగులు  సోకే  అవకాశం  ఎక్కువ , అయెతే  ఈ  తెగులు  నివారణ కు  సమర్దవంతంగా  నివారించే  మందులు  మార్కెట్ లో  ఉన్నాయ్  కనుక భయపడాల్సిన  అవసరం  లేదు ఈ  సమయంలో పగటి ఉష్ణోగ్రతలు  తక్కువగా ఉన్నయెడల  పెరుగుదల  కొంచెం  తక్కువ గ  ఉండొచ్చు  అయెతే  ఆకుల  పై  చల్లె  పోషక  ఎరువులు  బజారులో దొరుకుతున్నదున  వాటిని  వినియోగించి  రైతులు  మంచి  దిగుబడి  ని  పొందవచ్చు
ఈ  పంట  వేసవి లో జనవరి  మూడోవ  వారం  నుండి  వేసవి  పంట గా  విత్తే  అవకాశం  ఉంది అని  గమనించగలరు


వ్యసాయం  లో  వస్తున్న  వినూతన  మార్పులు : 1.9.2013 హరియణా  లో  ఉరక  (seepage) మరియు  చవుడు  భూములను  బాగు  చెయ్యడానికి  నీలగిరి  చెట్ల  పెంపకం  పరిశోదన  సత్ఫలితాలను  ఇచ్చింది అలాగే ఆకులపై  పోషక  పదార్ధాలను ఉపయోగించి  అమెరికా చైనా మొదలైన దేశాలలో పెట్టుబడి  తక్కువ తో అధిక  దిగుబడి  సాధిస్తున్న పద్దతులను  మరియు  హైడ్రో ఫోనిక్  అనే  పధ్ధతి  ద్వారా  కూడా  నీరు  మరియు  పోషక  పదార్ధాలను  మాత్రమే  ఉపయోగించి  అనేక  రకాల  పంటలను పండిస్తున్న  నూతన  విధానాలను మనం  కూడా ఆచరించి తక్కువ కర్చు  తో  అధిక ఆదాయాన్ని  పొందగలం .  

రైతుసోదరలుకు సూచన: 31.8.2013

 గోరుచిక్కుడు  సాగు చేసిన రైతులు , వివిధ దశలలో  ఉన్న పంట పై  బూడిద  తెగులు  సోకినట్లు  చెపుతున్నారు , సల్పర్  స్ప్రే  చేసినప్పటికీ  తగ్గలేదు  అంటున్నారు , అయెతే  బావిస్టన్  2 గ్రాములు  లీటర్  నీటికి కలిపి  పిచికారి  చేసి  10 రోజుల తరవాత  CARATHION  అనే  మందును  2 ml  లీటర్  నీటికి కలిపి  పిచికారి చెయ్యాలి , లేదా  MYCLOBUTANIL  అనే మందు  కూడా  INDEX  అనే  పేరుతొ  బజారులో  దొరుకుతోంది  ఇది  2 గ్రాములు  లీటర్  నీటికి  కలిపి  పిచికారి  చెయ్యాలి
  
రైతుసోదరలుకు సూచన :
చాలా  మంది  రైతు మిత్రులు గోరుచిక్కుడు  ధరలను  గురించి అడుగుతున్నారు , 5-6 సంవత్సరాల  క్రిందట  ధర 20 నుండి 25 రూపాయలు  కిలో  ఉండేది , అయినా ఉత్తర భారత రైతులు  సాగు చేస్తూనే వచ్చారు , ఇటీవల విపరీతంగా ధరలు పెరగటం వల్ల  ఈ పంట భారత దేశం మొత్తం వ్యాపించి నందున ధరలు తగ్గాయి   అయనప్పటికీ  మిగిలిన పప్పు ధాన్యాలు అన్నిటికన్నా ధర బాగానే ఉంది తక్కువ రోజుల్లో తక్కువ పెట్టుబడితో , కేవలం 90 రోజుల్లో పండే  పంట ఇది ఒక్కటే. ఈ సంవత్సరం దేశం మొత్తం మీద వర్షపాతం బాగున్నందున అన్ని పంటలు బాగా పండే అవకాసం ఉంది , కనుక ఏ పంట కు అతి ఎక్కువ ధరను ఆశించే అవకాసం కనపడటం లేదు కర్చు తక్కువ తో దిగుబడిని పెంచే మార్గమే ఆచరించాలి

 18.8.2013 7.00 AM చాలా  మంది  రైతు మిత్రులు  గోరుచిక్కుడు  గింజల  ధరల  గురించి  ఆందోళన  చెందుతు నాకు  ఫోన్లు  చేస్తున్నారు , కాని  కేవలం  కృత్రిమ  కొరత  శ్రుష్టించి  గత  రెండు  సంవత్సరాలుగా  దీని  ధరను  కొద్ది  మంది  శాశించారు ...కాని  ఈ  పంట  సరళత .. లాభదాయకత  గురించి  దేశం లో  ఇతర  ప్రాంత  రైతులు  కూడా తెలుసుకోవడం  తో  ఇప్పుడు  దేశం  లో  ఈ  పంట  విస్తీర్ణం  బాగా  పెరిగింది , దాంతో  మంచి  ధర   వస్తుంది  అనే  ఆశతో  నిలువ  చేసుకున్న  రైతులు  ఇప్పుడు  తమ  పంటను  అమ్మడం  తో  మార్కెట్  లో  ధరలు  తమ  సాధారణ  స్థాయి  కి  వచ్చాయి ,  బహుళ  ప్రయోజనాలు  / ఉపయోగాలు  కలిగి  ఉన్న  ఈ  గోరుచిక్కుడు   జిగురు  ను  ఎ  విధం గా  ఉపయోగిస్తారో  తెలుసుకుంటే  మీరు  ఆశ్చర్య పోతారు ,  ఉదయం  మనం  వాడే  టూత్ పేస్టు  దగ్గరనుండి  మనం  దిన నిత్యం  ఉపయోగించే  అనేక  పదార్థాలలో  ఈ  జిగురు  ను  విరివి  గా  ఉపయోగిస్తారు, కనుక ధర  సాధారణ  స్థాయిలో ఉంటె  దీని  వినియోగం  ఎన్నో  రెట్లు  పెరిగే  అవకాశం  ఉంది కనుక రైతులు ఆందోళన  చెందాల్సిన  అవసరం  లేదు , ఈ  రోజు  కంది  పెసర, మినుము, సెనగ , సోయా చిక్కుడు  లాంటి  అనేక  పంటలకన్నా  దీని సాగులో  లేబర్  అవసరం  తక్కువ ,  , నీరు, ఎరువులు , పురుగుమందులు మొదలైన   కర్చులు  పై  పేర్కున్న  మిగిలిన  పంటలతో  పోల్చుకున్నప్పుడు  ఈ  పంట  లాభదాయకం , ఉత్పత్తి  ఖర్చు  తగ్గించి దిగుబడిని  పెంచే  మార్గాన్ని  రైతులు  అనుసరించాలి , సాధారణ  స్థాయి  లో  ధర  ఉంటె  ప్రపంచ  వ్యాప్తంగా అనేక  రెట్లు వినియోగం  పెరిగి , భారత  రైతులకు  మరియు  ప్రభుత్వానికి  ఆదాయాన్ని  సమకూర్చే  జిగురు  గోరుచిక్కుడు కు  మరేది  సాటి  రాదు 

28.8.2013 :a new solution for the seepage problems in fields : recently scientists from Hariyana have discovered a new way to tackle the problem of seepage water in the fields , and its simple, what one has to do is to plant a nilgiri plant in that area, its called as Bio Drainage system.  :(for more info please go to this link :http://www.indg.in/agriculture/crop_production_techniques/biodrainage.pdf

28.8.2013 :రైతు సోదరలoతా  మీ  మీ  అవసరాలకు  కావాల్సిన , కూరగాయలు తప్పనిసరిగా మీరే  పండించుకోవాల్సిన అవసరం  కనపడుతుంది , భారత దేశం లో కూరగాయల ధరలు అమెరికా ను  మించి పోయి నట్టు  ఒక  అమెరికా  మిత్రుడు  తెలియజేసారు , కారణాలు  ఏమైనా , కూరగాయల  ధరలు సమీప  భవిష్యత్  లో తగ్గే  అవకాశం  కనుపదటంలేదు , అయెతే మిగిలిన మీరు  పండించే  పంటలకు  కూడా గిట్టు బాటు  ధర దొరకటం  కూడా కష్టమే , ఈ పరిస్తితిలుల్లో రైతుల ఆర్ధిక  పరిస్థితి పూర్తిగా క్షి నించే  అవకాశాలు  ఉన్నాయ్ , యువ రైతులు ఈ  విషయాలు అన్ని  మీ తోటి  రైతులకు తెలియచేస్తూ   ప్రస్తుత  ఆర్ధిక  సంకట  పరిస్తి  నుండి దేశం  కోలుకునే  వరకు ఎన్ని  కష్టాలు  ఉన్నా  రైతులు  ఆత్మహత్యే  పరిష్కారం  అనే స్తితి  నుంచి వారిని కాపాడవలసిన  భాద్యత మన లాంటి వారి  పై  ఉంది